rowdy gang
-
హడల్ పుట్టిస్తున్న రంగూన్ రాణులు
-
హైదరాబాద్ లో రెచ్చిపోయిన దుండగులు
-
ఆయుధ అలజడి...తరచూ తుపాకులు, తూటాలు కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తరచూ తుపాకులు ‘దొరుకుతున్నాయి’. అక్రమ ఆయుధాలు వినియోగిస్తున్న, రవాణా చేస్తున్న, కలిగి ఉన్న వారితో పాటు లైసెన్స్ ఉన్న ఆయుధాలను దుర్వినియోగం చేసిన వారిని పట్టుకోవడం నాణేనికి ఒక వైపైతే... చెత్త కుప్పలు, చెట్ల పొదల్లో అక్రమాయుధాలు, తూటాలు లభిస్తుండటం మరో వైపైంది. తాజాగా శుక్రవారం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో లభించిన రెండు తపంచాలు, ఓ కంట్రీమేడ్ రివాల్వర్ తీవ్ర కలకలం సృష్టించాయి. గతంలో రెండు సందర్భాల్లో ఇలా ఆయుధాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. ఆ కేసులు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాజా ఉదంతంతో సహా మొత్తం మూడూ శుక్రవారాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. మొదటగా గాంధీ ఆస్పత్రి సమీపంలో... సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో 2013 ఫిబ్రవరి 15న (శుక్రవారం) ఆయుధాలు, తూటాలు లభించాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఇవి దొరికాయి. ఈ ప్రాంతాల మధ్య కేవలం కిలోమీటరు దూరమే ఉండటంతో ఒకరి పనిగానే అనుమానించారు. సదరు తుపాకులు, తూటాలు దాదాపు 40 ఏళ్ల క్రితం నాటివిగా అంచనా వేశారు. పద్మారావునగర్‌లో ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులు చెత్తను డబ్బాలో వేసేందుకు వెళ్లారు. అందులో ప్లాస్టిక్ గోనెసంచిలో కట్టిన రెండు తుపాకులు (రైఫిల్స్ మాదిరివి) కనిపించాయి. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలకలం కొనసాగుతుండగానే... మరో అరగంటకు షాబాద్‌గూడ నుంచి మరో సమాచారం వచ్చింది. రామచంద్రయ్య అనే వ్యక్తి చెత్త పడేసేందుకు తన ఇంటి సమీపంలోని డబ్బా వద్దకు వెళ్లగా... అందులో తూటాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తుపాకులు, తూటాలు సైతం అమెరికాలో తయారైనవిగా వెల్లడైంది. రెమింగ్టన్ కంపెనీకి పాయింట్ 410 ఎంఎం, 0.38 ఆర్మీడ్, 3.57 రేంజర్ క్యాలిబర్లతో కూడిన తూటాలు మొత్తం వంద వరకు, మరికొన్ని ఖాళీ క్యాట్రిడ్జ్‌లు (కాల్చేయగా మిగిలినవి) ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిని పాన్ల్లో వినియోగించే ఖాళీ జర్దా డబ్బాలో, మరికొన్ని ప్రముఖ మిఠాయి దుకాణం కర్నూలు బ్రాంచ్‌కు చెందిన డబ్బాలో ఉంచి చెత్తడబ్బాలో పడేశారు. మూడేళ్ల క్రితం రైల్వేస్టేషన్ వద్ద... హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో 2019 డిసెంబర్ 20న (శుక్రవారం) రెండు రివాల్వర్లు దొరికాయి. ఆ రోజు రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఉంటారని, వాళ్లే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా భావించి ఆ కోణంలోనూ ఆరా తీశారు. అక్రమ రవాణా ముఠాలు, దోపిడీ దొంగలు, రౌడీ షీటర్లు, మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు.. వీళ్లల్లో ఎవరైనా తీసుకువచి్చ, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారని అంచనా వేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జటిలమే... సాధారణంగా కంపెనీల్లో తయారయ్యే మారణాయుధాలకు కొన్ని సీరియల్ నెంబర్లు, బ్యాచ్ నెంబర్లు తదితరాలు ఉంటాయి. ఇవి ఎక్కడైనా లభిస్తే ఈ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్లి బాధ్యలను గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాటు తుపాకులు, తపంచాలకు ఇలాంటి లేకపోవడంతో పాటు విదేశాల్లో తయారైన వాటికి ఇవి ఉన్నా ఫలితం ఉండట్లేదు. నగరానికి నాటు తుపాకులు, తపంచాలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి. ఇలాంటివి లభించినప్పుడు వాటి రూపం, పిడి ఉన్న తీరుతెన్నుల్ని బట్టి బాలిస్టిక్ నిపుణులు సైతం ఏ ప్రాంతంలో తయారైందో మాత్రమే చెప్పలగరు. ఇంతకు మించి ముందుకు వెళ్లడానికి సీసీ కెమెరాలు వంటి వాటిపై ఆధారపడాల్సిందే. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాటిలోనూ సరైన ఆధారాలు లభించట్లేదు. ఫలితంగా ఈ అక్రమ ఆయుధాల కేసులు బాధ్యులు గుర్తించడం జరగకుండానే పెండింగ్‌లో ఉండి క్లోజ్ అయిపోతున్నాయి. (చదవండి: రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..) -
పార్కింగ్ గొడవ, రెచ్చిపోయిన రౌడీ మూక
-
ఇంట్లో చొరబడి ఎవర్నీ వదల్లేదు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కుల్సుంపురలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ వర్గానికి చెందిన రౌడీ మూక మరో వర్గంపై రాళ్లు, తల్వార్లతో దాడి చేసింది. కుల్సుంపురలోని ముస్తైద్‌పురా బస్తీలో నివాసముండే ఫరూక్ హుస్సేన్ తన ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. అటుగా వచ్చిన ఫిరోజ్ అలియాస్ అల్లూ వచ్చి రోడ్డుపై బైక్ ఎందుకు పెట్టావంటూ గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా తన సోదరులు దర్వేష్ అలియాస్ బబ్బు, జాఫర్, మరికొంత మందితో కలిసి ఫరూక్ హుస్సేన్ ఇంటిని చుట్టుముట్టారు. బైక్‌ని ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి కిటికీలు, టీవీ, మొబైల్ ఫోన్లు పగులగొట్టారు. అడ్డొచ్చిన ఫరూక్ కుమారుడిపై తల్వార్‌తో దాడి చేశారు. చంపేస్తామని తుపాకీతో బెదిరించారు. ఇంట్లోని మహిళలపై సైతం పిడిగుద్దుల వర్షం కురిపించారు. అయితే, దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు ఫిర్యాదును స్వీకరించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. గాయాలపాలైన ఫరూక్ హుస్సేన్ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. (చదవండి: నగరపాలక సంస్థలో బయటపడ్డ అవినీతి) -
విశాఖ గ్యాంగ్‌వార్.. పోలీసులు సీరియస్..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో రౌడీ గ్యాంగ్ లపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. విశాఖ నగరంలో రెండు రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ వార్ పై ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనని వెంబడించి రాడ్లతో దాడికి ప్రయత్నించారంటూ రూపేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 147,148,149లగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు రాకేష్, రౌడీషీటర్ మురళికృష్ణలను అరెస్ట్ చేశారు. రాకీ దొండపర్తిలో నివాసముంటూ యానిమేషన్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. అక్కయ్యపాలెంలో నివాసముండే పెద్దిశెట్టి రూపేష్ పై ఫోర్త్ టౌన్, కంచరపాలెం, పెందుర్తి లో దొంగతనం కేసులు, సస్పెక్ట్ షీట్ లు ఉన్నాయి. ఈ క్రమంలో తనని దొంగ రూపేష్ అంటూ ప్రచారం చేయడానికి రాకీ ప్రయత్నిస్తున్నారంటూ రూపేష్ కొద్ది రోజుల క్రితం రాకీ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రూపేష్ పై రాకీ కక్ష పెట్టుకుని జరిగిన విషయాన్ని తన స్నేహితులకి చెప్పాడు. దీంతో అతని స్నేహితులపై మోటార్ సైకిళ్లపై రామచంద్ర నగర్ లో రాడ్లతో రూపేష్ ను వెంబడించి దాడికి ప్రయత్నించారు. ఈ సమయంలో తప్పించుకోవడానికి రామచంద్రనగర్ లోని సందులలోకి రూపేష్ ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. మోటార్ సైకిళ్లపై వెంబడిస్తున్న సమయంలో వీధులలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకి గాయాలయ్యాయి. ఈ రౌడీ గ్యాంగ్ ల హల్ చల్ పై విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు తీవ్రంగా స్పందించి కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు రాకీ, రౌడీషీటర్ మురళికృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. పరారీలో ఉన్న నిందితులు, ప్రత్యేక బృందాలు తో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అలజడి సృష్టిస్తే సహించం.. రూపేష్, రాకీల మధ్య పాత గొడవలు లేవని విశాఖ ఫోర్త్ టౌన్ సిఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. రూపేష్ పై నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉందని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి రాకీ, రౌడీ షీటర్ మురళిని అరెస్ట్ చేశామని, మిగిలిన ఐదుగురు కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఈ తరహా గ్యాంగ్ వార్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు. ప్రశాంతమైన విశాఖలో అలజడి సృష్టించాలని చూస్తే సహించేదిలేదని సీఐ ప్రేమ్‌కుమార్ హెచ్చరించారు. -
విశాఖలో రౌడీ గ్యాంగ్ అరాచకం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగర శివారు ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. బాకీ సొమ్ము ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడ్ని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా చితకబాదింది ఓ రౌడీ గ్యాంగ్. మారికవలసలోని రాజీవ్ గృహ కల్ప వద్ద జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం మారికవలస ప్రాంతానికి చెందిన దంతేశ్వరరావ్ అనే యువకుడు తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ రౌడీ గ్యాంగ్ అతడిపై దాడికి దిగింది. చెట్టుకు కట్టేసి వచక్షణా రహితంగా హింసింది. అతడ్ని బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు గ్యాంగ్ సభ్యులు. ( అమ్మా.. నేనూ నీవెంటే! ) ఒకానొక దశలో అతడి మెడకు తాడు బిగించి గట్టిగా లాగటంతో ఊపిరాడక గిలగిలలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు. గ్రూపుగా ఏర్పడ్డ కొందరు యువకులు గత ఆరునెలలుగా రౌడీ ఇజానికి పాల్పడుతున్నట్లు తేలింది. ( సారా కోసం వెళ్లి.. ఆటోలో శవమై..) -
అటు వైపు వెళ్తే.. అంతే సంగతులు
వాళ్లు మృగాళ్లు.. మనుషుల రూపంలో ఉన్న కామపిశాచులు.. అమ్మాయి, మహిళ ఒంటరిగా కనబడితే చాలూ వదలిపెట్టరు.. అటు వైపు వచ్చే ప్రేమ జంటలు.. ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన వారిపై మూకుమ్మడిగా దాడి చేయడం.. యువతులపై లైంగికదాడులకు పాల్పడడం వారికి నిత్యకృత్యం. ఎప్పుడూ ఆ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్న వీరు ఇప్పటికే పదుల సంఖ్యలో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. విషయం బయటికి తెలిస్తే పరువుపోతుందనే భయంతో బాధితులు బయట చెప్పుకోలేకపోతున్నారు. దీన్ని అదునుగా చేసుకుని ఈ రౌడీగ్యాంగ్ అడ్డూఅదుపులేకుండా అకృత్యాలకు పాల్పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్రం సమీపంలో వరుసగా జరుగుతున్న ఘటనలు వేలెత్తిచూపుతున్నాయి. సాక్షి, జగిత్యాల : జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అంబరిపేట, లింగంలపేట, హస్నాబాద్ అటవీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా హస్నాబాద్‌కు చెందిన ప్రేమజంటను బ్లాక్మెయిల్ చేసిన ఆ గ్యాంగ్ ఒకరి తరువాత మరొకరు నలుగురు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి ఆరోగ్యం క్షీణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో ఆ గ్యాంగ్ సభ్యులను