సైదుల్లా ఆధార్ కార్డు
చిత్తూరు, పాకాల: ‘అమ్మా... నాన్నా ఇక ఇవే నాచివరి మాటలు. ఇక మీదట నేనుండను, నన్నుక్షమించండి. నేను చనిపోతున్నా’ అంటూ ఓ కన్న బిడ్డ తల్లిదండ్రులకు చివరిక్షణంలో మాట్లాడిన మాటలివి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. వివరాలు ఇలా ఉన్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో యువకుడు మృతి చెందాడని గుర్తించి పాకాల రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు చౌడేపల్లె పోలీసుల సహాయంతో సమాచారమిచ్చారు. చౌడేపల్లె మండలం కోటూరు గ్రామానికి చెందిన ఎస్. సయ్యద్ అహమ్మద్ కుమారుడు సైదుల్లా (23) కూలీ పనిచేసుకొంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు.
ఈక్రమంలో ఆదివారం ఇంటి వద్ద నుంచి తల్లిదండ్రులతో గొడవపడి పాకాలకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ నుంచి తన స్నేహితులకు ఫోన్ చేసి నేను ఇక ఉండను, చనిపోతున్నానంటూ స్నేహితులకు చెప్పాడని, చివరిసారిగా తన అమ్మా .. నాన్నలతో మాట్లాడించాలని కోరగా వారు అతని సూచనల మేరకు ఫోన్‌లో తల్లితండ్రులకు మాట్లాడించినా ఫలితం లేకపోయింది. పాకాల సమీపంలోని రైల్వే ట్రాక్‌మీద విగతజీవిగా పడి ఉన్న తన బిడ్డను చూసిన తల్లితండ్రులు బోరున విలపించారు. కాగా అందరితో ఆప్యాయతతో మెలిగే సైదుల్లా ఇకలేరని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment