ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: 11 మందికి గాయాలు | misshap in singarayakonda of Prakasham district: 11 injured | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: 11 మందికి గాయాలు

Published Sun, Jun 19 2016 9:57 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

misshap in singarayakonda of Prakasham district: 11 injured

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బాలిరెడ్డినగర్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. జాతీయ రహదారిపై వెళుతున్న ఆటో ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.

 

గాయపడ్డవారిలో ఆరుగురికి కాళ్లూచేతులు విరగ్గా, మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడగలిగారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ఉలవపాడు మండలం రామాయపట్నం వాసులు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement