
294 ఎకరాల భూమి వెనక్కు ఇవ్వనున్న జిందాల్
స్టీల్, విద్యుత్, సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు తీసుకున్న భూమిని జిందాల్ సంస్థ్ వెనక్కు ఇచ్చేయనుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.
కోల్కతా: స్టీల్, విద్యుత్, సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు తీసుకున్న భూమిని జిందాల్ సంస్థ్ వెనక్కు ఇచ్చేయనుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అధికారికంగా కేటాయించిన 294 ఎకరాల భూమిని రైతులకు తిరిగిచ్చేయాలని జేఎస్ డబ్ల్యూ బెంగాల్ సంస్థ తమకు సమాచారం పంపిందని చెప్పారు.
ఈ భూమిని రైతులకు పంపిణీ చేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భూమి వెనక్కు ఇచ్చేయడం, పరిశ్రమలు రద్దు చేసుకోవడం ద్వారా సుమారు రూ.700 కోట్లు నష్టం కలుగుతుందని జిందాల్ సంస్థ అంచనా వేసింది.