అనంతపురం: అనంతపురం జిల్లాలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరులో ఒకరిని చంపేందుకు పన్నిన కుట్రను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. వివరాలు.. పట్టణానికి చెందిన అమర్‌నాథ్, గోపీనాయక్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ హత్య కేసులో నిందితులుగా ఉండి జైలుకు వెళ్లారు. అక్కడే ఇద్దరికీ పరిచయం ఏర్పడి, మంచి స్నేహితులయ్యారు. అనంతరం వారి మధ్య విభేదాలు తలెత్తాయి.
ఎవరికి వారు గ్రూపులను ఏర్పాటు చేసుకుని, కత్తులు దూసునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గోపీనాయక్‌ను చంపేందుకు అమర్‌నాథ్ ఐదుగురు కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆదివారం ఆ ముఠా మారణాయుధాలతో సంచరిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 వేటకొడవళ్లు, 2 కత్తులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
'అనంత'లో హంతకుల ముఠా అరెస్టు
Published Sun, Jul 12 2015 6:59 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement
Advertisement