బంజారాహిల్స్: కార్మికనగర్‌లో గురువారం అర్ధరాత్రి రౌడీషీటర్లు రెచ్చిపోయారు. తాము డబ్బు డిమాండ్ చేస్తే ఇవ్వలేదని ఓ టెంట్‌హౌస్‌లో బీభత్సం సృష్టించడం తో పాటు ఓ వ్యక్తిపై కత్తి తో దాడి చేసి పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీ సుల కథనం ప్రకారం... రహ్మత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్ బ్రహ్మంగారి టెంపుల్ సమీపంలో ఉన్న జ్వాలిత టెంట్‌హౌస్ వద్దకు గురువారం రాత్రి 11గంటలకు స్థానికరౌడీషీటర్లు ఖాలిద్, లక్ష్మణ్ వచ్చారు. తమకు రూ. 5 వేలు కావాలని టెంట్‌హౌస్ యజమాని సురేష్‌తో పాటు అందులో పనిచేస్తున్న ఖదీర్‌ను డిమాండ్ చేశారు. తమ వద్ద అంతడబ్బు లేద ని ఖదీర్ వారికి చెప్పాడు.
టెంట్‌సామాన్ల కోసం వచ్చిన నరేష్ అనే వ్యక్తిని కూడా డబ్బు డిమాండ్ చేయగా... అతను కూడా తన వద్ద డబ్బు లేదన్నాడు. దీంతో ఆగ్రహం పట్టలేక రౌడీషీటర్లు ఖాలిద్, లక్ష్మణ్‌లు టెంట్‌హౌస్‌లోకి వెళ్లి సామా న్లు ఎత్తిపడేసి, గ్లాస్‌లు.ప్లేట్లు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. దీంతో సురేష్‌తో పాటు అత ని వద్ద పని చేసే ఖదీర్, కరీం భయంతో బయటకు పరుగులు తీశారు. ఖదీర్ పరిగెత్తుతుం డగా లక్ష్మణ్, ఖాలిద్‌లు తాము వచ్చిన ఆటోలో అతడిని వెంబడించి పట్టుకున్నారు.
ఆటోలోకి లాగి తీవ్రంగా కొట్టారు. కత్తి తో పొడిచి ఆటోలోంచి అతడిని రోడ్డుపై పడేసి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా స్థానికులు ఖదీ ర్‌ను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రౌడీషీటర్లపై హత్యాయత్నం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. స్థానికంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన కార్మికనగర్‌వాసులను భయబ్రాంతులకు గురిచేసింది.ఈ ప్రాంతంలో రౌడీలు దాడి చేయడంతో కత్తులతో పొడవడం తరచూ జరుగుతుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.