
సాక్షి, అమరావతి: జిందాల్ యాజమాన్యానికి ఏపీ ప్రభుత్వం తరఫున వైద్య, ఆరోగ్యశాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఒడిశాలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ నుంచి ఏపీకి ట్యాంకర్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రానికి జిందాల్ ఫ్యాక్టరీ ప్రతిరోజూ 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపుతోంది. ఆక్సిజన్ కొరత తీరే వరకు సరఫరా కొనసాగుతుందన్న జిందాల్ యాజమాన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్యాంకర్ ద్వారా ఆక్సిజన్‌ప పంపించినందుకు జిందాల్ ఫ్యాక్టరీకి వైద్యారోగ్యశాఖ కృతజ్ఞతలు తెలిపింది.