amar nath
-
అమర్నాథ్ హత్యపై టీడీపీ శవరాజకీయం
సాక్షి, ప్రతినిధి, గుంటూరు :రెండు కుటుంబాల మ ధ్య చెలరేగిన ఘర్షణను రాజకీయం చేసి.. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ నేతలు చేసిన శవ రాజకీయాలు బెడిసికొట్టాయి. అడుగ డుగునా అడ్డంకులు సృష్టించి లేనిపోని ఆరోపణలు చేద్దామనుకున్న టీడీపీ నేతల ఆటలు సాగలేదు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారి పాలెంకు చెందిన యువకుడు ఉప్పాల అమర్నాథ్ ను కొందరు వ్యక్తులు కుటుంబ వివాదాల నేపథ్యంలో పెట్రోల్ పోసి తగులబెట్టి హత్యచేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. అమర్నాథ్ మృతదేహంతో చెరుకుపల్లి సెంటర్లో ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతిని తమకు అనుకూలంగా మార్చుకుని అలజడి సృష్టించేందుకు యత్నించారు. కానీ, నిందితులను గంటల వ్యవధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ మోపిదేవి అడ్డగింత.. అమర్నాథ్ మృతదేహాన్ని చూసి అతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావును అడ్డుకున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాలను గమ నించిన ఎంపీ మోపిదేవి ప్రతి ఒక్కరూ సంయ మనంతో వ్యవహరించాలని కోరారు. మృతుడి కుటుంబానికి ఎంపీ వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నా.. వారికి వద్దంటూ టీడీపీ నేతలే అడ్డుకోవటం గమనార్హం. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీ చెప్పారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. అది రెండు కుటుంబాల మధ్య ఘర్షణే : ఎస్పీ రెండు కుటుంబాల మధ్య ఘర్షణే ఈ హత్యకు దారి తీసిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే హత్య జరిగిన గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో ఎటువంటి రాజకీయ కోణంలేదని ఆయన తేల్చిచెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటీకీ టీడీపీ నేతలు వారిని అరెస్టుచేయలేదని వ్యాఖ్యలు చేయటం వివాదా స్పదమయ్యాయి. మరో నిందితుడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. సీఎం జగన్ రూ.10 లక్షల సాయం ఇక మృతుడు అమర్నాథ్ కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడేలా రూ.10 లక్షల చెక్కును పంపారు. ప్రభు త్వం అన్ని విధాలుగా బాధిత కుటుంబానికి సాయం అందిస్తుందని స్పష్టంచేశారు. చెక్కును ఆదివారం అందజేస్తారు. -
అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం
చెరుకుపల్లి: తన అక్కను వేధించవద్దని చెప్పిన పదో తరగతి విద్యార్థిపై ఓ యువకుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలవారిపాలెంలో శుక్రవారం జరిగింది. బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ కథనం ప్రకారం... రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలపాలేనికి చెందిన ఉప్పాల మాధవి కుమారుడు ఉప్పాల అమర్నా«థ్ (15) ఉదయం ఐదు గంటల సమయంలో రాజవోలుకు సైకిల్‌పై ట్యూషన్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ), అతని స్నేహితులు మరో ముగ్గురు కలిసి అమర్నాథ్ను అడ్డగించి సైకిల్ లాక్కుని రోడ్డు పక్కన మొక్కజొన్న బస్తాలు వేసిన చోటుకు తీసుకువెళ్లి దాడి చేశారు. అనంతరం ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్‌ను అమర్నాథ్పై పోసి నిప్పు అంటించి అక్కడ నుంచి పారిపోయారు. మంటలు రావటంతో సమీపంలోని గ్రామస్తులు గమనించి ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన అతడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. గతంలోనూ దాడి.. పదో తరగతి ఫెయిల్ అయి ఖాళీగా తిరుగుతున్న పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ) కొంతకాలంగా అమర్నా«థ్ అక్కను టీజ్ చేస్తున్నాడు. దీంతో వెంకీ, అమర్నాథ్ మధ్య గొడవ జరిగింది. అమర్నా«థ్పై వెంకీ దాడి చేశాడు. ఈ విషయం వెంకీ కుటుంబ సభ్యుల దృష్టికి కూడా అమర్నాథ్ తరఫు పెద్దలు తీసుకెళ్లారు. పాఠశాలలకు సెలవులు రావడంతో వీరు కలవలేదు. తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో అమర్నా«థ్, ట్యూషన్, స్కూలుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మార్గంమధ్యలో అమర్నాథ్ను వెంకీ అడ్డగించి బెదిరించటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వెంకీ తన స్నేహితులతో కలిసి శుక్రవారం అమర్నాథ్పై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. అమర్నాథ్ తండ్రి నాంచారయ్య గతంలోనే మరణించారు. అమర్నాథ్ తల్లి మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
'అనంత'లో హంతకుల ముఠా అరెస్టు
అనంతపురం: అనంతపురం జిల్లాలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరులో ఒకరిని చంపేందుకు పన్నిన కుట్రను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. వివరాలు.. పట్టణానికి చెందిన అమర్నాథ్, గోపీనాయక్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ హత్య కేసులో నిందితులుగా ఉండి జైలుకు వెళ్లారు. అక్కడే ఇద్దరికీ పరిచయం ఏర్పడి, మంచి స్నేహితులయ్యారు. అనంతరం వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఎవరికి వారు గ్రూపులను ఏర్పాటు చేసుకుని, కత్తులు దూసునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గోపీనాయక్‌ను చంపేందుకు అమర్నాథ్ ఐదుగురు కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆదివారం ఆ ముఠా మారణాయుధాలతో సంచరిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 వేటకొడవళ్లు, 2 కత్తులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. -
అమర్ బుడ్డా నాథ్