ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పల్లిపాళెంలో కమల(18) అనే యువతి సోమవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పల్లిపాళెంలో కమల(18) అనే యువతి సోమవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు... పొరుగింటి యువకుడు, కమల ప్రేమించుకుంటున్నారు. కాగా ఆర్నెల్ల క్రితం ఆ యువకుడు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు.
అయితే సోమవారం మధ్యాహ్నం సదరు యువకుని కుటుంబీకులు కమలను పిలిపించి.. వాళ్ల అబ్బాయిని మర్చిపోవాలని చెప్పి, నానా రకాలుగా తిట్టి అవమానించారు. వారి మాటలకు మనస్థాపం చెందిన కమల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కమల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సింగరాయకొండ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.