Anantapur Crime News
-
దడపుట్టిస్తున్న ‘పార్థీ గ్యాంగ్’.. సీమలో దొంగతనాలతో హల్చల్
పార్థీ గ్యాంగ్... చోరీల్లో ఆరితేరిన ముఠా. చోరీ చేయడంలోనూ...పోలీసుల నుంచి తప్పించుకోవడంలోనూ దిట్టలు. చోరీ సమయంలో అడ్డొస్తే అంతమొందించేందుకూ వెనుకాడని క్రూరులు. ఈ కరుడు గట్టిన దొంగల పేరు చెబితే పోలీసులకు సైతం చెమటలు పడతాయి. ఈ గ్యాంగ్ ఇప్పుడు జిల్లాలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పార్థీ గ్యాంగ్.. ఈ పేరు వింటేనే సామాన్యులకు హడల్. వీరి కన్ను పడితే ఎలాంటి భద్రత ఉన్నా ఇళ్లయినా లూఠీ కావాల్సిందే. చోరీలు ఈ గ్యాంగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. తప్పించుకోవడంలోనూ వీరు ఆరితేరిపోయారు. దురదృష్టం వెంటాడి పోలీసులకు చిక్కినా ఇసుమంతైనా సమాచారం ఇవ్వరు. చోరీ సమయంలో అత్యంత క్రూరంగా వ్యవహరించే ఈ గ్యాంగ్ కదలికలు రాయలసీమలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. తాజాగా గుంతకల్లు దగ్గర జరిగిన రైలు దోపిడీలోనూ వీరి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాద్, మధ్యప్రదేశ్‌లోని పాసే పార్థీ తెగకు చెందిన వారు. బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థానికంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద గుడారాలు వేసుకుంటారు. అదును చూసి చోరీలకు తెగబడతారు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాలపైనే వీరి కన్ను. వ్యాపారుల అవతారమెత్తి రెక్కీ నిర్వహించి మరీ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడతారు. ఈ నెల 20న పార్థీ గ్యాంగ్ సభ్యుడితో పాటు అరెస్టయిన మరో ఇద్దరు దొంగలు అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, కదిరి, హిందూపురం ప్రాంతాలతో పాటు కర్నూలు, చిత్తూరులోని కొన్ని ప్రాంతాలలో పూసలు, దుప్పట్లు, గృహాలంకరణకు వినియోగించే మట్టి బొమ్మలు అమ్మే వ్యాపారుల్లా పార్థీ గ్యాంగ్ సభ్యులు అవతారమెత్తుతారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడతారు. అడ్డొస్తే ప్రాణాలను సైతం తీస్తారు. ఇంత క్రూపమైన పార్థీ గ్యాంగ్‌కు ఓ మహిళ డాన్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా అనంతపురం జిల్లా కేంద్రంలో పార్థీ గ్యాంగ్‌కు సంబంధించిన ఓ ముఠా సభ్యులు పట్టుబడటం చర్చనీయాంశమైంది. ఈ పార్థీ గ్యాంగ్ ఎక్కడ చోరీలకు పాల్పడినా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎక్కడా వారి ఆనవాళ్లు లేకుండా చూసుకుంటుంది. సెల్ఫోన్లను సైతం నేర ప్రాంతానికి సుమారు 30 కిలో మీటర్ల దూరంలోనే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈ గ్యాంగ్‌లు ఎక్కడ దోపిడీకి పాల్పడినా వారి గ్రామాలకు చేరుకోకమునుపే పోలీసులు పట్టుకోవాలి. లేదంటే దోచుకున్న సొత్తులో పైసా కూడా రికవరీ చేయలేరు. కారణం దోచుకున్న సొమ్మలో 30 శాతం ఆదాయాన్ని గ్రామాల అభివృద్ధి కోసం పెద్దలకు ఇస్తారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు వీరికి బాసటగా నిలుస్తారు. మధ్యప్రదేశ్‌లో స్థానిక రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలున్నాయి. సాంకేతికత పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దొంగలు, అనుమానితులు, తీవ్ర నేరాల్లో పాలుపంచుకున్న వారి వివరాలను పోలీసులు అప్పట్లో చేతి వేలి ముద్రలు, కాలి ముద్రలు తీసి ఉంచారు. ఈ ఆధారాలే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. అనంతపురంలో పట్టుబడ్డ పార్థీ గ్యాంగ్ సభ్యుడు కూడా పాత పోలీసులు సేకరించిన చేతి వేలిముద్రల ఆధారంగానే దొరికాడు. వేలిముద్రలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకొచ్చాం. అనుమానితుల చేతి వేలిముద్రలు మొబైల్లో తీసుకుని, ఇంటిగ్రేట్ చేసిన వాటితో సరిపోల్చుతాం. పార్థీ గ్యాంగ్‌లు వేసవిలో ఎక్కువగా తిరుగుతుంటాయి. రైళ్లలో దోపిడీలు కూడా చేస్తుంటాయి. వీటిపైనా నిఘా ఉంచాం. లాక్ చేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడతాయి. ఎవరైనా ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళితే పోలీసులకు సమాచారమందిస్తే నిఘా పెడతాం. ఇప్పటికే రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల ఎస్పీలనూ అప్రమత్తం చేశారు. – ఎం.రవికృష్ణ, డీఐజీ, అనంతపురం రేంజ్ -
శ్రావణిని చంపేశారా!?
కదిరి అర్బన్: గత ఏడాది తప్పిపోయిన డిగ్రీ విద్యార్థిని శ్రావణిని హతమార్చారా? ప్రస్తుతం లభ్యమైన మానవ అవశేషాలు, పర్సు, సెల్‌ఫోన్ శ్రావణివేనా? తదితర ప్రశ్నలకు సమాధానం అవుననే సమాధానం వస్తోంది. తొమ్మిది నెలలుగా కొనసాగుతూ వచ్చిన పోలీసు దర్యాప్తు.. ప్రస్తుతం లభ్యమైన ఆధారాలతో వేగం పుంజుకోనుంది. వివరాల్లోకి వెళితే.. కదిరి మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శ్రావణి 2019, అక్టోబర్ నుంచి కనిపించకుండా పోయింది. కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీనిపై కుటుంబసభ్యులు పలు చోట్ల గాలించి, చివరకు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెలలు గడుస్తున్నా ఈ కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. పట్టణ సమీపంలోనే ఆధారాలు లభ్యం ఈ నెల 22న స్థానిక మున్సిపల్ పరిధిలోని సోమేష్ నగర్ సమీపంలో శ్రావణికి సంబంధించి ఆధారాలు ఓ గొర్రెల కాపరికి కంటపడ్డాయి. అనుమానం వచ్చిన ఆ కాపరి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ షేక్ లాల్ మహమ్మద్, సీఐ రామకృష్ణ, ఎస్ఐ మహమ్మద్ రఫీక్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పంట పొలాల్లో పడి ఉన్న పర్సులో శ్రావణి ఐడీ కార్డు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు, చిన్న మొత్తంలో నగదు లభ్యమయ్యాయి. పర్సు పడి ఉన్న చోటుకు కొద్దిదూరంగా ఓ పుర్రె, రెండు ఎముకలను గుర్తించారు. ఇవి శ్రావణివేనా లేక మరెవరివైనా అనేది తేలాల్సి ఉంది. లభ్యమైన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు సీఐ తెలిపారు. కాగా, శ్రావణిపై అత్యాచారం జరిపి హతమార్చి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
చావుకోరిన ప్రేమ
లోకం పోకడ తెలియని రెండు హృదయాలు ప్రేమనో.. ఆకర్షణో.. వీడలేనంత దగ్గరయ్యాయి కన్నవాళ్లు.. కులం.. కట్టుబాట్లు.. అడ్డుతగిలాయి ఆ పసి మనసులు విలవిల్లాడిపోయాయి ఎడబాటును తట్టుకోలేకపోయాయి వీడిపోలేక.. వీడి ఉండలేక... చావులో ఒక్కటవుదామనుకున్నారు భవిష్యత్ తలచుకుని భయాందోళన చెందారు పురుగుల మందునే ప్రేమామృతంగా తాగారుఆస్పత్రికి తీసుకెళ్లినా ఒకరి తర్వాత మరొకరు తనువు చాలించారుశృతి తప్పిన ప్రేమ ప్రకాశించకపోగాకన్నవారికి కడుపుకోత మిగిలింది. బత్తలపల్లి: తమ వివాహానికి కులాలు అడ్డు వస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ధర్మవరం రూరల్ సీఐ వీసీ పెద్దయ్య తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన గొడ్డుమర్రి చిన్నపోతులయ్య, విజయమ్మ దంపతుల కుమారుడు ఓంప్రకాష్(18), అదే గ్రామానికి చెందిన మనోహర్, సావిత్రి దంపతుల కుమార్తె శ్రుతి(18).. ధర్మవరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇటీవల తల్లిదండ్రులకు తెలిసి కులాలు వేరుకావడంతో పెళ్లి చేయడం కుదరదని, ఈ విషయాన్ని ఇంతటితో వదులుకోవాలంటూ మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. బుధవారం వేకువజామున 5.30 గంటలకు యువకుడి తోటలో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆరు గంటలకు యువకుడి సమీప బంధువులు తోటలో బెండకాయలు కోయడానికి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే ఇరువైపుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని ఇద్దరినీ అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ముందు యువకుడు.. ఆ తర్వాత యువతి మృతి చెందారు. ఘటనపై ధర్మవరం రూరల్ సీఐ పెద్దయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పట్టుచీరల ముసుగులో మద్యం రవాణా
ధర్మవరం అర్బన్: పార్శిల్ సర్వీస్ ముసుగులో గుట్టుచప్పడు కాకుండా అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠా గుట్టును సెబ్ పోలీసులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెబ్ ఎఎస్పీ రామ్మోహన్రావు వెల్లడించారు. హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి పట్టుచీరలు, చీరల పార్శిల్ బాక్స్‌లతో ఎస్‌బీఆర్‌ఎస్ కార్గో సర్వీస్‌కు చెందిన కేఏ07ఏ 2083 ఐచర్ వాహనం మంగళవారం రాత్రి బయలుదేరింది. 44వ జాతీయ రహదారి మీదుగా నేరుగా ధర్మవరానికి వస్తున్న ఆ వాహనాన్ని పలు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది ఆపి పరిశీలించారు. కార్గో పార్శిల్ సర్వీస్ వే బిల్లులు చూపుతూ.. పట్టుచీరలు, చీరలు తరలిస్తున్నట్లుగా అందులోని వ్యక్తులు చెబుతూ లైన్ క్లియరెన్స్ తీసుకుంటూ వచ్చారు. దీంతో ఎలాంటి అనుమానాలు ఆ వాహనాన్ని చెక్‌పోస్టుల వద్ద వదిలిపెడుతూ వచ్చారు. ముందస్తు సమాచారంతో.. హైదరాబాద్ నుంచి భారీగా మద్యం బాటిళ్లను అక్రమంగా ధర్మవరానికి తరలిస్తున్నట్లుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ఏఎస్పీ రామ్మోహన్‌రావుకు సమాచారం అందింది. దీంతో సిబ్బందిని అప్రమత్తం చేసిన ఆయన... బుధవారం తెల్లవారుజామున ధర్మవరం సమీపంలోని వేల్పుమడుగు వద్ద కాపు కాశారు. వేగంగా దూసుకువస్తున్న ఐచర్ వాహనాన్ని గుర్తించి సెబ్ సీఐలు జయనాథరెడ్డి, నరసానాయుడు, భీమలింగ, ఎస్ఐలు చాంద్‌బాషా సాదిక్ వలీ అడ్డుకున్నారు. ఆ సమయంలో వాహనంలో ఉన్నవారు పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. ‘ఇది ఎస్‌బీఆర్‌ఎస్ పార్శిల్ వాహనమని, ఇందులో పట్టుచీరలు, చీరలు తప్ప మరేమీ లేవంటూ నమ్మబలికారు. అయితే తమకున్న పక్కా సమాచారం మేరకు వాహనాన్ని తనిఖీ చేసి తీరాల్సిందేనంటూ పోలీస్ అధికారులు పట్టుబట్టారు. నిందితులు వీరే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలో భాగంగా దశల వారీగా మద్యనిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం అమ్మకాలపై పలు రకాలుగా నిషేధం విధిస్తూ వచ్చింది. దీనికి తోడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో బహిరంగంగా మద్యం ఎక్కడా లభ్యం కావడం లేదు. దీనిని సొమ్ము చేసుకోవాలని భావించిన పలువురు అక్రమ మార్గాల ద్వారా అధిక ధరలకు మద్యం విక్రయించి తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని భావించారు. ఇందులో భాగంగానే ధర్మవరం పట్టణానికి చెందిన చీరల వ్యాపారి కోనారెడ్డితోపాటు మరో ఆరుగురు సిండికేట్‌గా ఏర్పడి, హైదరాబాద్‌లో భారీగా మద్యం కొనుగోలు చేసి కార్గో పార్శిల్ సర్వీసు ద్వారా రాచమార్గంలో ధర్మవరానికి చేరుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సెబ్ ఎఎస్పీ రామోహ్మన్‌రావు పథకం ప్రకారం ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో కోనారెడ్డితో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు పట్టుబడ్డారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నట్లు సెబ్ ఏఎస్పీ పేర్కొన్నారు. మద్యం బాటిళ్లు, టోబాకో టిన్లతో పాటు ఐచర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. కాగా, మద్యం అక్రమ రవాణా గుట్టును రట్టు చేసిన సీఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్, కానిస్టేబుళ్లు రమేష్‌రెడ్డి, మారుతీప్రసాద్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. రూ. లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు.. పోలీస్ అధికారుల ఒత్తిడికి వాహనం తలుపులు తీసి పట్లు చీరల బాక్స్‌లు చూపించారు. అయితే ఆ బాక్స్‌లు తెరవాలని పోలీసు అధికారులు ఆదేశించడంతో రాజీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయినా పోలీస్ అధికారులు వినలేదు. చివరకు పోలీస్ అధికారులే బాక్స్‌లను తెరవాల్సి వచ్చింది. బాక్స్‌లు తెరిచిన తర్వాత పోలీసులే అవాక్కయ్యారు. అదులో ఏకంగా రూ.1.61 లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లు, పొగాకు డబ్బాలు బయటపడ్డాయి. -
లవ్ ఫెయిల్యూర్; టిక్‌టాక్ వీడియోలు చేసి..
-
లవ్ ఫెయిల్యూర్; టిక్‌టాక్ వీడియోలు చేసి..
