
ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరి జీవితంలో ప్రేమ అనేది కామన్ అయిపోయింది. కానీ అది చివరి దాకా ఉంటుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. ఈ రోజుల్లో చిన్నపాటి గోడవలకే బ్రేకప్ చెప్పుకోని, వేరే వాళ్లకి దగ్గరవుతున్నారు. మరికొందరు క్షణికావేశంలో తనువు చాలించుకుంటున్నారు. వీటన్నింటికీ భిన్నంగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.
యువతి యువకులు ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఇష్టపడ్డారు. వారు ప్రేమికుల రోజు సందర్భంగా వివాహం చేసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు నిరాకరించారు. దీంతో తమ ప్రేమ పెళ్లి జరగదని మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన ప్రియుడితో తాళి కట్టించుకోవాలనే తన కోరిక తీరలేదని సూసైడ్ నోట్‌లో రాసింది. దానిని తన కుటుంబ సభ్యులు నెరవేర్చాలని అందులో పేర్కొంది. దీంతో వారు ఆమె ప్రియుడిని తీసుకొచ్చి శవానికి తాళి కట్టించారు. ఈ ఘటన చూసిన స్థానికులు, కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment