సాక్షి, విశాఖపట్నం: నగరంలో రౌడీ గ్యాంగ్ లపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. విశాఖ నగరంలో రెండు రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ వార్ పై ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనని వెంబడించి రాడ్లతో దాడికి ప్రయత్నించారంటూ రూపేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 147,148,149లగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు రాకేష్, రౌడీషీటర్ మురళికృష్ణలను అరెస్ట్ చేశారు. రాకీ దొండపర్తిలో నివాసముంటూ యానిమేషన్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. అక్కయ్యపాలెంలో నివాసముండే పెద్దిశెట్టి రూపేష్ పై ఫోర్త్ టౌన్, కంచరపాలెం, పెందుర్తి లో దొంగతనం కేసులు, సస్పెక్ట్ షీట్ లు ఉన్నాయి.
ఈ క్రమంలో తనని దొంగ రూపేష్ అంటూ ప్రచారం చేయడానికి రాకీ ప్రయత్నిస్తున్నారంటూ రూపేష్ కొద్ది రోజుల క్రితం రాకీ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రూపేష్ పై రాకీ కక్ష పెట్టుకుని జరిగిన విషయాన్ని తన స్నేహితులకి చెప్పాడు. దీంతో అతని స్నేహితులపై మోటార్ సైకిళ్లపై రామచంద్ర నగర్ లో రాడ్లతో రూపేష్ ను వెంబడించి దాడికి ప్రయత్నించారు. ఈ సమయంలో తప్పించుకోవడానికి రామచంద్రనగర్ లోని సందులలోకి రూపేష్ ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. మోటార్ సైకిళ్లపై వెంబడిస్తున్న సమయంలో వీధులలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకి గాయాలయ్యాయి. ఈ రౌడీ గ్యాంగ్ ల హల్ చల్ పై విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు తీవ్రంగా స్పందించి కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు రాకీ, రౌడీషీటర్ మురళికృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. పరారీలో ఉన్న నిందితులు, ప్రత్యేక బృందాలు తో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
అలజడి సృష్టిస్తే సహించం..
రూపేష్, రాకీల మధ్య పాత గొడవలు లేవని విశాఖ ఫోర్త్ టౌన్ సిఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. రూపేష్ పై నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉందని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి రాకీ, రౌడీ షీటర్ మురళిని అరెస్ట్ చేశామని, మిగిలిన ఐదుగురు కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఈ తరహా గ్యాంగ్ వార్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు. ప్రశాంతమైన విశాఖలో అలజడి సృష్టించాలని చూస్తే సహించేదిలేదని సీఐ ప్రేమ్‌కుమార్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment