Jindal Steel plant
-
ఏపీ: జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్‌కు భూములు కేటాయింపు
-
ఏపీ: జిందాల్ స్టీల్ కంపెనీకి భూములు కేటాయింపు
సాక్షి, అమరావతి: జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 860 ఎకరాల భూములు కేటాయించింది. నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం మొమిడిలో ఈ భూములు కేటాయించింది. మొత్తం 7,500 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరగనుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 2,500 మంది, పరోక్షంగా 15వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ క్రమంలో ఏపీఐఐసీకి(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) భూముల కేటాయింపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జిందాల్ యాజమాన్యానికి వైద్యారోగ్యశాఖ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: జిందాల్ యాజమాన్యానికి ఏపీ ప్రభుత్వం తరఫున వైద్య, ఆరోగ్యశాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఒడిశాలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ నుంచి ఏపీకి ట్యాంకర్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రానికి జిందాల్ ఫ్యాక్టరీ ప్రతిరోజూ 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపుతోంది. ఆక్సిజన్ కొరత తీరే వరకు సరఫరా కొనసాగుతుందన్న జిందాల్ యాజమాన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్యాంకర్ ద్వారా ఆక్సిజన్ప పంపించినందుకు జిందాల్ ఫ్యాక్టరీకి వైద్యారోగ్యశాఖ కృతజ్ఞతలు తెలిపింది. -
జిందాల్లో ‘ఆగడు’ సినిమా షూటింగ్
సాక్షి, బళ్లారి : ప్రిన్స్ మహేష్‌బాబు ‘ఆగడు’ షూటింగ్ బళ్లారి జిల్లా తోరణగల్లులోని జిందాల్ స్టీల్ ప్లాంటులో ఐదు రోజుల నుంచి జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను మూడు నెలల క్రితం జిందాల్ స్టీల్ ప్లాంటులో తీసిన సంగతి తెలిసిందే. పాటలు, ఫైటింగ్‌లతోపాటు ఇతరత్రా వినోద సన్నివేశాల చిత్రీకరణ కోసం మహేష్‌బాబు వారం రోజుల నుంచి జిందాల్లో షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆదివారం ఉదయం కూడా మహేష్‌బాబు షూటింగ్లో పాల్గొన్న అనంతరం వైద్యులు పరీక్షించి జ్వరం వచ్చినట్లు తెలపడంతో షూటింగ్‌కు విరామం తీసుకున్నాడు. విపరీతమైన దుమ్మూ-ధూళితో కూడిన సన్నివేశం షూటింగ్లో పాల్గొనడంతో మహేష్‌బాబు కాస్త అనారోగ్యానికి గురైనట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. మరో వారం రోజులు జిందాల్లోనే బస చేసి షూటింగ్లో పాల్గొంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.