గుర్తించిన బాధితురాలి బంధువులు వారిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో అతను తాము చేసిన నేరాలనూ ఒప్పుకున్నాడు. కేవలం వీరే కాదూ.. ఇలాంటి కామాంధులు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. లవర్స్ స్పాట్...! జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అంబరిపేట లవర్స్‌స్పాట్‌గా పేరొందింది. గుట్ట ప్రాంతం కావడం, జన సంచారం లేక నిర్మానుష్యంగా దర్శనమిచ్చే ఆ ప్రాంతంలో ప్రేమజంటలు వాలుతుంటారు. అక్కడ ప్రేమాయణం ముగించుకుని తిరుగుముఖం పడుతున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండడంతో ప్రతి రోజు ఎంతో మంది ప్రేమికులు లవర్స్‌స్పాట్‌కు పరుగులు పెడుతున్నారు. వీరిలో కాలేజీ విద్యార్థినీ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. అటువైపు పోలీసులూ దృష్టిసారించకపోవడంతో ఆ ప్రాంతం వ్యభిచారానికీ కేరాఫ్‌గా మారింది. అంతేకాదూ.. ధర్మపురికి వెళ్లే దారిలో ఉన్న ముప్పాలచెర్వు... గొల్లపల్లికి వెళ్లే దారిలో ఉన్న నల్లగుట్టతోపాటు జాబితాపూర్ అడవి ప్రాంతంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ జరుగుతున్న వ్యవహారాలు బయటికి పొక్కకపోవడంతో అది తెలియక యువతులు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. రంగంలో పోలీసులు..! హస్నాబాద్ సంఘటన వెలుగులోకి రావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ అనంతశర్మ, జగిత్యాల టౌన్ సీఐ ప్రకాశ్ ఈ నెల 3న హస్నాబాద్, లింగంపేట, అంబరిపేట ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ పరిస్థితులపై ఆరాతీశారు. మొబైల్ టీంను ఏర్పాటు చేసి.. అంబరిపేట, హస్నాబాద్, లింగంపేట మార్గం మధ్యలో నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. రెండ్రొజుల్లో ఔట్‌కట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరిట పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేస్తామని ఎస్పీ అనంతశర్మ తెలిపారు. -
గన్ గ్యాంగ్
రాజధానిలో రౌడీయిజం బరితెగిస్తోంది. టీడీపీ పెద్దల అండదండలే దన్నుగా రౌడీమూకలు విశృంఖలత్వానికి దిగుతున్నాయి. దశాబ్దం క్రితం సద్దుమణిగిన రౌడీయిజానికి పాలకులు పాలుపోసి పెంచుతున్నారు. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లే పంథాగా.. భూ సెటిల్మెంట్లే దందాగా.. రాజకీయ ప్రత్యర్థులే అంతిమ లక్ష్యంగా రౌడీయిజం వెర్రితలలు వేస్తోంది. కానీ, పోలీసులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఎందుకంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సాన్నిహిత్యం. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆశ్రయం. తాజాగా హైదరాబాద్ పోలీసులు అక్రమ ఆయుధాల కొనుగోలు కేసును ఛేదించగా హత్యా రాజకీయాలకు బరితెగిస్తున్న రౌడీషీటర్లతో విజయవాడ టీడీపీ పెద్దల సంబంధాలు బయటపడ్డాయి. సాక్షి, అమరావతి బ్యూరో : హైదరాబాద్ పోలీసులు శనివారం ఛేదించిన ఓ కేసు విజయవాడలో రౌడీయిజం, అందుకు టీడీపీ పెద్దల సహకారాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన పొట్లూరి ఈశ్వర్, తెల్లగోర్ల సునీల్‌కుమార్‌ను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న వీరిద్దరూ విజయవాడకు చెందిన సుబ్బు అనే రౌడీషీటర్‌కు విక్రయించేందుకు బీహార్ నుంచి అక్రమంగా తుపాకులు తెప్పించారు. దీనిపై ఉప్పందడంతో పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. కాగా, అక్రమంగా తుపాకులు కొనుగోలుకు యత్నించిన విజయవాడకు చెందిన సుబ్బు ఎవరన్నది తెలుసుకునేందుకు యత్నించగా, మొత్తం వ్యవహారం బయటపడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాళిదాస్ సుబ్రహ్మణ్యం అలియాస్ వేమూరి సుబ్బు కొన్నేళ్లుగా విజయవాడలో ఉంటున్నాడు. అతను టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో కలిసి తిరిగేంత సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాకు అనుచరుడిగా ఉన్నాడు. నేరచరిత్ర.. సుబ్బు నేరచరిత్ర భీతిగొలిపేదిగా ఉంది. సుబ్బు పేరు మోసిన రౌడీషీటర్. గతంలో తెనాలిలో దాడులు, ప్రతిదాడుల్లో అతని పాత్ర ఉంది. సుబ్బు సోదరుడు కూడా హత్యకు గురయ్యాడు. తెనాలి పోలీసులు సుబ్బుపై జిల్లా బహిష్కరణ విధించగా, అతను విజయవాడకు మకాం మార్చాడు. అప్పటి నుంచి టీడీపీ నేతలకు సన్నిహితుడిగా ఉంటున్నాడు. గతంలో కాట్రగడ్డ బాబుకు అనుచరుడిగా వ్యవహరించాడు. అప్పట్లో వంగవీటి శంతన్‌కుమార్‌పై కాల్పుల జరిపింది సుబ్బు అని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో అతను నిందితుడు. అనంతరం సుబ్బును టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేరదీసినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఉమా తరఫున నగరంలో కీలక వ్యవహారాలన్నీ అతనే పర్యవేక్షిస్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతను చంద్రబాబు, లోకేష్‌కు కూడా సన్నిహితుడయ్యారు. దాంతో మూడేళ్లుగా సుబ్బు ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పోలీసులు కూడా సుబ్బు ఆగడాలపై ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. తాజాగా, సుబ్బు అక్రమ ఆయుధాలు సమకూర్చుకోవడానికి యత్నించడం రాజధానిలో కలకలం రేపుతోంది. ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఆయుధాలు సమకూర్చుకుంటున్నారో అన్నది చర్చనీయాంశంగా మారింది. సుబ్బు కోసం హైదరాబాద్ పోలీసులు శని, ఆదివారాల్లో విజయవాడ వచ్చారు. రాజకీయ ఒత్తిళ్లకు విజయవాడ పోలీసులు వారికి సహకరించలేదని సమాచారం. రౌడీలే రౌడీలు ఒక్క సుబ్బు వ్యవహారమే కాదు.. రాజధానిలో రెండేళ్లుగా రౌడీమూకల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. టీడీపీ పెద్దల అండతోనే వ్యూహాత్మకంగా రౌడీమూకలు నగరంలో విస్తరిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం విజయవాడలో 274 మంది రౌడీషీటర్లు, 130 మంది కేడీలు, 70మంది బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు ఉన్నారు. నలుగురు కరడుగట్టిన రౌడీషీటర్లను నగరం నుంచి బహిష్కరించారు. కానీ, ఈ రౌడీలంతా నగరంలో యథేచ్ఛగా దందాలు సాగిస్తూనే ఉన్నారు. నగర బహిష్కరణకు గురైన ఖల్నాయక్ అనే రౌడీషీటర్‌పై ఆరు నెలల్లో నాలుగు చార్జిషీట్లు నమోదయ్యాయి. నగర బహిష్కరణకు గురైన రౌడీ దర్జాగా ఎలా నగరంలో దందాలు సాగిస్తున్నాడో అనేది పోలీసులు పట్టించుకోలేదు. ఫలితంగా రెండు నెలల క్రితం ఖల్నాయక్ ఒకరిని హత్య చేశాడు. ♦ గుంటూరు జిల్లాలో బహిష్కరణకు గురైన సుబ్బును టీడీపీ ప్రజాప్రతినిధి చేరదీశారు. రాజరాజేశ్వరిపేటలో ఆశ్రయం కల్పించారు. అక్కడి నుంచే దందాలు కొనసాగిస్తున్నాడు. ♦ వ్యూహాత్మకంగానే రౌడీమూకలను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కేంద్రీకరిస్తున్నారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను కూడా ఇటీవల పాయకాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోకి మార్పించారు. వారిపై పోలీసుల పర్యవేక్షణ లేకుండా చేయడానికే ఓ ప్రజాప్రతినిధి ఇలా చేయించారు. ♦ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వ్యాపారులే లక్ష్యంగా దందాలు చేస్తున్నారు. రెండేళ్లలో ఏకంగా 50 వరకు దుకాణాలను బలవంతంగా ఖాళీ చేయించారు. ♦ పాయకాపురం, కొత్త ఆర్‌ఆర్‌పేట, అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్మెంట్లు, బలవంతపు వసూళ్లు, కాల్‌మనీ ఆడగాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు అజిత్‌సింగ్‌నగర్‌లో పర్యటించినప్పుడు మహిళలు రౌడీమూకల వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఫలితం లేకుండాపోయింది. ♦ ఆ ప్రజాప్రతినిధి చేరదీసిన రౌడీ గ్యాంగులే కొన్ని నెలల క్రితం ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కూడా హత్య చేశాయి. ♦ విజయవాడలో కొన్ని నెలల క్రితం హవాలా దందాలో విభేదాలు వచ్చి ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. ♦ ఇటీవల ఓ మహిళా న్యాయవాదిపై హత్యాయత్నం కూడా ఈ గ్యాంగులపనే. -
మామూళ్లు ఇవ్వలేదని రౌడీషీటర్ల బీభత్సం
బంజారాహిల్స్: కార్మికనగర్‌లో గురువారం అర్ధరాత్రి రౌడీషీటర్లు రెచ్చిపోయారు. తాము డబ్బు డిమాండ్ చేస్తే ఇవ్వలేదని ఓ టెంట్‌హౌస్‌లో బీభత్సం సృష్టించడం తో పాటు ఓ వ్యక్తిపై కత్తి తో దాడి చేసి పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీ సుల కథనం ప్రకారం... రహ్మత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్ బ్రహ్మంగారి టెంపుల్ సమీపంలో ఉన్న జ్వాలిత టెంట్‌హౌస్ వద్దకు గురువారం రాత్రి 11గంటలకు స్థానికరౌడీషీటర్లు ఖాలిద్, లక్ష్మణ్ వచ్చారు. తమకు రూ. 5 వేలు కావాలని టెంట్‌హౌస్ యజమాని సురేష్‌తో పాటు అందులో పనిచేస్తున్న ఖదీర్‌ను డిమాండ్ చేశారు. తమ వద్ద అంతడబ్బు లేద ని ఖదీర్ వారికి చెప్పాడు. టెంట్సామాన్ల కోసం వచ్చిన నరేష్ అనే వ్యక్తిని కూడా డబ్బు డిమాండ్ చేయగా... అతను కూడా తన వద్ద డబ్బు లేదన్నాడు. దీంతో ఆగ్రహం పట్టలేక రౌడీషీటర్లు ఖాలిద్, లక్ష్మణ్‌లు టెంట్‌హౌస్‌లోకి వెళ్లి సామా న్లు ఎత్తిపడేసి, గ్లాస్లు.ప్లేట్లు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. దీంతో సురేష్‌తో పాటు అత ని వద్ద పని చేసే ఖదీర్, కరీం భయంతో బయటకు పరుగులు తీశారు. ఖదీర్ పరిగెత్తుతుం డగా లక్ష్మణ్, ఖాలిద్‌లు తాము వచ్చిన ఆటోలో అతడిని వెంబడించి పట్టుకున్నారు. ఆటోలోకి లాగి తీవ్రంగా కొట్టారు. కత్తి తో పొడిచి ఆటోలోంచి అతడిని రోడ్డుపై పడేసి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా స్థానికులు ఖదీ ర్ను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రౌడీషీటర్లపై హత్యాయత్నం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. స్థానికంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన కార్మికనగర్వాసులను భయబ్రాంతులకు గురిచేసింది.ఈ ప్రాంతంలో రౌడీలు దాడి చేయడంతో కత్తులతో పొడవడం తరచూ జరుగుతుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. -
'అనంత'లో హంతకుల ముఠా అరెస్టు
అనంతపురం: అనంతపురం జిల్లాలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరులో ఒకరిని చంపేందుకు పన్నిన కుట్రను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. వివరాలు.. పట్టణానికి చెందిన అమర్నాథ్, గోపీనాయక్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ హత్య కేసులో నిందితులుగా ఉండి జైలుకు వెళ్లారు. అక్కడే ఇద్దరికీ పరిచయం ఏర్పడి, మంచి స్నేహితులయ్యారు. అనంతరం వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఎవరికి వారు గ్రూపులను ఏర్పాటు చేసుకుని, కత్తులు దూసునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గోపీనాయక్‌ను చంపేందుకు అమర్నాథ్ ఐదుగురు కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆదివారం ఆ ముఠా మారణాయుధాలతో సంచరిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 వేటకొడవళ్లు, 2 కత్తులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.