సాక్షి, అనంతపురం : గుత్తిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమై ఓ విద్యార్థి ఆత్మహ్యకు పాల్పడ్డాడు. వివరాలు.. పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో కేఎమ్ రాము అనే విద్యార్థి బీఎస్సీ (డిగ్రీ) చదువుతున్నాడు. కొంత కాలంగా రాము ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన రాము బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు లవ్ ఫెయిల్యూర్ పాటలకు టిక్‌టాక్ చేశాడు. ఈ వీడియోలను టిక్‌టాక్‌లో అప్లోడ్ చేసిన అనంతరం రైలు కిందపడి రాము ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (రెండో పెళ్లికి సిద్ధమైన సీఎం కుమార్తె ) -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. గంటల వ్యవధిలో తల్లిదండ్రులు మరణించారు. అమ్మా, నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలియని పిల్లలు అమాయకంగా అటు ఇటు తిరుగుతుండటం చూపరులను కలచివేసింది. చిన్నవయసులోనే ఆ పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేశావా దేవుడా అంటూ బంధువులు విలపించారు. అనంతపురం, వజ్రకరూరు: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. వజ్రకరూరు మండలం బోడిసానిపల్లి తండాకు చెందిన మూడ్ కేశవనాయక్(30)కు ఇదే మండలం ఎన్‌ఎన్‌పి తండాకు చెందిన వరలక్ష్మిబాయి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు సంవత్సరాల కుమారుడు యువరాజ్‌తోపాటు ఒకటిన్నర సంవత్సరం వయసు గల కూతురు నందిని ఉంది. వరలక్ష్మిబాయి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. కేశవనాయక్ అక్క ధనలక్ష్మికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంలో భార్య, కూతురితో కలిసి బళ్లారికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం బళ్లారి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో పాల్తూరు క్రాస్ వద్ద గుర్తు తెలియని బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో వరలక్ష్మిబాయి అక్కడికక్కడే మృతి చెందగా కేశవనాయక్ అనంతపురం ఆస్పత్రిలో అదే రోజు రాత్రి మృతి చెందాడు. కూతురు నందిని స్వల్ప గాయాలతో బయట పడింది. ఉరవకొండ ఎస్ఐ ధరణిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనంత ఫ్యాక్షన్.. నలుగురికి యావజ్జీవం
సాక్షి, అనంతపురం : తిప్పేపల్లి ఫ్యాక్షన్ హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. కర్నూలు సీబీసీఐడీ పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసు పూర్వాపరాలు ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఇలా ఉన్నాయి. ధర్మవరం రూరల్ మండలం తిప్పేపల్లిలో దేవరపల్లి వర్గం, ముక్తాపురం వర్గం నడుమ దశాబ్దాల తరబడి ఫ్యాక్షన్ గొడవలున్నాయి. కేసులు కూడా అధికంగా ఉన్నాయి. దేవరపల్లి వర్గానికి దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి, ముక్తాపురం వర్గానికి ముక్తాపురం రామకృష్ణారెడ్డి (70) నాయకత్వం వహించేవారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం తిప్పేపల్లి కాగా అనంతపురంలో సంపూర్ణ లాడ్జి నడుపుతున్నాడు. వీరిద్దరి నడుమ వర్గపోరుతో పాటు రాజకీయ విభేదాలు ఉన్నాయి. ►తిప్పేపల్లి నుంచి సంగాలకు రోడ్డు మార్గం దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి తోటలోంచి వెళ్లే ప్రతిపాదన ఏడేళ్ల కిందట వచ్చింది. అయితే రోడ్డు వేయకుండా లక్ష్మినారాయణరెడ్డి జిల్లా కోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకొచ్చేవాడు. ఇది ముక్తాపురం వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అదను చూసి హత్యకు కుట్రపన్నారు. 2013 ఏప్రిల్ 12 నుంచి మొదలుపెట్టి పలు దఫాలు లక్ష్మినారాయణరెడ్డిని హత్య చేయటానికి పన్నాగం పన్నారు. లక్ష్మినారాయణరెడ్డి తోటలోనే మారణాయుధాలు దాచివుంచి అదను కోసం వేచి ఉన్నారు. చదవండి: జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్ ఎట్టకేలకు మే 5వ తేదీన లక్ష్మినారాయణరెడ్డి ఒంటరిగా బైక్ మీద వస్తున్న విషయం తెలిసి అతను ఇంకా బండి దిగకమునుపే దాడిచేసి హతమార్చారు. అటునుంచి మారణాయుధాలను వెంకటరెడ్డి పొలంలో పారవేసి శివలింగారెడ్డి ఇంటికి చేరారు. హత్యజరిగిన వెంటనే ప్రత్యక్షసాక్షిగా హతుడి భార్య దేవరపల్లి రామకృష్ణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మవరం రూరల్ పోలీసులు తిప్పేపల్లికి చెందిన ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై కేసు నమోదు చేశారు. ►ఫ్యాక్షన్ కేసు కావటంతో సీఐడీ పోలీసులు రంగంలో దిగారు. దర్యాప్తు అనంతరం ఆ నలుగురితో పాటు కసిరెడ్డి రాజారెడ్డి, తిప్పేపల్లికి చెంది, అనంతపురంలో సంపూర్ణలాడ్జి నడుపుతున్న ముక్తాపురం రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో స్థిరపడిన ముక్తాపురం అనిల్‌కుమార్‌రెడ్డి, బత్తలపల్లి మండలం సంగాలకు చెందిన కొడకండ్ల నరసింహారెడ్డి, ముదిగుబ్బ మండలం రాఘవంపల్లికి చెందిన గొర్ల వెంకటలింగారెడ్డి, గొర్ల రామలింగారెడ్డి, తాడిమర్రి మండలం ఆత్మకూరుకు చెందిన పొడెమల ఓబిరెడ్డి, వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఎగువ పల్లికి చెందిన శివలింగారెడ్డిలపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. తొలుత ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులు ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై సాక్ష్యాధారాలు నిరూపణ కావటంతో ఆ నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి.సునీత తీర్పు చెప్పారు. మిగిలినవారిపై నేరారోపణలు రుజువుకాక పోవటంతో నిర్దోషులుగా విడుదల చేశారు. దర్యాప్తు అధికారిగా సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ ఉపేంద్రబాబు వ్యవహరించగా, కోర్టులో సాకు‡్ష్యల హాజరుకు సహకరించిన కోర్టు కానిస్టేబుళ్లు బత్తలపల్లి పోలీసుస్టేషన్‌కు చెందిన రామాంజి, సీబీసీఐడీకి చెందిన జాఫర్షావలిని పోలీసు అధికారులు అభినందించారు. చదవండి: తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం -
అత్తా.. అమ్మమ్మా అంటూ నమ్మిస్తాడు.. ఆపై!
సాక్షి, అనంతపురం: అత్త.. అమ్మమ్మ అంటూ వరుసలు కలుపుతాడు.. నేను మీ బంధువును అంటూ నమ్మిస్తాడు.. అదును చూసి దోచేస్తాడు. ఈ మోస్ట్ వాంటెడ్ దొంగను సీసీఎస్, తాడిపత్రి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి రూ. 40 లక్షల విలువజేసే 101.4 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల మస్తాన్‌వలి అలియాస్ మస్తాన్ ఐటీఐ వరకు చదువుకుని ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. తాగుడు, పేకాట, బెట్టింగ్‌లకు అలవాటుపడి దొంగగా మారిన మస్తాన్ రాష్ట్రంలోని అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో గత మూడేళ్లలో ఏకంగా 26 నేరాలకు పాల్పడ్డాడు. మంచిగా, నేర్పుగా, అణకువగా మాట్లాడటం.. అత్త, అవ్వ, మామా అంటూ బంధుత్వాలు, వరుసలతో మాటలు కలపడమే పనిగా పెట్టుకున్నాడు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఇళ్లలో మగవాళ్లు లేని సమయం చూసి వృద్ధ మహిళలతొ మీకు దూరపు బంధువును అవుతానని నమ్మబలుకుతాడు. వారు నిజమేనని నమ్మి మర్యాదలు చేయడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వారు ధరించిన బంగారు ఆభరణాలు బాగున్నాయని కితాబిస్తూనే చాకచక్యంగా నగలను ఇవ్వాలని కోరుతాడు. ఇతని మాటలు నమ్మి వారు ఆభరణాలను ఇచ్చేస్తాడు. ఒక వేళ ఇవ్వని పక్షంలో లాక్కొనిపారిపోతాడు. అరెస్టయినా మస్తాన్ 26 కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. తాడిపత్రి రూరల్, పామిడి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి, అనంతపురం, కర్నూలు జిలాలలో ప్యాపిలి, మద్దికెర, కడపలో రాజుపాళ్యం, ప్రకాశం ప్రాంతాల్లో 2017 నుంచి నేరాలకు పాల్పడ్డాడు. అంతకు మునుపు కూడా ఇతనిపై 14 నేరాలున్నాయి. గతంలో తిరుపతి, కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినా ఇతనిలో మార్పు రాలేదు. దొంగలపై నిఘా ఉంచిన తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మస్తాన్‌ను సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్ సీఐ శ్యాంరావు, తాడిపత్రి రూరల్ ఎస్ఐ రాజశేఖర్, సీసీఎస్ ఎస్ఐలు చలపతి, చాంద్‌బాషా, సిబ్బంది శ్రీనివాసులు, భాస్కర్, కృష్ణానాయక్, జయచంద్రారెడ్డి, తిరుపతయ్య, ఫరూక్, అనిల్, మల్లి, సతీష్, మనోహర్, రంజిత్, దూద్వలీ అరెస్ట్ చేశారు. వీరిని ఎస్పీ సత్యయేసుబాబు అభినందించారు. రివార్డులతో సత్కరించారు. -
భర్త మందలించాడని..
అనంతపురం, ధర్మవరం అర్బన్: భర్త మందలించాడని క్షణికావేశంలో ఓ వివాహిత కత్తితో చేయికోసుకున్న ఘటన గురువారం సాయంత్రం పట్టణంలోని శాంతినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శాంతినగర్‌కు చెందిన శివ, కవితలు మగ్గం నేస్తూ జీవనం సాగించేవారు. అయితే శివ మొదటి భార్య చనిపోవడంతో పెద్దల సూచనమేరకు కవితను పెళ్లిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటిలో బిడ్డకు కవిత అన్నం సరిగా తినిపించలేదని భర్త శివ మందలించాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఎదురు తిరగడంతో భార్య కవితపై శివ చేయిచేసుకున్నాడు. దీంతో క్షణికావేశంతో ఆమె ఇంటిలో ఉన్న కత్తితో చేతికి కోసుకుంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీనాథ్ ఏమయ్యాడు?
సోమందేపల్లి: పట్టణానికి చెందిన మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ అదృశ్యం మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి డబ్బు ఎత్తుకెళ్లారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళితే.. శ్రీనాథ్ ఇటీవల ప్రభుత్వ షాపులో సూపర్వైజర్గా నియమితుడయ్యారు. తోటి సిబ్బందితో కలసి వ్యాపార లావాదేవీలు చూసుకునే వాడు. మద్యం షాపులో (సీఆర్ఓ నంబర్11146) రోజు వసూలైన కలెక్షన్‌ను బ్యాంకులో చెల్లించి సంబంధిత రశీదులను ఎక్సైజ్ అదికారులకు అప్పగించేవాడు. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మద్యం షాపునకు సంబంధించిన డబ్బును తన వద్దే ఉంచుకున్న శ్రీనాథ్, సోమవారం షాపు తనిఖీ నిమిత్తం వచ్చిన ఎక్సైజ్ పోలీసులు తనిఖీ అనంతరం రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకుల్లో కట్టి రశీదు అప్పగించాలని సూచించారు. దీంతో డబ్బు చెల్లించి రశీదు అప్పగించి వస్తానని చెప్పి షాపు నుంచి బయటకు వెళ్ళిపోయిన శ్రీనాథ్ అనంతరం కనిపించకుండా పోయాడు. సాయంత్రం వరకు ఎదురు చూసిన సిబ్బంది ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వగా పూర్తీ స్థాయిలో పరిశీలించి, కుటుంబసభ్యులతో విచారించి అనంతరం ఎక్సైజ్ పోలీసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడా? శ్రీనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాలధారణలో వున్న వ్యక్తి గత 4 రోజుల క్రితం పెనుకొండ మండలానికి ఆనుకుని వున్న కొత్తచెరువు మండలంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శ్రీనాథ్ సైతం మాలధరించి ఉండడం వల్ల చనిపోయింది శ్రీనాథ్ అని, శవం కుళ్లిపోయి ఉండటంతో పోలీసులు ప్రాథమికంగా శ్రీనాథ్ అని నిర్ధారించినా డీఎన్ఏ రిపోర్టు కోసం నమూనాలు ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు వచ్చే వరకు చనిపోయింది ఎవరన్నది చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. బెట్టింగ్ ప్రభావమేనా? శ్రీనాథ్‌కు ఆన్లైన్ బెట్టింగే ఆడే అలవాటు ఉందని పలువురు సన్నిహితుల ద్వారా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న మద్యంషాపు డబ్బును ఆన్లైన్ బెట్టింగ్‌లో పొగొట్టుకుని బ్యాంకులో డబ్బు కట్టలేక, అధికారులకు సమాధానం చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే శ్రీనాథ్ సన్నిహితులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్ లావాదేవీలు సెల్ఫోన్లోనే జరిపే వాడని,. ఈ క్రమంలో అతడి సెల్‌ఫోన్ సైతం మాయం కావడం అంతుబట్టని రహస్యంగా మారింది. అయితే సెల్పోన్లో జరిపిన లావాదేవీలు, అతడు ఫోన్లో అదృశ్యమయిన రోజు జరిపిన సంభాషణలను పోలీçసులు బయటకు తీయగలిగితే కొంత వరకు వాస్తవాలు బయటపడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పలువురు సన్నిహితుల సెల్ఫోన్లు పోలీసుల వద్ద వున్నాయి. వీటిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. బ్యాంక్‌లో కట్టమని చెప్పాం సోమవారం మద్యం షాపును తనిఖీ చేసిన అనంతరం 3 రోజులకు సంబంధించిన మొత్తం రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకులో చెల్లించి రశీదు ఇవ్వమని సూపర్ వైజర్ శ్రీనాథ్‌కు సూచించాం. అయినా ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. డబ్బుతో తమకు సంబంధం ఉండదు. సూపర్వైజర్లే బ్యాంకులో చెల్లించాలి. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసాం. విచారణ చేస్తున్నారు.– జబీవుల్లా, ఎక్సైజ్ ఎస్ఐ, పెనుకొండ లోతుగా విచారిస్తున్నాం మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ అదృశ్యంపై పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. 4 రోజుల క్రితం కొత్తచెరువు పరిధిలో అయ్యప్ప మాలధారణలో వున్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనాథ్ సైతం మాలధరించి వుండడంతో అతనేమైనా ఉండొచ్చు అనే కోణంలో విచారిస్తున్నాం. అదృశ్యమైన రోజు ఏ టవర్ల కింద ఫోన్ సంభాషణలు జరిపాడన్న విషయమై కాల్ డేటా సేకరిస్తున్నాం. – శ్రీహరి, సీఐ, పెనుకొండ -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్హాల్లో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన వారిలో నగరంలో అనంతసాగర్కాలనీకి చెందిన షికారి కోటయ్య, షికారి రామకృష్ణ, బుడ్డప్పనగర్‌కు చెందిన షికారి మెచిలి అలియాస్ నాగి, టీవీ టవర్‌కు చెందిన షికారి శీనా, షికారి శీను ఉన్నారు. వీరి నుంచి 62 తులాలు బంగారు, 18 తులాలు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా చేసుకున్నారు. 2018లో నగరంలోని అరవింద్‌నగర్, హౌసింగ్‌బోర్డు 2019లో కక్కలపల్లి పంచాయతీ దండోరాకాలనీ, ఎల్ఐసీ కాలనీ, ఆకుతోటపల్లి, హౌసింగ్‌బోర్డు, తాటిచెర్ల, ఓబుళదేవరనగర్, ఎల్ఐజీ కాలనీ, సెంట్రల్ ఎక్సైజ్‌కాలనీ, ఆకుతోటపల్లి, కళ్యాణదుర్గం రోడ్డులలో చోరీలు చేశారు. జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, కర్నూలు జిల్లాలో కూడా నేరాలకు పాల్పడ్డారు. ఐదుగురిలో షికారి శీనా మినహా మిగిలిన వారిపై కేసులున్నాయి. దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పక్కా సమాచారం అందుకొని అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి సమీపంలో అశ్వర్థనారాయణస్వామి కట్ట వద్ద ఐదుగురినీ అరెస్ట్ చేశారు. వీరిని పట్టుకోవడంలో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, టూటౌన్ సీఐ జాకిర్‌హుస్సేన్, వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్ఐలు రాఘవరెడ్డి, జయపాల్‌రెడ్డి, ఏఎస్ఐ రమేష్, సిబ్బంది జయరామ్, దాసు, రామకృష్ణ, ప్రవీణ్, గిరి, ఆసిఫ్‌ల బృందం కీలకంగా వ్యవహరించింది. ఎస్పీ సత్యయేసుబాబు రివార్డులతో సిబ్బందిని అభినందించారు. -
కీచకోపాధ్యాయుడు
తండ్రి తర్వాత తండ్రిలా వ్యవహరించాల్సిన ప్రధానోపాధ్యాయుడు గతి తప్పాడు.విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సమయంలో సహ ఉపాధ్యాయినిల పట్ల కీచకుడిగా మారాడు. ఈ పరిస్థితి ఎక్కడో కాదు.. తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో ఉన్న శ్రీ ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోనిది. ప్రధానోపాధ్యాయుడివైఖరితో విసుగు చెందిన బాధితులు వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. కీచకోపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు.చివరకు సమస్యపై స్పందించిన సీఎం పేషీ.. తక్షణమేఆ కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలంటూ ఉత్తర్వులుజారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.వి.నటరాజ్ వైఖరి వివాదస్పదంగా మారింది. వందల సంఖ్యలో ఇక్కడ బాల, బాలికలు ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ స్థాయి నుంచి హెచ్ఎం వరకూ ఐదేళ్లుగా ఈ పాఠశాలలో పనిచేస్తూ వస్తున్న నటరాజ్.. తరగతి గదుల్లో పాఠాలు చెప్పకుండా అనుచిత ప్రవర్తనలతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. అతని వెకిలి చేష్టలకు చిన్నారుల మనసులు గాయపడ్డాయి. విషయాన్ని తల్లిదండ్రులకు గాని, ఇతరులకు గాని చెబితే హాజరుపట్టిలో అబ్సెంట్ వేస్తానని బెదిరిస్తూ తన పబ్బం గడుపుకుంటూ వచ్చాడు. మాట కాదంటే పైశాచికం తన మాట వినలేదన్న అక్కసుతో గతంలో ఎనిమిదో తరగతి విద్యార్థి వెంకటరమణను నటరాజ్ తీవ్రంగా చితకబాదాడు. ఘటనలో వెంకటరమణ చెయ్యి విరిగింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రూ.30 వేలు చెల్లిస్తూ దుప్పటి పంచాయితీతో బయటపడ్డాడు. స్కూల్ అసిస్టెంట్‌గా ఉంటూ వచ్చిన నటరాజ్ ఈ ఏడాది జూన్ 19న ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్ పొంది, తిరిగి ఇదే పాఠశాలలో బాధ్యతలు స్వీకరించాడు. హెచ్ఎం అన్న అహంకారంతో అతను మరింత రెచ్చిపోతూ.. ఈ సారి ఏకంగా ఉపాధ్యాయినులను టార్గెట్ చేస్తూ వచ్చాడు. అతని వెకిలి చేష్టలతో విసుగు చెందిన ఉపాధ్యాయినులు.. గ్రీవెన్స్‌లో మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అతన్ని అప్పటి తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్ తీవ్రంగా మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఉపాధ్యాయినుల పట్ల మరింత వేధింపులు మొదలయ్యాయి. ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో మహిళా టీచర్లు ఇబ్బంది పడుతూ వచ్చారు. తన మాట వినకపోతే కులం పేరుతో దూషిస్తున్నాడంటూ నటరాజ్‌పై ఇద్దరు మహిళా టీచర్లు ఈ నెల 9న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు కానీ, నటరాజ్ అరెస్ట్ చూపలేకపోయారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటరాజ్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ ఈ నెల 11న సీఎం పేషీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. విషయం తెలుసుకున్న నటరాజ్ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. -
వివాహిత దారుణహత్య
అనంతపురం, పుట్లూరు: మడుగుపల్లి ఎస్సీ కాలనీలో వివాహిత దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో భర్తే ఆమెను కడతేర్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడుగుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వెంకటలక్ష్మి(30)కి ఎనిమిదేళ్ల కిందట నార్పల మండలం దుగుమర్రికి చెందిన వీరశేఖర్‌తో వివాహమైంది. కొన్నేళ్లు వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. ఇటీవల భార్య ప్రవర్తనపై వీరశేఖర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. వేధింపులు పెరిగిపోవడంతో ఎనిమిది నెలల క్రితం ఆరేళ్ల కుమారుడు దేవాను తీసుకుని వెంకటలక్ష్మి తన పుట్టింటికి వచ్చింది. బంధువులు, ఇతర పెద్దలు పంచాయితీ చేసి నెల రోజుల క్రితం మెట్టినింటికి పంపారు. అయినా వీరశేఖర్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో మళ్లీ 20 రోజుల క్రితం ఆమె మడుగుపల్లిలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వీరశేఖర్ మడుగుపల్లికి వచ్చాడు. సోమవారం ఉదయాన్నే తాను దుగుమర్రికి వెళ్తున్నానని భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు నడిపి బయన్న, లక్ష్మిదేవిలకు చెప్పి బయల్దేరాడు. అల్లుడు వెళ్లిపోయాక బయన్న, లక్ష్మిదేవి దంపతులు కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం వేళ కుమారుడు సమీప ఇళ్ల వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. ఇక ఒంటరిగా ఉన్న వెంకటలక్ష్మి కాసేపటికే దారుణహత్యకు గురైంది. స్థానికుల సమాచారంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలంలో రుబ్బుడుగుండు, కొడవలి పడి ఉన్నాయి. హత్యాస్థలిని తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ దేవేంద్రకుమార్ పరిశీలించారు. హత్యకు గల కారణాలపై మృతురాలి తల్లిదండ్రులను ఆరా తీశారు. భర్తే రుబ్బుడుగుండుతో మోది హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. హతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అమ్మా.. నాన్న ఇవే నా చివరి మాటలు
చిత్తూరు, పాకాల: ‘అమ్మా... నాన్నా ఇక ఇవే నాచివరి మాటలు. ఇక మీదట నేనుండను, నన్నుక్షమించండి. నేను చనిపోతున్నా’ అంటూ ఓ కన్న బిడ్డ తల్లిదండ్రులకు చివరిక్షణంలో మాట్లాడిన మాటలివి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. వివరాలు ఇలా ఉన్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో యువకుడు మృతి చెందాడని గుర్తించి పాకాల రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు చౌడేపల్లె పోలీసుల సహాయంతో సమాచారమిచ్చారు. చౌడేపల్లె మండలం కోటూరు గ్రామానికి చెందిన ఎస్. సయ్యద్ అహమ్మద్ కుమారుడు సైదుల్లా (23) కూలీ పనిచేసుకొంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం ఇంటి వద్ద నుంచి తల్లిదండ్రులతో గొడవపడి పాకాలకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ నుంచి తన స్నేహితులకు ఫోన్ చేసి నేను ఇక ఉండను, చనిపోతున్నానంటూ స్నేహితులకు చెప్పాడని, చివరిసారిగా తన అమ్మా .. నాన్నలతో మాట్లాడించాలని కోరగా వారు అతని సూచనల మేరకు ఫోన్లో తల్లితండ్రులకు మాట్లాడించినా ఫలితం లేకపోయింది. పాకాల సమీపంలోని రైల్వే ట్రాక్‌మీద విగతజీవిగా పడి ఉన్న తన బిడ్డను చూసిన తల్లితండ్రులు బోరున విలపించారు. కాగా అందరితో ఆప్యాయతతో మెలిగే సైదుల్లా ఇకలేరని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. -
లారీలు, బస్సులున్నాయి ఇంకా పెళ్లికాలేదని..
హిందూపురం: అమ్మాయిలకు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి పెళ్లిళ్లు చేసుకుంటున్న గోరంట్ల మండలం బుదిలివాండ్లపల్లికి చెందిన రంగప్ప (30) అనే మోసగాన్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహబూబ్‌బాష చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురంలోని ఓ యువతికి ఐదునెలల క్రితం ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మాటలు కలిసి తన వివరాలు తెలిపే క్రమంలో బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నానని, అనాథనని తనకు లారీలు, బస్సులున్నాయని నమ్మించాడు. ఇంకా పెళ్లికాలేదని చెప్పుకొచ్చాడు. అలా మాటలు కలిపి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ముగ్గులోకి దించాడు. అమ్మాయి తల్లిదండ్రులు కట్నకానుకల కింద బంగారు నగలు, భారీగా నగదును ముట్టజెప్పారు. డబ్బుదస్కం అందినవెంటనే మోసగాడు ముఖం చాటేశాడు. ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. బయటపడిన బండారం అనుమానం వచ్చిన యువతి తల్లిదండ్రులు విచారించగా రంగప్ప మోసగాడని తెలింది. అతనికి ఇంతకు మునుపే ముగ్గురు, నలుగురు యువతులను ఇలాగే ప్రేమ, పెళ్లిళ్లు పేరిట మోసం చేసినట్లు తెలిసిందన్నారు. బాధితురాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగప్పను వన్‌టౌన్ పోలీసులు అరెస్టుచేసి విచారించారు. చిలమత్తూరు మండలంలోని పాతచామలపల్లిలో ఓ యువతితో పెళ్లిఅయ్యి ఇద్దరు సంతానం ఉన్నారని తెలిసింది. అలాగే బెంగళూరులో మరో యువతి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా రెండుచోట్ల వివాహాలపేరిట మోసం చేసినట్లు తెలిసింది. ఇతన్ని అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చుతున్నామని డీఎస్పీ తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..
కర్ణాటక,బళ్లారి అర్బన్: బళ్లారి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హతమార్చిన ఘటన చోటు చేసుకొంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొళగల్లు గ్రామానికి చెందిన కాగి సోమయ్య(34) అనే వ్యక్తి ఈనెల 20న తన భార్య యల్లమ్మతో కలిసి ద్విచక్ర వాహనంలో బళ్లారి–హొసపేటె రోడ్డులోని రామేశ్వరినగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లారు. దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వంతెన వద్దకు రాగానే పథకం ప్రకారం యల్లమ్మ తన ప్రియుడు, అదే గ్రామానికి గ్రామ పంచాయితీ సభ్యుడు సంజీవప్పను అక్కడకు పిలిపించింది. దీంతో సంజీవప్ప వారిని అటకాయించి సోమయ్యపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేసి హెచ్ఎల్సీ ప్రధాన కాలువలోకి మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి సోమయ్య ఆచూకీ లేకపోవడంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి యల్లమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సంజీవప్ప కోసం గాలింపు చేపట్టారు. కాగా సోమయ్య మృతదేహం మంగళవారం లభ్యమైంది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ హనుమంతప్ప దర్యాప్తు చేపట్టారు. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం, గోరంట్ల: కమ్మలవాండ్లపల్లిలో బి.వాణిశ్రీ (22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కట్నం వేధింపులే ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వాణిశ్రీ, నాగరాజు దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. మద్యానికి బానిసైన నాగరాజు రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. అదనపు కట్నం తీసుకురానందున మీ పుట్టింటి వారు ఇక్కడికి వచ్చినా, వారితో నీవు మాట్లాడినా తాను తెగదెంపులు చేసుకుని మరో పెళ్లి చేసుకుంటానంటూ నాగరాజు భార్యను హెచ్చరించాడు. అంతటితో ఆగక అలిగి కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి రచ్చబండ వైపు వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన వాణిశ్రీ ఇంట్లోనే ఇనుపరాడ్‌కు ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భర్త, స్థానికులు గమనించి ఉరికి వేలాడుతున్న వాణిశ్రీని కిందకు దించి గోరంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోనే ఆమె ప్రాణం విడిచింది. మెట్టినింటి వారిపై ఆగ్రహం తమ కుమార్తె వాణిశ్రీ మృతికి మెట్టినింటి వారి కట్నం వేధింపులే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతురాలి తండ్రి వెంకటరామప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదులో ఆలస్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బంధువులతో కలిసి మృతదేహంతో మంగళవారం ప్రభుత్వాస్పత్రి నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులతో చర్చించి న్యాయం చేస్తామని తెలపడంతో వారు శాంతించారు. ఐదుగురిపై కేసు నమోదు ఫిర్యాదును పలుమార్లు మార్చి ఇవ్వడంతో కేసు నమోదు చేయడానికి ఆలస్యమైందని సీఐ జయనాయక్ స్పష్టం చేశారు. వాణిశ్రీ మృతికి ఆమె భర్త నాగరాజుతో పాటు అతని సోదరులు నాగేంద్ర, రవి, శ్రీనివాసులు, ఆడపడుచు రత్నమ్మ కారణమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఐదుగురిపైనా కేసు నమోదు చేశామన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
బస్సు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
సాక్షి, మడకశిర(అనంతపురం) : తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం బస్సు లోయలో పడిన ప్రమాదంలో మడకశిరకు చెందిన ఇద్దరు మృతి చెందారు. పట్టణానికి చెందిన మేడా శ్రీనివాసులు(62), మేడా మధురాక్షమ్మ(56) ఈ ప్రమాదంలో మరణించారు. వీరు శుక్రవారం రాత్రి మడకశిర నుంచి ఓ ప్రైవేట్ మినీ బస్సులో అన్నవరం, భద్రాచలం తదితర ప్రాంతాల సందర్శనలో భాగంగా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చెళ్ళకెరకు వెళ్లారు. చెళ్ళకెరలోని బంధువులను కూడా ఆయా ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్లారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం భద్రాచలంలో పూజలు నిర్వహించుకున్నారు. ఆ తర్వాత అన్నవరానికి వెళ్తుండగా మారేడుమిల్లి–చింతూరు మధ్య వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడగా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో మడకశిరకు చెందిన మేడా శ్రీనివాసులు, మేడా మధురాక్షమ్మ ఉన్నారు. ఈ దంపతులకు కుమారుడు కిశోర్, కుమార్తెలు ఆశ, నాగమణి సంతానం. కుమార్తెలిద్దరికీ వివాహం కాగా.. కుమారుడు కిశోర్ ఓ ప్రైవేట్ టెలికాం సంస్థలో పని చేస్తున్నాడు. మృతులు మడకశిరలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుమారుడు తన మిత్రులతో కలిసి ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. మృతుల్లో కొందరి మూలాలు మడకశిరలోనే.. మృతుల్లో ఎక్కువమందికి మడకశిరతో సంబంధం ఉంది. ప్రస్తుతం చెళ్ళకెరలో నివాసం ఉంటున్న మేడా వెంకటాచలపతి(56), మేడా గాయత్రమ్మ(52), వీరి కుమార్తె మేడా శ్వేత(25) కూడా మృతుల్లో ఉన్నారు. వీరు మడకశిర నియోజకవర్గంలోని అగళి మండలం ఇనగలూరుకు చెందిన వారు. ఈ కుటుంబం 25 ఏళ్ల పాటు ఇదే మండలంలోని దొక్కలపల్లిలో చిల్లర అంగడిని ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహించారు. ఐదేళ్ల క్రితమే ఈ కుటుంబం అంతా చెళ్ళకెరకు వలస వెళ్లింది. ప్రమాదంలో ఈ కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడం బంధువులను విషాదంలోకి నెట్టింది. -
పిల్లల ఆకలి చూడలేక తల్లి ఆత్మహత్య
సాక్షి, కళ్యాణదుర్గం రూరల్(అనంతపురం) : పిల్లల పోషణ భారమై వివాహిత అర్ధంతరంగా తనువు చాలించింది. ఈ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. మృతురాలి భర్త, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణం చౌడేశ్వరివీధిలో నివాసముంటున్న నాగరాజు, నాగమణి దంపతుల కుమార్తె బోయ రేణుక (26)కు కుందుర్పి మండలం గురువేపల్లికి చెందిన మూర్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు హర్షిత(8), ధరణి(3), మరో 4 నెలల పాప ఉన్నారు. మూర్తి మూడు ఎకరాల పొలంలో టమాట సాగు చేశాడు. పంట చేతికందకపోవడంతో నష్టం వచ్చింది. అప్పటి నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో కొన్ని నెలలు పుట్టింటిలో ఉండాల్సిందిగా భార్య, పిల్లలను కళ్యాణదుర్గం పంపించాడు. అక్కడ కుమార్తెలను పోషించుకునే దారి తెలియక మదనపడేది. బతుకుదెరువు కనిపించకపోవడంతో పిల్లలను పస్తులుండటం చూడలేక మనస్తాపం చెందిన రేణుక సోమవారం ఉదయం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బంధువులు, స్థానికులు గమనించి ఆమెను కిందకు దించి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రేణుక ప్రాణం విడిచినట్టు డాక్టర్లు నిర్ధారించారు. భర్త మూర్తి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులను శిశు గృహానికి పంపించడానికి చర్యలు తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లల బాగుగోలు చూసుకునేందుకు అనంతపురంలోని శిశుగృహకు పంపించడానికి చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ సీడీపీఓ గీతాంజలి, సూపర్వైజర్ పద్మజ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి చేరుకుని చిన్నారుల వివరాలను సేకరించారు. త్వరలోనే చిన్నారులను శిశుగృహకు అప్పగిస్తామని సీడీపీఓ చెప్పారు. -
ప్రియుడే చంపేశాడు
సాక్షి, అనంతపురం ,గుత్తి: ప్రియురాలు మరొకరితో చనువుగా ఉంటోందన్న నెపంతో ప్రియుడే మట్టుబెట్టాడు. వివరాల్లోకి వెళితే గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డు(షాలోన్ నగర్)లో నివాసముంటున్న ఓ డిగ్రీ విద్యార్థిని (మైనర్) శనివారం రాత్రి మృతి చెందింది. పోలీసులు అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా హంతకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జక్కల చెరువుకు చెందిన వాయల రంగస్వామి (ఇతడూ మైనరే) అనే వ్యక్తి నుంచి విద్యార్థినికి కాల్ వచ్చింది. దీంతో సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐలు ఇబ్రహీం, రాజేష్‌లు హత్య చేసింది ప్రియుడు వాయల రంగస్వామి అని నిర్ధారణకు వచ్చారు. వెంటనే జక్కల చెరువు గ్రామానికి వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలించి తమ దైన శైలిలో విచారించగా తానే హత్య చేశానని రంగస్వామి అంగీకరించాడు. అయితే విచారణలో హంతకుడు పలు ఆసక్తికర విషయాలు చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వాయల రంగస్వామి, సదరు విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తి అయ్యాక డిగ్రీకి తలా ఒక కాలేజీలో చేరారు. ఆ తర్వాత ఆ విద్యార్థిని మరో విద్యార్థితో చనువుగా ఉంటున్నట్లు తెలుసుకున్న రంగస్వామి ఆమెను పలుసార్లు హెచ్చరించాడు. ఆమె వినిపించుకోలేదని మట్టుబెట్టాలని పథక రచన చేశాడు. ఈ క్రమంలో శనివారం ఆమెకు ఫోన్ చేసి మీ ఇంటి పక్కన కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వచ్చిన ఆమెతో గొడవ పెట్టుకున్న రంగస్వామి తన వెంట తెచ్చుకున్న బైక్ క్లచ్ వైర్‌ను ఆమె గొంతుకు బిగించి ఆపై తలను గోడకు బాదాడు. అంతటితో ఆగకుండా చున్నీని మెడకు బిగించి ఇంటి కాంపౌండ్ వాల్ ఆవలకు పడేసి పరారయ్యాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. -
రిటైర్డ్ కానిస్టేబుల్ దారుణ హత్య
సాక్షి, తాడిపత్రి: పట్టణంలోని కాలువగడ్డ వీధిలో రిటైర్డ్ ఫైర్ కానిస్టేబుల్ లక్ష్మన్న (68) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన లక్ష్మన్న పుట్టపర్తిలో అగ్నిమాపకశాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎనిమిదేళ్ల కింద పదవీ విరమణ పొందాడు. లక్ష్మన్నకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య, పెద్దకుమారుడు హరి అనంతపురంలో నివాసముంటుండగా, రెండవ కుమారుడు హరిక్రిష్ణ వైఎస్సార్ జిల్లా పులివెందులలో నివాసముంటున్నాడు. గతంలో లక్ష్మన్న తాడిపత్రి పట్టణంలోని టైలర్స్‌కాలనీలోని తన సొంత నివాసంలో ఉండేవాడు. ప్రస్తుతం కాలువగడ్డ వీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి లక్ష్మన్న రక్తపుమడుగులో పడి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ తేజమూర్తి, ఎస్ఐ ఖాజాహుసేన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మన్న మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడు లక్ష్మన్న, కుమారులకు ఆస్తి విషయంలో తగాదాలు ఉండేవని తరచూ లక్ష్మన్న కుమారులు తన తండ్రి వద్దకు వచ్చి గొడవ పడతూ వెలుతుండేవారని స్థానికులు పోలీసులకు వివరించనట్లు సమాచారం. దీంతో లక్ష్మన్న రెండవ కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి : కోరిక తీరిస్తేనే.. లేదంటే జీవితాంతం.. -
అత్తారింట్లో అల్లుడి అనుమానాస్పద మృతి
సాక్షి, చెన్నేకొత్తపల్లి(అనంతపురం): అత్తారింట్లో అల్లుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. చెన్నే కొత్తపల్లి మండలం నామాల గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు... కూడేరుకు చెందిన వీరాంజనేయులు (32) మూడేళ్ల కిందట నామాల గ్రామానికి చెందిన తులసమ్మను వివాహం చేసుకున్నాడు. ఇటీవల వీరికి కూతురు జన్మించింది. పుట్టింటిలో ఉన్న భార్య, కుమార్తెను చూసేందుకు వీరాంజనేయులు వారం క్రితం నామాలకు వచ్చాడు. ఏమైందో తెలీదు కానీ ఆదివారం తెల్లవారుజామున గదిలో ఉరికి వేలాడుతుండటాన్ని బంధువులు గమనించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్యకు గురయ్యాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
పదో తరగతి విద్యార్థి కిడ్నాప్‌కు యత్నం
అనంతపురం, కళ్యాణదుర్గం రూరల్: కిడ్నాప్‌కు గురైన పదో తరగతి విద్యార్థి మార్గమధ్యలో తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరిన ఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తెలిపిన వివరాలిలా.. నారాయణపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, అంజినప్పల కుమారుడు అజిత్ స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు అజిత్‌ను ఆపి మల్లాపురం గ్రామానికి దారి అడిగారు. దారి చూపి ముందుకెళుతుండగా వారు పాఠశాల వద్ద దింపుతామంటూ కారులో ఎక్కించుకున్నారు. పాఠశాల వద్ద ఆపకుండా వెళ్తుండటంతో గట్టిగా అరవడం తో కళ్లకు, నోటికి గంతలు కట్టి కంబదూరుకు తీసుకెళ్లారు. అక్కడి మద్యం కోసం దుకాణం వద్ద కారు ఆపిన సమయంలో విద్యార్థి తప్పించుకున్నాడు. సమీపంలో ఉన్న ఇళ్లలోకి వెళ్లి జరిగిన విషయాన్ని వారి ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లో చేరవేశాడు. వారు అక్కడికి చేరుకొని బాలుడిని వెంట తీసుకెళ్లారు. ఈ విషయమై కళ్యాణదుర్గం రూరల్ సీఐ శివశంకర్‌నాయక్ స్పందిస్తూ.. ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. -
కన్నకూతురిపైనే అఘాయిత్యం
సాక్షి, అనంతపురం: కనురెప్పే కాటేసిన చందాన కన్న కూతురిపై ఓ తండ్రి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలో ఓ కాలనీలో నివాసముంటున్న వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె(16)ను గత కొంతకాలంగా లైంగిక వేదింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయంపై బాధిత బాలిక 1098 చైల్డ్‌లైన్‌ను ఆశ్రయిచింది. దీంతో చైల్డ్‌లైన్ సిబ్బంది చైల్డ్ వెల్ఫేర్‌కమిటీ ముందు హాజరుపరిచారు. జరిగిన విషయాన్ని తెలియజేయడంతో సీడబ్ల్యూసీ అధికారులు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. దీంతో వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి నిందితుడిపై ఫోక్సోయాక్టు కింద కేసు నమోదు చేశారు. నిందితున్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలియజేశారు. ఇది చదవండి : సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే.. -
పరిటాల సునీత వర్గీయుల దాష్టీకం
-
పరిటాల వర్గీయుల బరితెగింపు
సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో పరిటాల వర్గీయులు బరితెగించారు. వినాయక నిమజ్జనం ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నసనకోట గ్రామంలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జనం నిర్వహించారు. నిమజ్జన ఘట్టాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు పక్కనే వెంకటాపురం, గంగంపల్లి గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే గొడవ నిమజ్జన కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామంలోకి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పరిటాల వర్గీయులు, చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో కట్టెలు, రాళ్లతో దాడి చేయడంతో నసనకోట వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు బోయ సూర్యం తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు చాకలి నాగభూషణ, నరసింహులు, సావిత్రమ్మ, ముత్యాలప్ప, నరేష్, ప్రతాప్, క్రిష్ణమ్మ గాయపడ్డారు. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీస్‌పికెట్ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. -
మొబైల్ కొనివ్వలేదని అఘాయిత్యం
సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : మొబైల్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని గుల్జార్‌పేటలో నివాసముంటున్న హెచ్చెల్సీ ఉద్యోగి జయరామిరెడ్డి కుమారుడు యశ్వంత్ (20) బెంగుళూరులోని ఓ కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. తండ్రి కొనిచ్చిన ఖరీదైన మొబైల్ ఫోన్‌ను ఇటీవల పోగొట్టుకున్నాడు. తనకు మరొక మొబైల్ కొనివ్వాలని యశ్వంత్ అడగ్గా.. కొద్దిరోజులు ఆగితే కొనిస్తానని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో యశ్వంత్ వినాయక చవితి పండుగకు తాడిపత్రిలోని తన చిన్నాన్న రామ్మోహన్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. తండ్రి తనకు మొబైల్ కొనివ్వలేదన్న మనస్తాపంతో సోమవారం ఉదయం కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు సుబ్బారెడ్డి, వరప్రసాద్, రాజశేఖర్‌రెడ్డిలు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇది చదవండి : రైలు నుంచి విద్యార్థి తోసివేత -
సాక్స్‌లో మొబైల్ ఫోన్ పెట్టుకొని సచివాలయం పరీక్షకు..
సాక్షి, అనంతపురం : కణేకల్లు మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోనుతో వచ్చి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్ధిని డీబార్ చేయడంతో పాటు అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్ సత్యనారాయణను ఆదేశించారు. రాయదుర్గానికి చెందిన బి.నౌషాద్కు సచివాలయ ఉద్యోగ రాత పరీక్ష కేంద్రం కణేకల్లు మోడల్ స్కూల్ పడింది. సెప్టెంబరు ఒకటో తేదీన ఉదయం సాక్స్‌లో సెల్‌ఫోన్ దాచుకుని పరీక్ష కేంద్రంలోకి వచ్చాడు. అయితే సిబ్బంది తనిఖీల్లో సెల్‌ఫోన్‌ను గుర్తించలేకపోయారు. పరీక్ష ముగియడానికి అరగంట ముందు మొబైల్ బయటకు తీసి గూగూల్లో సెర్చ్ చేసి ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాశాడు. చివరకు ఇన్విజిలేటర్ గుర్తించాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ పోలీస్ విచారణకు ఆదేశించడంతో నౌషాద్ తాను మొబైల్ తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అభ్యర్థిని డీబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ సత్యనారాయణ అభ్యర్థిని డీబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేశారు. సరైన పర్యవేక్షణ చేయనందుకు సంబంధిత ఇన్విజిలేటర్లు, హాల్ సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్, సెక్యూరిటీ స్టాఫ్‌పైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. -
కారు కోసమే హత్య
సాక్షి, బుక్కపట్నం(అనంతపురం) : బుక్కపట్నం మండలం సిద్దరాంపురం సమీపంలోని పాడుబడ్డ బావిలో గుర్తుతెలియని శవాన్ని గొర్రెలు, పశువుల కాపర్లు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుడిని చంపి.. తర్వాత గుర్తుపట్టకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పు పెట్టినట్లు నిర్ధారించారు. అయితే మృతదేహం వద్ద ఆనవాళ్లేవీ కనిపించకపోవడంతో గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు, కర్ణాటకలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని అన్నపూర్ణశ్వేరి నగర్ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన వారి వివరాలు సేకరించారు. జూలై 23న తన సోదరుడు కనబడుటలేదని నరసింహమూర్తి (23) సోదరి రమ్య ఫిర్యాదు చేసింది. రమ్య, మృతుడి కుటుంబ సభ్యులు బుక్కపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంఘటనా స్థలంలో లభించిన వస్తువులను చూసి అవి తమ సోదరుడు నరసింహమూర్తివేనని గుర్తుపట్టారు. హంతుకులకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించకపోయినప్పటికీ పుట్టపర్తి రూరల్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, బుక్కపట్నం ఎస్ఐ విజయ్‌కుమార్, సిబ్బంది ఆధునిక పరిజ్ఞానం సాయంతో నలుగురు నిందితులను గుర్తించారు. వీరిని శనివారం గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద అరెస్ట్ చేశారు. కారు కోసం ఘాతుకం.. నరసింహమూర్తి వద్ద ఉన్న షిఫ్ట్ డిజైర్ కేఏ41–బీ–7966 కారు కోసమే హత్య చేసినట్లు నిందితులు పొదలి వంశీకృష్ణ, కృష్ణమూర్తి కార్తీక్, పూజారి బలరామ్, ప్రతాప్ తెలిపారు. జూలై 19న రాత్రి 10.30 గంటల సమయంలో బెంగుళూరులోని మెజిస్టిక్ బస్టాండ్ వద్ద బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి పోవాలని బాడుగకు మాట్లాడుకొని కారులో బయల్దేరారు. గ్రామ సమీపంలో పాడుబడ్డ బావి వద్దకు చేరుకున్నాక నలుగురిలో ఇద్దరు టవల్‌తో గొంతుకు బిగించి నరసింహమూర్తిని చంపారు. మొదట మృతదేహాన్ని కారులో చుట్టుపక్కల తిప్పి.. చివరకు చంపిన చోటుకే వచ్చారు. అక్కడ మృతదేహంపై కిరోసిన్ పోసి కాల్చారు. అనంతరం కారులో కర్ణాటకలోని యాదిగిరికి చేరుకుని, అక్కడ ఒక వ్యక్తి దగ్గర రూ.60 వేలకు కారును తాకట్టు పెట్టారు. కారు అమ్మిన తరువాత డబ్బులు చెలిస్తామని అక్కడి నుంచి వెళ్లారు. ఈ క్రమంలోనే గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద పట్టుబడ్డారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. -
కానిస్టేబుల్ దంపతులపై దుండగుల దాడి
సాక్షి, గుత్తి(అనంతపురం) : కానిస్టేబుల్ దంపతులపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన గుత్తి మండలం బసినేపల్లి తండా సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బసినేపల్లి తండాకు చెందిన ఎం.వెంకటేష్ నాయక్ ఓడీచెరువులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన తన భార్యతో కలిసి బుధవారం రాత్రి బైక్‌లో బసినేపల్లి తాండాకు బయలుదేరాడు. తండా సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద దుండగులు దారిలో కంప చెట్లు అడ్డం పెట్టారు. వెంకటేష్ నాయక్ ద్విచక్ర వాహనం దిగి కంప చెట్లను తొలగిస్తున్నాడు. ఇంతలో అప్పటికే అక్కడ మాటు వేసిన నలుగురు దుండగులు ఒక్క ఉదుటున దంపతులపై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారి వద్దనున్న రెండు సెల్ఫోన్లు, కొంత డబ్బు లాక్కొని పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ దంపతులను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తండావాసులు బ్రిడ్జి వద్దకు వచ్చి దుండగుల కోసం గాలించారు. అయితే అప్పటికే దుండగులు పారిపోయారు. -
తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్ అడిగితే..
సాక్షి, పెద్దపప్పూరు(అనంతపురం): లిఫ్ట్ అడిగిన మహిళను బైక్‌పై ఎక్కించుకున్న వ్యక్తి ఆమెను గమ్యస్థానం చేర్చకుండా మరోచోటుకు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. తబ్జుల గ్రామానికి చెందిన ఓ మహిళ కృష్ణాష్టమి సందర్భంగా శింగనగుట్టపల్లిలో ఆలయానికి వెళ్లింది. దర్శన అనంతరం ఇంటికి తిరిగి వస్తోంది. తమ గ్రామానికే చెందిన చాకలి శ్రీరంగ బైక్‌పై వస్తుండటంతో ఆమె లిఫ్ట్ అడిగింది. సరేనని బైక్‌లో ఎక్కించుకున్న శ్రీరంగ.. గ్రామ సమీపంలో ఆపాలని ఆమె కోరినా ఆపకుండా మరోచోటుకు తీసుకెళ్లి ఆపాడు. ఒక్కసారిగా ఆమెపై లైంగికదాడికి యత్నించబోయాడు. ఆమె అతడి నుంచి తప్పించుకుని పరుగుపరుగున ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు, బంధువులకు విషయం చెప్పింది. శనివారం పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెళ్తున్న ఆమెను శ్రీరంగ బెదిరించాడు. తనకూ పోలీసులు తెలుసని, ఫిర్యాదు చేయకుండా వెనక్కు వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో ఆమె వెనక్కు వెళ్లిపోయింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి ఎస్ఐ మహమ్మద్ గౌస్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీరంగపై ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
రైలు నుంచి విద్యార్థి తోసివేత
సాక్షి, గుత్తి(అనంతపురం) : రైల్లోంచి ఇంటర్ విద్యార్థిని గుర్తుతెలియని ప్రయాణికుడు కిందకు తోసేశాడు. ఈ ఘటనలో విద్యార్థి రెండు కాళ్లు కోల్పోయాడు. జక్కలచెరువు రైల్వే స్టేషన్లో సోమవారం ఈ ఘటన జరిగింది. జీఆర్పీ పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన మైన్స్ వ్యాపారి రాజేశ్వరరెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు నిరంజన్‌రెడ్డి విజయవాడలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ సెకడియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులను చూడాలని విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైల్లో తాడిపత్రికి బయల్దేరాడు. గాఢ నిద్రలో ఉండటంతో తాడిపత్రిలో దిగలేదు. జక్కల చెరువు రైల్వే స్టేషన్లో రైలు వెళ్తున్న సమయంలో లేచి ఏ ఊరో తెలుసుకోవాలని డోర్ దగ్గరకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కిందకు తోసేశాడు. దీంతో నిరంజన్‌రెడ్డి రెండు కాళ్లు రైలు చక్రాల కింద పడ్డాయి. దీంతో రెండు కాళ్లు కట్ అయ్యాయి. సమీపంలోని వారు వెంటనే స్పందించి కట్ అయిన కాళ్లను ఓ సంచిలో వేసుకుని నిరంజన్‌రెడ్డిని 108 వాహనంలో హుటాహుటిన గుత్తి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ జిల్లా సీనియర్ నాయకులు పేరం నాగిరెడ్డి హుటాహుటిన గుత్తికి వచ్చి నిరంజన్‌రెడ్డిని పరామర్శించారు. కాళ్లు కోల్పోయిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుత్తి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు నాయక్, పీసీ వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చందాకోసం ఐచర్‌ను ఆపబోతే..
సాక్షి, కళ్యాణదుర్గం (అనంతపురం) : వినాయక చవితి చందాల వసూళ్లు హద్దుమీరుతున్నాయి. యువకులు రోడ్లపైకి వచ్చి తాడు అడ్డు పెట్టి వాహనాలను ఆపి చందాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి సమీపంలో రోడ్డుపై దాదాపు 20 మంది యువకులు వారం రోజులుగా వినాయక చవితి చందాలు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కంబదూరు వైపు నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఆపబోయారు. అప్పటికే అడుగడుగునా ఇలాంటి చందాల బ్రేకప్‌లతో విసుగు చెందిన డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా ఉన్న యువకులవైపు దూసుకెళ్లాడు. వారిలో ముగ్గురిని ఢీకొట్టి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో యర్రంపల్లి గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్, విష్ణు, వసంత్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గుర్తించి గాయపడిన వారిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నర్సింగ్ విద్యార్థి బలవన్మరణం
సాక్షి, అనంతపురం : బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం కళ్యాణదుర్గం రోడ్డులోని ఆదర్శ నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.... అమరాపురం మండలం శివరాపురం గ్రామానికి చెందిన లింగరాజు కుమార్తె కావ్య (20) ఆదర్శ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కడుపు నొప్పిస్తోందని తరగతి గది నుంచి హాస్టల్ రూంకు వెళ్లింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన తోటి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. చదువులో వెనుకబడటమే కారణమా..? టూటౌన్ సీఐ జాకీర్‌హుస్సేన్, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పటి నుంచి తెలుగుమీడియం చదివిన కావ్య ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో చదువులో వెనుకబడిందని, మొదటి సంవత్సరంలో ఐదు సబ్జెక్టులు ఫెయిలైందని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని సీఐ జాకీర్‌హుస్సేన్ తెలిపారు. -
ప్రాణం బలిగొన్న జాలీ రైడ్
అనంతపురం , తాడిపత్రి అర్బన్/నార్పల: జాలీ రైడ్ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. అమ్మమ్మను చూసొస్తానంటూ తల్లిదండ్రులకు చెప్పి స్నేహితులతో కలిసి బైక్‌పై బయలుదేరిన విద్యార్థి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని సాయి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బూస మురళీకృష్ణ (16), మహమ్మద్ ఖాసీం, షాషావలీ స్నేహితులు. కళాశాలలో చేరిన తర్వాత వీరికి ప్రొద్దూటూరులో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం విద్యార్థి హాజీపీరాతో పరిచయమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం ద్విచక్ర వాహనాలపై జాలీ రైడ్‌కు స్నేహితులు సిద్ధమయ్యారు. ఈ విషయం ఇంటిలో వారికి తెలిస్తే పంపరనే భయంతో.. ధర్మవరానికి స్నేహితులు కారులో వెళుతున్నారని, తాను కూడా వారితో కలిసి వెళ్లి అక్కడున్న అమ్మమ్మను చూసి తిరిగి వస్తానంటూ మురళీ కృష్ణ తన తల్లిదండ్రులను నమ్మించి బయలుదేరాడు. అయితే కారులో కాకుండా రెండు ద్విచక్ర వాహనాల్లో స్నేహితులు గురువారం ఉదయం బయలుదేరారు. వేగాన్ని నియంత్రించుకోలేక.. జాతీయ రహదారిపై రయ్యిమంటూ బైక్‌లను దూకిస్తూ స్నేహితులు జాలీగా ముందుకు సాగారు. ముచ్చుకోట దాటిన తర్వాత నార్పల మండలం మద్దలపల్లి గ్రామ శివారులో మలుపు వద్దకు చేరుకోగానే వాహనాల వేగాన్ని వారు నియంత్రించుకోలేకపోయారు. దీంతో మురళీకృష్ణ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొని.. అదే వేగంతో పక్కనే ఉన్న స్నేహితుల మరో వాహనాన్ని ఢీకొంది. ఘటనలో కిందపడ్డ మురళీకృష్ణకు తలకు తీవ్రగాయమై అపస్మారకస్థితికి చేరుకుని మృతిచెందాడు. హాజీపీరాకు కాలు విరిగింది. మహమ్మద్ ఖాసీం, షాషావలీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రలను 108 వాహనంలో జిల్లా సర్వజనాస్పత్రికి తరలించారు. మురళీకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ఘటనపై నార్పలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కడే కుమారుడు.. తాడిపత్రిలో బియ్యం వ్యాపారం చేసుకుని జీవనం సాగించే రమేష్ మంజుల దంపతులకు మురళీకృష్ణ ఒక్కడే కుమారుడు, కారులో తన అమ్మమ్మను చూసి వస్తానంటూ ధర్మవరానికి ప్రయాణమై బయలుదేరాడని, అయితే ఇలా తిరిగి రాని లోకాలకు వెళతాడని తాము ఏనాడూ అనుకోలేదంటూ తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రి వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, మురళీకృష్ణ మృతిచెందినట్లు తెలుసుకున్న కళాశాల యాజమాన్యం గురువారం సెలవు ప్రకటించింది. దీంతో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని తమ మిత్రుడిని కడసారి చూసి, కన్నీటి నివాళులర్పించారు. -
ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య
సాక్షి, కళ్యాణదుర్గం(అనంతపురం) : కంబదూరు మండల కేంద్రంలో ఎరికల రవి హత్య మిస్టరీ వీడింది. వివాహితను ప్రేమ పేరుతో వేధించినందువల్లే బాధితురాలి సోదరుడు తన స్నేహితులతో కలిసి రవిని అంతమొందించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మల్లికార్జున తన కార్యాలయంలో రూరల్ సీఐ శివశంకర్ నాయక్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు. కంబదూరుకు చెందిన ఎరికల రవి తండ్రి ఎరికల ముత్యాలప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎరికల రవి ఆటో నడుపుకుంటూ కళ్యాణదుర్గం మండలం దాసంపల్లికి చెందిన వివాహితను ప్రేమ పేరుతో వేధించేవాడు. సదరు వివాహిత తనకు ఎదురవుతున్న వేధింపులను సోదరుడు బోయ సీతారాములకు చెప్పుకుని విలపించింది. ఈ విషయంలో సోదరునితో పాటు సోదరుని స్నేహితులు కలిసి ఎరికల రవిని పలుమార్లు హెచ్చరించి ప్రేమపేరుతో వేధించడం మానుకోవాలని హెచ్చరించారు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాలేదు. తన సోదరికి ఎదురవుతున్న వేధింపుల గురించి సీతారాములు స్నేహితులైన దాసంపల్లి మొగలి రామాంజినేయులు, మాదిగ సురేష్‌ల వద్ద చెప్పుకుని బాధపడ్డాడు. పథకం ప్రకారం ముగ్గురు ఈ నెల 19న కంబదూరుకు వెళ్లి ఎరికల రవి బర్త్‌డే సందర్భంగా డిన్నర్ ఇవ్వాలని కోరారు. సదరు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంలో ఎరికుల రవిని ఎక్కించుకుని కంబదూరులోని వైఎన్‌హెచ్ కోట రోడ్డులో ఉన్న ఈడిగ గౌరమ్మ కల్లు దుకాణం వద్దకు వెళ్లి ఫూటుగా మద్యం తాగారు. రాత్రి 10.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఎరికల రవితో గొడవకు దిగారు. పథకం ప్రకారం తెచ్చుకున్న మచ్చు కొడవళ్లతో అక్కడే హతమార్చారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు సీతారాములు, మొగలి రామాంజనేయులు, మాదిగ సురేష్లను డీఎస్పీ ఆదేశాల మేరకు కంబదూరు మండలం నూతిమడుగు బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. వీరివద్ద ఉన్న రెండు మచ్చుకొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
కాల్చిపారేస్తా.. ఏమనుకున్నావో!
అనంతపురం సెంట్రల్: ‘మా సమస్యలోకి తలదూరుస్తావా.. ఏమనుకున్నావ్.. కాల్చి పారేస్తా..’ అంటూ పాయింట్ బ్లాంక్‌లో రివాల్వర్ పెట్టి ఓ కానిస్టేబుల్ బెదిరించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఘటనపై బాధితురాలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు... వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్సీ బీటెక్ రవి సోదరుడు భరత్‌రెడ్డికి గన్‌మన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ రాజారెడ్డి అనంతపురంలోని హమాలీకాలనీలో వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలుగా భార్య సుహాసినితో రాజారెడ్డికి మనస్పర్థలు వచ్చాయి. ఈ సమయంలో పెద్దమనుషుల పంచాయితీలు జరిగాయి. స్థానికంగా ఉంటున్న వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు లక్ష్మిదేవి భార్యాభర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న గన్‌మన్ రాజారెడ్డి బుధవారం భార్య ఇంటిపై దాడి చేసేందుకు వచ్చాడు. ఆ సమయంలో ఇంటిపక్కనే ఉన్న లక్ష్మిదేవి కనిపించడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన గన్‌మన్ ఏకంగా ఆమె తలకు రివాల్వర్‌పెట్టి బెదిరించాడు. దీంతో ఇంట్లోకి పరుగుతీసిన లక్ష్మిదేవి తలుపు వేసుకుంది. అయినప్పటికీ విడిచిపెట్టక బలవంతంగా తలుపు తీసి ఆమెను చంపేందుకు యత్నించాడు. గట్టిగా కేకలు వేయడంతో కాలనీ ప్రజలు గుమికూడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాజారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితురాలు లక్ష్మిదేవి పోలీసులను కోరారు. ఖండించిన మహిళా విభాగం నాయకులు ఓ మహిళను పాయింట్‌బ్లాంక్ రేంజ్లో రివాల్వర్ పెట్టి కానిస్టేబుల్ బెదిరించడం దారుణమని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి డిమాండ్ చేశారు. బాధితురాలితో కలిసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ ప్రతాప్‌రెడ్డిలను కలిసి ఫిర్యాదు చేశారు. -
భర్త హత్యకు సుపారీ.. సొమ్ము కోసం ఇల్లు అమ్మకం
అనంతపురం, తాడిపత్రి: వేరు కాపురానికి ఒప్పుకోని భర్తను హత్య చేయించేందుకు ఓ భార్య చేసిన కుట్ర అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. మంగళవారం తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓఎస్డీ స్వామి, డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి ఘటన వివరాలు మీడియాకు వెల్లడించారు. అనంతపురంలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న నిసారుద్దీన్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే పట్టణానికి చెందిన గౌసియాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. నిసారుద్దీన్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే పెళ్లయిన కొంత కాలానికే వేరు కాపురం పెట్టాలని భార్య ఒత్తిడి చేసినా ససేమిరా అన్నాడు. దీంతో 2016లో గౌసియా పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె భర్త ఉద్యోగంతో పాటు, అతని పేరిట ఉన్న ఇన్సూరెన్స్‌పై కన్నేసింది. భర్తను హత్య చేయిస్తే కారుణ్య నియామకం కింద ఉద్యోగంతో పాటు బీమా సొమ్ము మొత్తం తనకే చెందుతుందనే దురుద్దేశంతో హత్యకు వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా అనంతపురంలోనే నివాసం ఉంటున్న అఖిల భారత ప్రగతి శీల మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలమ్మ, ఆమె భర్త కులశేఖర్‌ను సంప్రదించింది. రూ.10 లక్షల సుపారీ తన భర్తను హత్య చేస్తే రూ.10 లక్షలు ఇస్తానని నిర్మలమ్మ, ఆమె భర్త కులశేఖర్తో గౌసియా ఒప్పందం చేసుకుంది. డబ్బు కోసం గౌసియా తన తల్లి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని విక్రయించింది. వచ్చిన డబ్బులో రూ. 2 లక్షలు అడ్వాన్స్‌గా నిర్మలమ్మకు చెల్లించింది. నిసారుద్దీన్‌ను హత్య చేసేందుకు నిర్మలమ్మ, కులశేఖర్ గార్లదిన్నెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమణారెడ్డితో రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.1.80 లక్షలు చెల్లించారు. రమణారెడ్డి ఈ బాధ్యతను తాడిపత్రి పోలీసుస్టేషన్లో ఓ కేసులో ముద్దాయిగా ఉన్న కడపకు చెందిన మురళీకృష్ణారెడ్డికి అప్పగించాడు. ఇతనికి రూ. 50 వేలు అడ్వాన్స్‌గా ముట్టజెప్పాడు. మురళీకృష్ణారెడ్డి, నాగేంద్రుడు, మరో వ్యక్తి కలిసి నిసారుద్దీన్ ఇంటి వద్ద హత్యకు రెక్కీ నిర్వహించారు. అయితే వీరు తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో తాడిపత్రి రూరల్ సీఐ సురేష్‌బాబు, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య కుట్ర బయటపడింది. ప్రధాన నిందితురాలు గౌసియా పరారీలో ఉండగా.. నిర్మలమ్మ, కులశేఖర్, మురళీకృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. -
చెల్లెలిపై అన్న లైంగికదాడి
సాక్షి, ధర్మవరం(అనంతపురం) : మైనర్ చెల్లెలిపై అన్న లైంగికదాడికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ వెంకటరమణ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య, ఆమె కుమారుడు ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో నివసిస్తున్నారు. రెండో భార్య, ఆమె కుమార్తె(మైనర్ బాలిక) కొత్తచెరువులో ఉంటున్నారు. కుటుంబ యజమాని తన రెండో భార్యను తీసుకుని బెంగళూరుకు వలస వెళ్లాడు. మైనర్ బాలిక ప్రతి రోజూ ధర్మవరం పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పని చేసి రాత్రికి కొత్తచెరువుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం మొదటి భార్య కుమారుడు తన తల్లి ఊళ్లో లేకపోవడంతో బట్టల దుకాణం నుంచి కొత్తచెరువుకు వెళ్లేందుకు రహదారిపై ఉన్న చెల్లెలు(మైనర్ బాలిక)ను తన వెంట ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే రోజు రాత్రి బాధిత బాలిక పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతనికి ఇదివరకే వివాహం కాగా వ్యసనాల కారణంగా భార్య విడిపోయింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. -
అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..
సాక్షి, కణేకల్లు(అనంతపురం) : ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వివాహితపై టీడీపీ నాయకుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో భయపడి పారిపోయాడు. ఈ ఘటన కణేకల్లు మండలం మాల్యంలో బుధవారం జరిగింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్యంలో ఓ వివాహిత తన భర్తతో కలిసి పుట్టింట్లో నివాసముంటోంది. తల్లి మూడు రోజుల క్రితం బళ్లారిలోని బంధువుల ఇంటికెళ్లింది. భర్త బుధవారం ఉదయం తన పనికోసం బయటికెళ్లాడు. వివాహిత మాత్రమే ఒంటరిగా ఉంది. సరిగ్గా ఉదయం 9.30 గంటల సమయంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనుచరుడు, టీడీపీ నాయకుడు శరబన్నగౌడ్ ఆ ఇంట్లోకి దూరాడు. ‘ఏమ్మా.. కొత్త ఇల్లు బాగానే కట్టావ్.. ప్రారంభానికి కూడా పిలవలేదే!’ అంటూ మాట కలిపాడు. వయస్సులో పెద్దాయన కావడంతో ఆమె మర్యాదగా మాట్లాడింది. సరే ఇల్లైనా చూడనివ్వు అంటూ ఇంకాస్త లోనికి వచ్చాడు. అమ్మ ఎక్కడ..? కన్పించడం లేదే అని ప్రశ్నించడంతో ‘అమ్మ ఊరికెళ్లిందని’ ఆమె సమాధానం చెప్పింది. నీ ఫోన్ నంబర్ ఇస్తే అప్పుడప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పడంతో తన వద్ద ఎలాంటి ఫోనూ లేదని తెలిపి గదిలోకి వెళ్లబోయింది. ఇంతలో ఒక్కసారిగా శరబన్నగౌడ్ వివాహితపై లైంగికదాడికి ప్రయత్నించాడు. తనను వదిలేయాలని ప్రాధేయపడని వినకపోవడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. -
ఫేస్బుక్ రిలేషన్; వివాహితపై అత్యాచారం
పాలషాపులో పనిచేసే ఓ వ్యక్తి, ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మరో ముగ్గురు ఓ వివాహితపై అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. ఏడాదిగా సాగిన వేధింపులతో మనస్తాపం చెందిన బాధితురాలు మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... నలుగురిపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. అనంతపురం, రాయదుర్గం రూరల్ : తనను భయపెట్టి.. బెదిరించి నలుగురు యువకులు అత్యాచారం చేశారని ఓ వివాహిత మంగళవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్బన్ సీఐ రియాజ్ అహ్మద్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ వ్యక్తి నాలుగేళ్ల కిందట కర్ణాటకకు చెందిన యువతితో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహిత ఏడాది కాలంగా రోజూ తెల్లవారుజామున సమీపంలోని షాప్‌కు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొచ్చేది. ఈ క్రమంలో షాపులో ఉండే మహేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇదే సమయంలో సెల్‌ఫోన్ ద్వారా ఫేస్బుక్ అకౌంట్ తెరిచిన వివాహితకు చాలామంది నుంచి ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ వచ్చాయి. అందులో రాయదుర్గానికే చెందిన పవన్, చీటీ మల్లికార్జున, ఫారుక్ ఉన్నారు. వీరు ఫేస్బుక్ చాటింగ్ ద్వారా ఆమెను ముగ్గులోకి దింపారు. సెల్ నంబర్ కోసం ఒత్తిడి చేసి అతికష్టం మీద ఆ వివాహిత నుంచి తీసుకున్నారు. బెదిరించి లొంగదీసుకున్నారు.. ఫేస్బుక్ ద్వారా వివాహిత వ్యక్తిగత సమాచారం, కుటుంబ విషయాలను ముగ్గురు స్నేహితులు తెలుసుకున్నారు. సేకరించుకున్న సెల్‌నంబర్ ద్వారా అప్పుడప్పుడు కాల్ చేస్తూ మరింత పరిచయం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెను ‘ఫేస్ బుక్ రిలేషన్’ను అడ్డు పెట్టుకుని వేధించడం మొదలు పెట్టారు. తమ కోరిక తీర్చకపోతే ఇంట్లోవారికి చెబుతామని, మీ సామాజిక వర్గం వారికి తెలుపుతామని, చివరకు యాసిడ్ దాడికి కూడా వెనుకాడబోమని బెదిరించారు. అప్పటికీ ఒప్పుకోకపోతే భర్త, కుమారుడిని చంపేస్తామని భయపెట్టి ఆమెను లొంగదీసుకున్నారు. వేధింపులు భరించలేక.. పాలషాపు మహేష్‌తో పాటు ఫేస్బుక్ ఫ్రెండ్స్ పవన్, చీటీ మల్లికార్జున, ఫారుక్‌ల నుంచి లైంగిక వేధింపులు రోజురోజుకూ హద్దు మీరుతుండటంతో భరించలేకపోయింది. ఇంట్లో వారికి చెప్పుకోలేక.. వారి ‘కోరిక’లు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త, అత్త గమనించి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. ఆ నలుగురిపై కేసుల నమోదు తనను మహేష్, పవన్, చీటీ మల్లికార్జున, ఫారుక్‌లు బెదిరించి అత్యాచారం చేశారని బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పై నలుగురు యువకులపైనా 376, 370, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రియాజ్ అహ్మద్ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ముగ్గురిపై పోక్సో, నిర్భయ కేసు బత్తలపల్లి : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురిపైన పోక్సో యాక్ట్, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు. తాడిమర్రి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బత్తలపల్లిలోని ఓ ప్రవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థిని పట్ల సమీప బంధువులు సదానంద, కిరణ్, దివాకర్ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు బత్తలపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురిపైనా కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వీరిని ధర్మవరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. -
కులాల మధ్య టీడీపీ చిచ్చు
కొత్తచెరువు: మండలంలోని నాగులకనుమ వద్ద చోటు చేసుకున్న గొడవలకు టీడీపీ నాయకులే కారణమంటూ వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఫణిశేఖర్, బాలాజీను వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డి.ఎస్.కేశవరెడ్డి సోమవారం పరామర్శించారు. అనంతరం స్థానిక ఆ పార్టీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తచెరువులో టీడీపీ నాయకులు రౌడీయిజం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మరోసారి ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. దాడిలో గాయపడిన కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పార్టీలకతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకుంటున్న పండుగను కొందరు స్వార్థపరులు రాజకీయం చేయాలని చూశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ జెండాలను కట్టి పండుగ సంస్కృతిని మంటగలిపే ప్రయత్నం చేశారన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కొత్తచెరువులో వైఎస్సార్ సీపీకి ఐదువేల పైచిలుకు మెజారిటీ రావడాన్ని జీర్ణించుకోలేక ఈ తరహా దాడులకు తెగబడడం సిగ్గుచేటన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునే నీచ సంస్కృతికి టీడీపీ నేత సాలక్కగారి శ్రీనివాసులు తెరలేపారన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధానాలకు స్వస్తి చెప్పకపోతే ప్రజలే టీడీపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు అంగడి సోమశేఖర్‌రెడ్డి, ఎల్లప్ప, వెంకటరాముడు, బుల్లెట్ మధు, నాగభూషణ, లక్ష్మీనారాయణ, షాన్‌షేట్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరిపోయిన అక్షర దీపం
‘ఆరేళ్ల’ ఆశయం అప్పుడే చెదిరిపోయింది.. అ, ఆ..లతో ఆరంభమై.. అచ్చులు, హల్లులతో ఆగకుండా దిద్దిన అక్షరమే దిద్దుతూ.. అడుగులో అడుగు వేస్తూ.. తరగతులు ఎన్నో మారుతూ .. తలరాతను మార్చుకుందామని ఎన్నో మెట్లు ఎక్కుతూ.. ఉన్నతంగా చదివి ఉన్నత శిఖరం వైపు అక్షర‘బాట’ పట్టిన ‘బాల’విజ్ఞాని ఎక్కాల్సిన మెట్లు కుప్పకూలి.. అప్పుడే వందేళ్లు నిండాయి.. మొదటి ‘గురువు’ నాన్నచేయి పట్టుకొని బడికెళ్తుంటే మృత్యుశకటం మీదకొచ్చి ఆశ..శ్వాసను కాలరాస్తే.. ఆ ఇంట విషాదం అలుముకుంది. పూలకుంట గ్రామ శోకసంద్రమైంది. సాక్షి, ఎస్కేయూ: పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి వెళ్తున్న తండ్రీ కొడుకును రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన కాటప్పగారి నరసింహారెడ్డి (40), సంధ్యారాణి దంపతులు. సంధ్యారాణి తన పుట్టినిల్లు అయిన బుక్కపట్నం మండలం మారాలకు వెళ్లింది. ఇంటి వద్ద నరసింహారెడ్డి, కుమారుడు కార్తీక్‌రెడ్డి (6) ఉన్నారు. సోమవారం ఉదయం సమతాగ్రాంలోని రాధా స్కూల్లో ఒకటో తరగతిలో చేర్పించడానికి కుమారుడిని తీసుకుని నరసింహారెడ్డి బైక్‌లో బయల్దేరాడు. ఆకుతోటపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తండ్రీకుమారుడు నరసింహారెడ్డి, కార్తీక్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఐచర్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదంజరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే పూలకుంట గ్రామస్తులు, ఎస్కేయూ విద్యార్థులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ గ్రామస్తులు విలపించారు. నరసింహారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటుకలపల్లి ఏఎస్ఐ నాగన్న తెలిపారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో తండ్రీ కుమారుల మృతదేహాలను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సందర్శించి, నివాళులర్పించారు. అమ్మ ఊరికి వెళ్లకుంటే... పూలకుంటలో ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో స్కూల్లో అడ్మిషన్ కోసం నరసింహారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డిని వెంట తీసుకెళ్లాడు. ‘అమ్మ ఊర్లో ఉండి ఉంటే బతికి ఉండేవాడివి కద బిడ్డా’ అంటూ బంధువులు రోదించిన తీరు కలచివేసింది. -
నిద్రలో ఉన్న భార్యను కడతేర్చిన భర్త
చెడు వ్యసనాలు అతడిని అప్పులపాలు చేశాయి. తాకట్టు పెట్టిన తన నగలను తెచ్చివ్వాలని కోరిన ఇల్లాలిపై కోపోద్రిక్తుడై కాలయముడిగా మారాడు. నిద్రిస్తున్న భార్యను కర్రతో బాది హత్య చేశాడు. ఆపై తనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో యాటకల్లులో విషాదం అలుముకుంది. అనంతపురం ,శెట్టూరు: కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గొల్ల సరళమ్మ(30)కు శెట్టూరు మండలం యాటకల్లుకు చెందిన గొల్ల రామచంద్రతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు యోగానంద, గోవర్ధన్, కుమార్తె చైత్ర ఉన్నారు. చెడువ్యసనాలకు అలవాటుపడిన రామచంద్ర అందినకాడల్లా అప్పులు చేశాడు. ఈ క్రమంలో భార్య ఒంటిపై ఉన్న నగలు కూడా తాకట్టు పెట్టి నగదు తెచ్చుకుని జూదంలో కోల్పోయాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. శనివారం రాత్రి సరళమ్మ తన నగలు తనకు తెచ్చివ్వాలంటూ భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో రామచంద్ర ఆవేశంతో ఊగిపోయాడు. అలా కాసేపటి తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. అయితే తనను నిలదీసిందనే కోపంతో రగిలిపోతున్న రామచంద్రప్ప ఆదివారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్య సరళమ్మను కర్రతో తలపై మోదాడు. సమీపంలోనే నిద్రిస్తున్న రామచంద్ర తల్లి ఉలికిపడి లేచి చూసి గట్టిగా అరిచింది. చుట్టు పక్కల జనం వచ్చి సరళమ్మను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి భార్య చనిపోయిందని తెలిసిఆత్మహత్యాయత్నం భార్య చనిపోయిందని తెలుసుకున్న గొల్ల రామచంద్ర బహిర్భూమికని వెళ్తూ పురుగుమందు వెంట తీసుకెళ్లి.. అక్కడే తాగి పడిపోయాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు అపస్మారక స్థితిలో పడి ఉన్న రామచంద్రను చూసి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామచంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఐ శివప్రసాద్, ఎస్ఐ రమనారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, హతురాలి తల్లి లక్ష్మిదేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లలు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. -
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
అనంతపురం, పెనుకొండ రూరల్: క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసినట్లు పెనుకొండ సీఐ బి.రామకృష్ణ, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4,17,800 నగదు, ఒక ఎల్ఈడీ టీవీ, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మునిమడుగు గ్రామానికి చెందిన వెంకటరాముడు, తుపాకుల నరసింహ, గుట్టూరుకు చెందిన చిన్న ఆంజనేయులు, ఎరికల శివ, కురుబవాండ్లపల్లికి చెందిన లింగమయ్య, పెనుకొండకు చెందిన అబ్దుల్లా, లక్ష్మీనారాయణ, శ్రీనాథ్‌లు అందరూ కలసి ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఫోన్ల ద్వారా ప్రతి బాల్‌కు సిక్స్, ఫోర్, వికెట్ అంటూ పందెం కాస్తున్నారన్నారు. మ్యాచ్‌లో ఫలానా జట్టు గెలుస్తుంది, ఓడుతుందని బెట్టింగ్ ఆడుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఒక వేళ ఎవరైనా బెట్టింగ్‌లో గెలిస్తే వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారన్నారు. తమకందిన సమాచారంతో డీఎస్పీ ఐ.రామకృష్ణ ద్వారా సర్చ్ వారంట్ తీసు కుని మ్యాచ్ జరుగుతున్న సమయంలో సదరు ఇంటిని సోదా చేశామన్నారు. ఆధారాలు లభించడంతో వారిని అరెస్టు చేశామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌సీ గంగాధర్, కానిస్టేబుళ్లు నాగరాజు, రమేష్, నాగేంద్రప్రసాద్, లక్ష్మి పాల్గొన్నారు. -
సీఎం సభకు వెళ్తూ ఒకరు మృతి
సాక్షి, అనంతపురం: సీఎం చంద్రబాబు ఎన్నికల సభకు జనాలను తరలించే తరుణంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి. ఈ ఘటన బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లా మబకశిర మండలం ఎగువ అచ్చంపల్లి దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పిల్లలతోసహా తల్లి ఆత్మహత్యాయత్నం
పీసీ.చిన్నప్యాపిలి(వజ్రకరూరు): పిల్లలతో సహా తల్లి బావిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిన్నప్యాపిలి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సుమంగళికి కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన కిష్టప్పతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారులు చరణ్, విఘ్నేష్, కుమార్తె వేదిక ఉన్నారు. శివరాత్రిని పురస్కరించుకుని సుమంగళి పిల్లలతో సహా పుట్టింటికి వచ్చింది. మధ్యాహ్నం గ్రామ సమీపంలోని బావి వద్దకు పిల్లలతో సహా వెళ్లింది. అయితే పెద్ద కుమారుడు చరణ్ అక్కడి నుంచి తప్పించుకుని బయటకువచ్చాడు. అనంతరం సుమంగళి మిగిలిన ఇద్దరు పిల్లలతో సహా బావి లోకి దూకింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే బావిలో పడ్డ తల్లీపిల్లలను బయటకు తీశారు. అయితే అప్పటికే వేదిక(16 నెలలు) మృతి చెందింది. అస్వస్థతకు గురైన విఘ్నేష్‌ను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. సుమంగళి మానసిక స్థితి సరిగా లేక పోవడం వల్లే బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
వివాహితది హత్యా.. ఆత్మహత్యా..?
అనంతపురం సెంట్రల్: నగరంలోని ఆరోరోడ్డులో బుధవారం జరిగిన సౌమ్య (25) అనే వివాహిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా.. మెట్టినింటి వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడిందని అత్తింటి వారు చెబుతున్నారు. పంటకు వాడే పురుగుమందు ఇంట్లోకి ఎలా వచ్చింది..? దానిని ఎవరు తీసుకొచ్చారు..? అనేది తెలియడం లేదు. అదనపు కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో అత్తమామలే అంతమొందించి ఉంటారని సౌమ్య బంధువులు ఆరోపిస్తున్నారు. సౌమ్య మృతి చెందిన రోజు నుంచి ఈరోజు వరకు అత్తింటి వారిని అదుపులోకి తీసుకోలేదని, విచారణా చేపట్టలేదన్నారు. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే ఉదాసీనంగా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం, నల్లచెరువు: పల్లెవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ కుమార్తె వాణి (19) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన మేరకు... వాణి కదిరిలోని బ్లూమూన్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడు రోజుల నుంచి మౌనంగా ఉంటున్న వాణి సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు గమనించి హుటాహుటిన కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
లక్కీడ్రా అంటూ ఫ్లిప్‌కార్ట్ పేరుతో టోకరా..
జనాల బలహీనతే వారి పెట్టుబడి.. ఆశ చూపి మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. గిఫ్ట్ తగిలిందని ఫలానా అకౌంట్లో డబ్బు జమ చేస్తే పంపుతామంటూ తియ్యటి మాటలతో మాయ చేస్తారు. వారు అనుకున్నట్టుగా డబ్బు పడగానే ఫోన్ స్విచ్చాఫ్ చేస్తారు. ఇదీ ఆన్లైన్లో జరుగుతున్న మోసాల తంతు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా జనాల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా ఆన్లైన్ మాయగాళ్ల చేతిలో మోసపోతూ పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అనంతపురం, శింగనమల: ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువుకు రూ.15 లక్షలు బహుమతి తగిలిందని, తాము చెప్పిన మొత్తం అకౌంట్లో జమ చేస్తే రూ.15 లక్షల నగదు లేక రూ.15 లక్షల విలువజేసే కారు అందిస్తామని చెప్పారు. ఈ మేరకు వాట్సప్‌లో కార్డు కూడా పంపారు. తీరా అకౌంట్లో డబ్బు వేశాక ఫోన్ ఎత్తకుండా మానేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకెళితే..మండలంలోని తరిమెల గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కరెంట్ కాంట్రాక్ట్ పని చేసేవాడు. మూడు నెలల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.459 పెట్టి బ్లూటూత్ కొనుగోలు చేశాడు. ఈనెల 13న మధ్యాహ్నం సమయంలో 9870511627 నంబర్ నుంచి శ్వేతాశర్మ పేరుతో ఫోన్ వచ్చింది. జార్కండ్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు తెలుగులో మాట్లాడింది. ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులు కొనుగోలు చేసిన వారి ఐడీలతో సంస్థ లక్కీ డ్రా తీసిందని, ఇందులో మీకు రూ.15 లక్షలు తగిలిందని చెప్పుకొచ్చింది. రూ.15 లక్షల నగదు మీ ఖాతాలోకి వేయాలంటే ముందుగా రూ.15 వేలు తమ ఖాతాలోకి జమ చేయాలని సూచించింది. నగదు జమ అయిన అరగంటలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పింది. ఒకవేళ రూ.15 లక్షల నగదు వద్దనుకుంటే రూ.15 లక్షల విలువజేసే మహీంద్ర ఎక్స్‌యూవీ 500 కారు అందిస్తామని, ఇందుకు రూ.15,500 జమ చేయాల్సి ఉంటుందని వివరించింది. ఇందుకు సంబంధించిన కారు ఫొటో, లక్కీడ్రా ఎంపికైన పత్రాలను వాట్సప్ (7256812304) ద్వారా పంపింది. ఆమె మాటలను పూర్తిగా నమ్మిన సురేష్ గూగుల్ పే ద్వారా రూ.15,000 ఆమె సూచించిన ఖాతాలో జమ చేశాడు. గంట పాటు ఎదురుచూసినా డబ్బు జమకాకపోవడంతో అతడు పై నంబర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ రింగవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, నిందితులు వాడిన ఫోన్ నంబర్ బిహార్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించినట్లు ఎస్ఐ ప్రసాద్‌బాబు తెలిపారు. -
బాలిక ఆత్మహత్యాయత్నం
అనంతపురం , బుక్కరాయసముద్రం : తమ్మున్ని గాయపరిచినందుకు తల్లిదండ్రులు తననెక్కడ కొడతారోనన్న భయంతో అక్క ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. పొడరాళ్ల గ్రామంలో బాబాఫకృద్దీన్, సాయినాల దంపతులకు కుమార్తె చాంద్‌బీ (17), కుమారుడు మౌలాలి ఉన్నారు. శుక్రవారం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో అక్కా తమ్ముడు మాత్రమే ఉన్నారు. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టే విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశంలో కత్తెరతో కొట్టడంతో తమ్ముడికి గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వస్తే తనను కొడతరాని భయపడ్డ అక్క చాంద్‌బీ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి బాలికను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శరీరం 60 శాతం మేర కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
విద్యార్థుల మిస్సింగ్ కలకలం
ముగ్గురు విద్యార్థుల ‘మిస్సింగ్’రాయదుర్గంలో కలకలం రేపింది.పాఠశాల నుంచి హాస్టల్ వద్దకు వెళ్లిన విద్యార్థులు కనిపించకుండా పోయారనే విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన మొదలైంది.తమ బిడ్డలను ఎవరైనా ఎత్తుకెళ్లారా? ఎక్కడికైనా వెళ్లిపోయారా అనేఅనుమానాలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మరుసటి రోజు ఉదయానికి దొరికారనే ఫోన్ కాల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం, గుమ్మఘట్ట: గుమ్మఘట్ట మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన గోవర్ధనరెడ్డి (8వ తరగతి), శరత్‌రెడ్డి (5వ తరగతి), డీ హిరేహాళ్ మండలం కొత్తూరుకు చెందిన హరి (7వ తరగతి) రాయదుర్గంలోని సెయింట్‌పాల్స్ స్కూల్లో చదువుతున్నారు. బేలోడుకు చెందిన సమీప బంధువులు రాయదుర్గం ఇంట్లోనే చిన్న హాస్టల్స్ నిర్వహిస్తుండడంతో అక్కడ ఉంటూ స్కూలుకెళ్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో శనివారం స్వగ్రామాలకు వెళ్లి యథావిధిగా సోమవారం ఇంట్లో ఖర్చుల కోసం డబ్బు తీసుకుని హాస్టల్‌కు వచ్చారు. లగేజీ అక్కడ ఉంచి పాఠశాలకు వెళ్లారు. పాఠశాల వదిలిన తర్వాత హాస్టల్‌కు చేరుకున్నారు. ట్యూషన్‌కు వెళ్తాతామని తోటి విద్యార్థులకు తెలిపి పుస్తకాలు బయట ఉంచి మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. ముగ్గురూ రైలెక్కారు.. సమీపానున్న రైల్వేస్టేషన్‌కు చేరుకుని రాత్రి 7 గంటలపైన గుంతకల్లు నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు ఎక్కి వెళ్లిపోయారు. ఎంత సేపైనా తిరిగి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు స్కూల్ వద్దకెళ్లి విచారించారు. ట్యూషన్‌కే రాలేదని అక్కడ ఉపాధ్యాయులు చెప్పడంతో గందరగోళానికి గురయ్యారు. చుట్టుపక్కల అంతా వెతికిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. సోషల్ మీడియాలోహల్‌చల్ ఈ విషయం ఆనోట ఈ నోట పడటంతో పాటు వాట్సప్, ఫేస్బుక్ సోషియల్ మీడియాలో హల్చల్ చేసింది. అప్రమత్తమైన పోలీసులు విచారణ ప్రారంభించారు. కొత్తూరుకు చెందిన హరి బంధువులు బెంగళూరులో ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని గుర్తించారు. అనుమానం కలిగి వారు బెంగళూరు రైల్వేస్టేషన్ వద్దకు చేరుకుని గస్తీ చేపట్టారు. మంగళవారం వేకువజామున ఐదు గంటలకు ప్యాసింజర్ రైలు నుంచి ముగ్గురు విద్యార్థులు దిగుతుండటం గమనించి పట్టుకున్నారు. అనుమానంతో అదుపులోకితీసుకున్న పోలీసులు బెంగళూరులో రైల్వే పోలీసులు అనుమానంతో హరి బంధువులను, పిల్లలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ బిడ్డలు మీ వారో కాదో..? తామెలా నమ్మేది అంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి చైల్డ్ వెల్ఫేర్‌కు తరలించారు. జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా చేరవేయడంతో రాయదుర్గం ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ అక్కడి పోలీసులతో ఫోన్లో మాట్లాడారు. వీడియో కాల్ ద్వారా విద్యార్థులను తల్లిదండ్రులకు చూపించారు. పిల్లల రాకకు మరో రెండు రోజులు అక్కడి నిబంధనల ప్రకారం సోమ, లేదా గురువారాల్లో మాత్రమే ఇలాంటి కేసులు విచారిస్తారు. గురువారం వరకు వదిలేది లేదని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. ఆధార్‌కార్డు, పిల్లల ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వస్తే తప్ప పంపేది లేదని చెప్పడంతో చెప్పడంతో నిరాశతో తల్లిదండ్రులు వెనుదిరిగారు. బిడ్డల కోసం ఇంకా రెండు రోజులు ఎదురు చూడాల్సి వస్తోందని విలపించారు. విద్యార్థులు ఇలా ఎందుకు వెళ్లి పోయారో తెలియాల్సి ఉంది. -
యువకుడిపై యువతి కత్తితో దాడి..
తనకల్లు: యువకుడిపై యువతి కత్తితో దాడిచేసిన ఘటన కలకలం రేపింది. అయితే తాను ఆత్మరక్షణ కోసమే దాడి చేసినట్లు యువతి చెబుతోంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం తనకల్లులోని ఇందిరానగర్‌కు చెందిన స్వప్న అనే యువతి సోమవారం అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఒంటరిగా కూర్చుంది. అదే సమయంలో ఆలయ పూజారి బంధువు మంజునాథ్ లైట్లు వేసేందుకని స్విచ్‌బోర్డు దగ్గరకు వెళ్లబోయాడు. అతను దురుద్దేశంతో తనవద్దకే వస్తున్నాడని భావించిన స్వప్న తన దగ్గర ఉన్న కత్తితో అతడి తలపై దాడి చేసింది. గాయపడిన మంజునాథ్‌ను స్థానికులు, బంధువులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆత్మరక్షణకే అంటున్న అమ్మాయి తాను ఆత్మరక్షణలో భాగంగానే మంజునాథ్‌పై దాడి చేయాల్సి వచ్చినట్లు స్వప్న పోలీసులకు తెలిపింది. ఒంటరిగా కూర్చొని ఉన్న తన వద్దకు ఆతడు వేగంగా రాబోయాడని, తాను దగ్గరకు రావద్దని ఎంత వారించినా అతను అటే రావడంతో భయపడి తన వద్ద ఉన్న చిన్నపాటి కత్తితో దాడి చేసినట్లు పేర్కొంది. -
మడకశిరలో భారీ అగ్ని ప్రమాదం
అనంతపురం,మడకశిర: పట్టణంలోని మధుగిరి సర్కిల్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో చికెన్ సెంటర్, ఉడ్‌వర్క్ షాపులు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన సర్పరాజ్ కొన్నేళ్ల నుంచి మధుగిరి సర్కిల్ సమీపంలో చికెన్‌సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. చికెన్‌సెంటర్ పక్కనే పట్టణానికి చెందిన గంగరాజు ఉడ్‌వర్క్ షాపు నిర్వహించేవాడు. అర్ధరాత్రి సమయంలో ఉన్నఫళంగా మంటలు వ్యాపించి షాపులు రెండు దగ్ధమయ్యాయి. దీంతో చికెన్ సెంటర్లోని కోళ్లు, కోడిగుడ్లు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఉడ్‌వర్క్ షాపులో కూడా విలువైన వస్తువులు, కట్టెలు కాలి బూడిదయ్యాయి. ఘటనలో చికెన్ సెంటర్ నిర్వాహకుడికి రూ.3 లక్షలు, ఉడ్‌వర్క్‌షాపు నిర్వాహకుడికి రూ.15 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈప్రమాదానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా క్షక్షగట్టి కావాలనే ఎవరైనా షాపులకు నిప్పు పెట్టారా? అనే విషయం సస్పెన్స్‌గా మారింది. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. ఆరు ఇళ్లల్లో చోరీ..
-
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
అనంతపురం, పుట్టపర్తి అర్బన్/ గుంతకల్లు: దొంగలు బరితెగించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తెగబడ్డారు. మూడు ప్రాంతాల్లోని పది ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌లోని శివయ్య, వెంకటరాముడు, అరుణ, అనసూయమ్మ, వరలక్ష్మి ఇళ్లలో దొంగలు పడ్డారు. వరలక్ష్మి ఇంటిలో రూ.20 వేల నగదు, రెండు తులాలు విలువ చేసే కమ్మలు, శివయ్య ఇంటిలో 8 బంగారు ఉంగరాలు, జత కమ్మలు, కాలిపట్టీలు ఎత్తుకుపోయారు. మిగతా మూడు ఇళ్లల్లో విలువైన దుస్తులు అపహరించుకుపోయారు. బాధితులంతా చిరుద్యోగులు. ఆదివారం సెలవు కావడంతో శనివారమే ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఆదివారం తెల్లవారుజామున ఈ ఇళ్లకు కన్నం వేశారు. ప్రశాంతిగ్రామంలోనూ రెండు ఇళ్లలో చోరీ జరిగింది. ఏమేమి చోరీ అయ్యాయో బాధితులు ఫిర్యాదు చేయలేదని రూరల్ ఎస్ఐ శాంతిలాల్ తెలిపారు. గుంతకల్లులో మూడు ఇళ్లలో... పాత గుంతకల్లులోని అంకాళమ్మ గుడి సమీపాన రైతు గోవిందరాజులు, లక్ష్మీదేవమ్మలు ఒకే భవనంలో అద్దెకు ఉంటున్నారు. రైతు గోవిందురాజులు సంక్రాంతి పండుగ కావడంతో భార్య కృష్ణవేణి పుట్టినిల్లు అయిన డొనేకల్లుకు వెళ్లారు. గోవిందురాజులు స్వగ్రామం బెల్డోనకు వెళ్లి అక్కడే ఉన్నారు. ఇదే ఇంట్లో పై అంతస్తులో నివాసముంటున్న లక్ష్మీదేవమ్మ కూడా తన స్వగ్రామం వెళ్లింది. దీన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు శనివారం అర్ధరాత్రి తొలుత రైతు గోవిందురాజులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని 30 తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.80వేల పైచిలుకు నగదు అపహరించుకుపోయారు. పై అంతస్తులో నివాసముంటున్న లక్ష్మీదేవమ్మ ఇంట్లో రూ.4వేల నగదు ఎత్తుకెళ్లారు. హౌసింగ్ బోర్డులోని తాళం వేసిన షబ్బీర్ ఇంట్లో కూడా దొంగతనం చేశారు. రూ.20వేల నగదు, జత బంగారు జుంకీలు చోరీ చేశారు. ఆదివారం ఉదయాన్నే తలుపులు పగులగొట్టి ఉండటం గమనించిన ఇరుగుపొరుగు వారు బాధిత కుటుంబ యజమానులకు సమాచారం అందించారు. డీఎస్పీ ఖాసీంసాబ్, సీఐలు అనిల్‌కుమార్, సాయిప్రసాద్‌లు సంఘటన స్థలాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఊళ్లకు వెళితే... ఇంటికి తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే వారు పోలీసుస్టేషన్లలో సమాచారమివ్వాలని చెబుతున్నా ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు. ఊళ్లకు వెళ్లే ముందు పోలీసుస్టేషన్లో తెలిపితే ఎల్‌హెచ్‌ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) కెమెరాలు ఇంటికి అమర్చుతారు. ఈ కెమెరాలు పోలీసుస్టేషన్‌లోని మెయిన్ సీసీ కెమెరాల ఫుటేజ్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే పోలీసుస్టేషన్లో అలారం మోగుతుంది. పోలీసులు అప్రమత్తమై దొంగలను పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. -
క్షణికావేశం..ఓ ప్రాణం తీసింది!
అనంతపురం, నార్పల: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ఆస్తి విషయంలో మొదలైన చిన్నపాటి గొడవ ఏకంగా ఓ తండ్రి ప్రాణాన్నే బలిగొంది. ఈసంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..మండల కేంద్రంలోని ఉయ్యాలకుంటలో నివాసముంటున్న తిరుపతయ్య(58)కు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు రాజకుళ్లాయప్ప ఉన్నారు. గురువారం రాత్రి ఆస్తి విషయమై తిరుపతయ్యకు కుమారుడి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. మాటామాట పెరిగి కుమారుడు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఈక్రమంలో పక్కనే ఉన్న రాయిని తండ్రిపై విసిరాడు. రాయి నేరుగా తలను తాకడంతో తీవ్ర రక్తస్రావమై తిరుపతయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ పుల్లయ్య ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వ్యాసాపురంలో కలకలం
భార్యను హతమార్చి.. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. అనంతపురం, ఉరవకొండ రూరల్: వ్యాసాపురంలో భార్య హత్య.. భర్త ఆత్మహత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వ్యాసాపురం గ్రామానికి చెందిన మారెన్న (30), విశాలాక్షి (25)లకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు వంశీ, ఏడాది వయసు గల కుమార్తె హేమాంజలి ఉన్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ గొడవ పడుతుండేవారు. కుటుంబ సమస్యలపై వాదులాడుకుంటున్నారేమో అని అందరూ భావించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటాక.. నిద్రలో ఉన్న విశాలాక్షిపై భర్త మారెన్న గొడ్డలితో విరుచుకుపడ్డాడు. చెంపపైన, చేతిపైన నరికాడు. అలికిడికి ఇంటి పక్కనున్న కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి మారెన్న ఉడాయించాడు. అయితే అప్పటికే విశాలాక్షి ప్రాణం విడిచింది. ఆదివారం ఉదయం ఆరుగంటల సమయంలో గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సుధాకర్ యాదవ్ గ్రామానికి వెళ్లి చూసి ప్రజలను విచారించారు. అనుమానంతో భార్యను హత్యచేసి.. తర్వాత తనూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. పాలకోసం తల్లడిల్లి.. పాల కోసం అమ్మ వద్దకు వెళ్తున్న హేమాంజలి (1)ని చూసి అందరూ చలించిపోయారు. ‘ఇంకెక్కడుందమ్మా.. మీ అమ్మ’ అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇద్దరు పిల్లలను హత్తుకుని.. చిన్న వయసులోనే మీకెంత కష్టం వచ్చిందే అంటూ రోదించారు. -
బీటెక్ విద్యార్థిని అదృశ్యం
అనంతపురం, మడకశిర/ కదిరి అర్బన్: మడకశిరలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న యోగేశ్వరి అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ గోపీయాదవ్ ఆదివారం మీడియాకు తెలిపారు. కదిరి మండలం చవిటితండాకు చెందిన చంద్రానాయక్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె యోగేశ్వరీ మడకశిరలోని వ్యవసాయ కళాశాలలో బీటెక్ (అగ్రికల్చర్) ఫస్ట్ ఇయర్ చదువుతోంది. రెండో కుమార్తె మానస ఎస్కే యూనివర్సిటీలో బీటెక్‌లో చేస్తోంది. కుమారుడు ఓడీసీలో పదో తరగతి చదువుతున్నాడు. యోగేశ్వరీ గత డిసెంబర్ 31న చవిటితండా నుంచి మడకశిరలోని కళాశాలకు వెళ్లింది. జనవరి నాలుగో తేదీన ఉదయం రూ.15 వేలు ఫీజు కట్టాలని తండ్రికి ఫోన్లో తెలిపింది. ఆదివారం తీసుకుని వస్తానని తండ్రి చెప్పాడు. అదే రోజు ఫస్ట్ ఇయర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. యోగేశ్వరి కొన్ని సబ్జెక్టులు ఫెయిలైంది. మనస్తాపానికి గురై ఆ రోజు మధ్నాహ్నం కళాశాలలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. విద్యార్థిని బయటకు వెళ్లేటపుడు కళాశాల అధికారులు సంతకం కూడా పెట్టించుకోలేదని తెలుస్తోంది. యోగీశ్వరి రోడ్డుపై నిలబడి ఉండగా తాము చూశామని తోటి విద్యార్థులు తెలిపారు. అదే రోజు రాత్రి 9 గంటలకు యోగేశ్వరి కనపడటం లేదని తల్లిదండ్రులకు కళాశాల నుంచి ఫోన్ రాగానే హుటాహుటిన మడకశిరకు బయల్దేరి వెళ్లారు. శనివారం అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ గోపీయాదవ్ తెలిపారు. -
భర్తే కాలయముడు
అనంతపురం, బుక్కపట్నం: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. గర్భిణి అనే కనికరం కూడా లేకుండా ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బుక్కపట్నం ఎస్సీ కాలనీకి చెందిన నిండు గర్భిణి జయలక్ష్మి (23) డిసెంబర్ 25న నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని భర్త నరేష్కుమార్ అనంతపురం ఆస్పత్రిలో చేర్చాడు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. తన భర్త నిత్యం వేధించేవాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని, అనుమానం రాకుండా ఉండేందుకు తానే ఆత్మహత్యకు యత్నించినట్లు నమ్మబలికాడని జయలక్ష్మి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కిరాతక భర్తను కఠినంగా శిక్షించాలని జయలక్ష్మి బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అయ్యో.. ఎంత పని చేస్తివి దేవుడా!
అనంతపురం, నల్లచెరువు: ‘అయ్యో..ఎంత పని చేస్తివి దేవుడా.. ఒక్కగానొక్క కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటిమే..ఇంతలోనే ఎంత పని చేస్తివయ్యా’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. మండలంలోని అల్లుగుండు సమీపాన మదరసా వద్ద జాతీయ రహదారిపై బైక్ బోల్తాపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు..తనకల్లు మండలం పెద్దకడపలవారిపల్లికి చెందిన గౌడుచెరువు శ్రీనివాసులురెడ్డి, చంద్రకళ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్ల్లల చదువు కోసం శ్రీనివాసులురెడ్డి బెంగళూరులోనే ఉంటూ ఫ్యాక్టరీలలో పని చేసేవారు. కుమారుడు శశివర్దన్‌రెడ్డి(19) బెంగళూరులో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. బుధవారం బెంగళూరు నుంచి ముత్యాచెరువులోని బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. అల్లుగుండు సమీపాన మదరసా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. శశివర్దన్‌రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న సాయికుమార్ స్పల్పగాయాలతో బయటపడ్డాడు. వెంటనే శశివర్దన్‌రెడ్డిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ రమేష్‌బాబు తెలిపారు. -
గర్భిణిని తోసేసిన దుండగుడు అరెస్ట్
అనంతపురం టౌన్: కొడవీడు ఎక్స్‌ప్రెస్ రైల్లోంచి గర్భిణిని తోసివేసిన దుండగుడు రాజేంద్రన్‌ను అరెస్టు చేసినట్లు గుంతకల్ డివిజన్ రైల్వే ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్ తెలిపారు. బుధవారం నగరంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో గల కోదండరామ కల్యాణమంటపంలో ఏర్పాటు చేసిన వికర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో నివాసముంటున్న వేలాయుధం రాజేంద్రన్ రైలులో దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తుడు.. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే పలు రైలు దొంగతానాల్లో జైలు జీవితం గడిపాడు. అక్కడి పోలీసుల హిట్ లిస్టులోకి ఎక్కడంతో రాజేంద్రన్ తన మకాం ఏపీకి మార్చాడు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జరిగిన పలు కేసుల్లో రాజేంద్రన్ నిందితుడు.గత ఏడాది నవంబర్ 20న ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైల్లో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపాన విజయలక్ష్మీ అనే మహిళను రైలు నుంచి తోసివేస్తుండగా ఆమె సోదరుడు ప్రతిఘటించడంతో రాజేంద్రన్ తప్పించుకుని పారిపోయాడు. నవంబర్25న పెనుకొండ రైల్వేస్టేషన్ వద్ద కదులుతున్న కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైల్లో నుంచి నిఖిత అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను తోసేశాడు. ఆమె దగ్గర ఎలాంటి బంగారు నగలు లేకపోవడంతో మొబైల్ ఫోన్ లాక్కుని ఉడాయించాడు. డిసెంబర్ 18న కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు జంగాలపల్లి రైల్వే స్టేషన్లో కదులుతుండగా బి–1 బోగీలో ప్రయాణం చేస్తున్న శిరీష అనే వివాహితను తోయడంతో అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది రక్షించారు. అదే బోగిలో కుటుంబ సభ్యులతో ప్రయాణం సాగిస్తున్న దివ్యశ్రీ అనే ఏడు నెలల గర్భిణి ధర్మవరం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో వాష్‌రూంకు రాగా.. అప్పటికే అక్కడ మాటువేసిన రాజేంద్రన్ గొల్లపల్లి రైల్వే గేట్ సమీపంలో ఆమెను కిందకు తోసేశాడు. అనంతరం అతడూ రైలులోంచి దూకి.. దివ్యశ్రీ వద్దనున్న బంగారు నగలను దోచుకుని ఉడాయించాడు. దొంగలించిన బంగారు నగలను రాజేంద్రన్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు ఉంచాడు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు, జీఆర్పీఎఫ్ అధికారులు గాలింపు ముమ్మరం చేసి 15 రోజుల్లోనే నిందితుడు రాజేంద్రన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ మోహన్‌ప్రసాద్, హనుమంతు, రాజశేఖర్‌రెడ్డి, నజీరుద్దీన్, షణ్ముఖానంద, చంద్రశేఖర్‌తోపాటు పలువురిని రైల్వే ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జీఆర్పీ ఎస్పీ రమేష్‌బాబుతోపాటు పలువురు పాల్గొన్నారు. -
కంటి‘పాప’ను కాటేయబోయిన తండ్రి
కామంతో కళ్లు మూసుకుపోయిన భర్తను కడతేర్చిన భార్య ఉదంతమిది. వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినా భార్య భరించింది. తాగొచ్చి హింసించినా సర్దుకుపోయింది. కుమార్తె అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించడంతో సహనం కోల్పోయి దాడి చేయడంతో భర్త ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అనంతపురంలో గురువారం చోటు చేసుకుంది. అనంతపురం సెంట్రల్: కొత్తచెరువు జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ సదాశివరెడ్డి హత్యకు గురయ్యాడు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో నివాసముంటున్న ఈయనకు పాతికేళ్ల కిందట శోభా అనే మహిళతో వివాహమైంది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత నుంచి తాగుడుకు బానిసయ్యాడు. దీనికి తోడు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. కళ్యాణదుర్గంలో పనిచేసే సమయంలో వివాహేతర సంబంధం కొనసాగించిన మహిళను ఏకంగా అనంతపురం తీసుకొచ్చి రాంనగర్లో వేరు కాపురం పెట్టాడు. జీతం డబ్బులు తాగుడుకు, వివాహేతర సంబంధాలకు వెచ్చిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. వారానికి, రెండువారాలకోసారి ఇంటికి వచ్చి తాగిన మత్తులో భార్య, పిల్లలను కొడుతూ చిత్రవధకు గురి చేసేవాడు. అయినా వారు అలాగే భరిస్తూ వస్తున్నారు. బుధవారం రాత్రి పూటుగా తాగి ఇంటికి వచ్చి న సదాశివరెడ్డి భార్యతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా లేసి కూతురితో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించాడు. దీన్ని చూసి భరించలేని ఆయన భార్య రీపర్ కట్టెతో తలపై మోదింది. అంతే.. నిమిషాల్లో ఆయన ప్రాణం కోల్పోయాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగు చూసింది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఆరోహణరావు తెలిపారు. -
కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్
అనంతపురం, కదిరి: మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. వధువు తల్లిదండ్రులు కట్నం రూపంలో ఇస్తున్న బంగారం స్వచ్ఛమైనది కాదంటూ వరుడు పరారయ్యాడు. గురువారం కదిరి పట్టణంలో చోటుచోసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తనకల్లు మండలం బాలసముద్రం పంచాయతీ టీ సదుంకు చెందిన మహబూబ్‌బాషా ఒక్కగానొక్క కుమారుడు మహమ్మద్ రఫికి కదిరి మున్సిపల్ పరిధిలోని నిజాంవలి కాలనీకి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు కదిరిలోని టైటానిక్ ఫంక్షన్ హాల్లో నిఖా(వివాహం) జరగాల్సి ఉంది. పెళ్లి హడావుడిలో ఎవరికి వారు నిమగ్నమై ఉన్నారు. ముహూర్తం సమయానికి పెళ్లి వరుడు కన్పించడం లేదని చెప్పడంతో వధువు తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ముందురోజు రాత్రే (బుధవారం) తనకు కట్నం రూపంలో ఇస్తున్న 10 తులాలు స్వచ్ఛమైన బంగారం (కేడీఎం) కాదంటూ తమతో గొడవకు దిగారని, పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగిందని వధువు తరపు బంధువులు పేర్కొన్నారు. పెళ్లి ఏర్పాట్లతో పాటు పెళ్లి భోజనాల కోసం సుమారు రూ.లక్ష దాకా ఖర్చు అయిందని, బంగార ం కోసమే రూ.3లక్షలు దాకా ఖర్చు చేశామని, తీరా పెళ్లి సమయానికి వరుడు పరారై తమను అవమానం పాలు చేశారని వధువు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బీడీ బంక్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడని, పెళ్లి కొడుకు మంచోడని కొందరు చెప్పడంతో ఈ సంబంధం కుదుర్చుకున్నామని, పెళ్లి కొడుకు ఇంత మోసగాడని ఇప్పుడే తెలుస్తోందని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ ఎదుట పోలీస్ స్టేషన్లో వాపోయారు. కట్నం ఇంకా రూ.50 వేలు ఎక్కువ ఇస్తామని వేరే వాళ్లు చెప్పడంతో పెళ్లి కొడుకు పరారై ఆ సంబంధం చేసుకోవడానికి సిద్ధమైనట్లు తమకు తెలిసిందని వారు ఆరోపించారు. పెళ్లి కుమార్తెకు మద్దతుగా నిజాంవలి కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకొని బాధిత యువతికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ప్రాణాలు తీసిన అనుమానం
వేర్వేరు చోట్ల ఇద్దరు వివాహితలు దారుణ హత్యకు గురయ్యారు. రెండు చోట్లా కర్రలతో బాది అంతమొందించారు. రెండింటి హత్యల వెనుక ఒకటే కారణం కనిపిస్తోంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారనే అనుమానంతోనే వారిని కడతేర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు ఘటనలతో చుట్టుపక్క ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతపురం, కళ్యాణదుర్గం: బోరంపల్లిలో ఘోరం జరిగింది. వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే ఆమెను హత్య చేసి ఉంటారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బెళుగుప్ప మండలం అంకంపల్లికి చెందిన రామాంజినమ్మ కుమార్తె విమలకు కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన వెంకటేశులుతో 2009లో వివాహం చేశారు. వీరికి కుమారుడు పూర్ణ, కుమార్తె రీనా ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 1.00 గంట సమయంలో విమల సోదరుడు నరసింహులుకు వెంకటేశులు ఫోన్ చేసి ‘మీ అక్క పురుగుల మందు తాగింది రండి’ అంటూ సమాచారం ఇచ్చాడు. ఈ సమయంలో విమల జోక్యం చేసుకుని అదేమీ లేదంటూ ఫోన్లో సమాధానం ఇచ్చింది. తిరిగి 1.50గంటలకు విమల సోదరుడు నరసింహులు తల్లి రామాంజినమ్మ వద్దకు వెళ్లి ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆటోలో పుట్టింటికి రమ్మని చెప్పాడు. అదేమీ లేదని విమల స్పష్టం చేసింది. తిరిగి మధ్యాహ్నం 2.24 గంటలకు మరోసారి వెంకటేశులు ఫోన్‌చేసి విమల మందు తాగిందని, తాను నిజమే చెబుతున్నానని పుట్టింటి వారికి చెప్పాడు. అనుమానంతో వారు హుటాహుటిన బోరంపల్లికి బయలుదేరి వచ్చారు. అప్పటికే విమల రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. రోకలి బండతో మోది హతమార్చినట్లు గుర్తించి బోరున విలపిస్తూ బయటకు వచ్చారు. ఘటన అనంతరం భర్త వెంకటేశులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. హత్య సంఘటనపై కుటుంబ సభ్యులు గ్రామంలోని రహదారిపై కొద్ది సేపు ఆందోళన చేపట్టారు. రూరల్ ఎస్ఐ నబీరసూల్ సర్దిచెప్పి వారిని శాంతింపచేశారు. ఇదిలా ఉండగా భార్య విమల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్తే హతమార్చి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మృతురాలి సోదరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. శింగవరంలో మరొకరు.. యల్లనూరు: శింగవరంలో కమ్మర భారతి (36) మంగళవారం అర్ధరాత్రి దారుణహత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్లితే... రెండవ భార్య అయిన భారతి వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో భర్త ఆశ్వర్థ ఆచారి, ఆయన మొదటి భార్య కుమారులు ప్రకాశం ఆచారి, మనోహర ఆచారిలు పథకం ప్రకారం నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై కర్రలతో మోది హత్య చేశారు. రక్తపు మరకలను తుడిచేసిన బట్టను కాల్చివేసేశారు. హతురాలి అక్క లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు భారతి భర్త, ఆయన మొదటి భార్య కుమారులు ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హారున్‌బాషా తెలిపారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
మిస్టరీ విప్పిన పెట్రోల్ క్యాన్
అనంతపురం, పామిడి: ‘ఎంత తెలివిగా హత్య చేసినా హంతకులు ఏదోక క్లూ వదిలేపోతారు’, ‘తీగ లాగితే డొంక కదులుతుంది’ మిస్టరీగా మారిన కేసులను ఛేదించే పోలీసులు వీటిని దృష్టిలో ఉంచుకునే దర్యాప్తు ప్రారంభిస్తారు. పెద్దవడుగూరు మండలం వీరెపల్లి శివార్లలో గత నెల 21న గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు కూడా ఈ విధంగానే ఛేదించబడింది. హంతకులు తాము ఉపయోగించిన పెట్రోల్ క్యాన్‌ను వదిలేసిపోవడం, దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కేసును ఛేదించడం నెల తిరక్కముందే జరిగిపోయాయి. మృతుడు కర్నూలు జిల్లా ఆదోనిలోని రాజీవ్ కాలనీకి చెందిన బోయ ప్రదీప్(18) అని గుర్తించారు. నిందితులు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం స్థానిక రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్పీ చౌడేశ్వరి వెల్లడించారు. బోయ ప్రదీప్ తల్లి రోజా పదేళ్ల క్రితం భర్త పరంజ్యోతితో విడిపోయింది. డోన్ పట్టణానికి చెందిన నాగమద్దిలేటిని 2010 సంవత్సరంలో రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు విజయ్(12), ప్రదీప్(9). ఈ పెళ్లతో తలెత్తిన గొడవల కారణంగా నాగమద్దిలేటి, రోజా విజయ్ను, ప్రదీప్‌ను తీసుకుని ఆదోనికి వచ్చి కాపురం పెట్టారు. చిన్న కుమారుడు ప్రదీప్ 10 వతరగతి వరకూ చదివి జల్సాలకు, తాగుడుకు బానిసయ్యాడు. బుల్లెట్ బైకు కావాలంటూ తల్లి రోజాతో నిత్యం గొడవ పడేవాడు. నువ్వంటే అసహ్యమంటూ ఈసడించుకునేవాడు. దీనికితోడు వరుసకు అత్తయిన నాగమద్దిలేటి సొంత చెల్లెలితో ప్రేమాయణం సాగించాడు. ఆమెను విజయవాడ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని గత నెల 19న ఇంటికి వెళ్లాడు. నాగమద్దిలేటికి ఆయన చిన్న చెల్లెలు ఈ విషయాన్ని తెలిపింది. అప్పటికే నాగమద్దిలేటి తన స్నేహితుడు గౌస్‌ఖాన్ ఇంట్లో మరో స్నేహితుడు సంపత్‌కుమార్‌తో కలిసి మద్యం సేవిస్తున్నాడు. స్నేహితులు ముగ్గురూ కలిసి ఎలాగైనా ప్రదీప్‌ను అంతమొందించాలనుకున్నారు. ప్రదీప్‌ను కొట్టి బలవంతంగా వారి బైకులో డోన్‌వైపు తీసుకెళ్లారు. డోన్‌కు కొద్దిదూరంలో గుత్తిరోడ్డు వైపు కంపచెట్లలోకి తీసుకెళ్లి రెండు చేతులూ వెనక్కు కట్టేసి బెల్టుతో గొంతు బిగించి చంపేశారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లా వైపు తీసుకెళ్లి పెట్రోలు పోసి కాల్చి ఆనవాలు లేకుండా చేయాలనుకున్నారు. ఇంటి సామాన్లు మార్చాలని చెప్పి కర్నూలుకు చెందిన మధు బొలెరో వాహనాన్ని అద్దెకు పిలిపించుకున్నారు. సామాన్లు లోడ్ చేసేసరికి కాసేపు నిద్రపో అని డ్రైవర్‌గా వచ్చిన వెంకటేష్‌కు చెప్పారు. అతను నిద్రపోగానే వారు ఆ వాహనాన్ని తీసుకుని వెళ్లారు. డోన్ వెలుపల తారకరామనగర్‌లోని రాజు పెట్రోలు బంకుకు వద్దకెళ్లి రూ.800లకు పెట్రోలును క్యాన్‌లో తీసుకుని, ప్రదీప్ మృతదేహాన్ని తీసుకుని వీరెపల్లికి తెచ్చారు. ఆ గ్రామ సమీపంలో ప్రదీప్ మృతదేహంపై పెట్రోలు పోసి అంటించారు. అయితే పెట్రోల్ క్యాన్ అక్కడే వదిలేశారు. తిరుగు ప్రయాణంలో గుత్తి బాటలో సుంకులమ్మ గుడికి వెళ్లారు. వాళ్లు వదిలేసిన పెట్రోలు క్యాన్ ఆధారంగా ఏఎస్పీ చౌడశ్వరి ఆధ్వర్యంలో, పామిడి రూరల్ సీఐ రాము సారథ్యంలో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారు పెట్రోలు బంకు, సుంకులమ్మ గుడిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. రెండుచోట్లా కనిపించింది వారే కావడంతో బొలెరో వాహనం నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో రోజా సైతం మృతి చెందింది తన కుమారుడు ప్రదీపేనని గుర్తించిం ది. ఈ నేపథ్యంలో నిందితులు స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకు లొంగిపోయారు. రివార్డుకు సిఫారసు చేశాం : ఏఎస్పీ ఎటువంటి ఆధారాలు లేకపోయినా మిస్టరీగా మారిన కేసును అనతికాలంలో ఛేదించడంలో సీఐ రాముతోపాటు ఎస్ఐ రమేష్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మాణిక్యం, రాజ్‌కుమార్, కానిస్టేబుళ్లు బాలకృష్ణ, చంద్ర, రవి, శ్రీనాథ్, వివేక్ చేసిన కృషిని ఆమె అభినందించారు. వారికి రివార్డు కోసం ప్రతిపాదించామన్నారు. -
బాలిక అనుమానాస్పద మృతి
అనంతపురం, లేపాక్షి: శిరివరం గ్రామానికి చెందిన మోనిష (16) బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక తండ్రి కుమార్ తెలిపిన మేరకు... కర్ణాటకలోని హోసూరు ప్రాంతం జూజూవాడకు చెందిన కుమార్‌కు లేపాక్షి మండలం శిరివరం గ్రామానికి చెందిన రాధతో వివాహమైంది. 2003లో భర్తతో గొడవపడి రాధ తన పుట్టినిల్లు అయిన శిరివరం గ్రామానికి వచ్చేసింది. కుమార్తె మోనిష తండ్రి వద్ద ఉంటూ అత్తిబేలే వద్దవున్న శ్రీవెంకటేశ్వర స్కూలులో చదువుతోంది. 2017 జూన్‌లో పాఠశాలకు వెళ్లిన మోనిష కనిపించకుండా పోయింది. తండ్రి హోసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అమ్మాయి శిరివరంలోని తన తల్లి వద్ద ఉంటోందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో కుమార్ లేపాక్షి పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ చేసి.. కుమార్తెను తల్లి వద్దే వదిలి వెళ్లిపోయాడు. ప్రస్తుతం మోనిష గౌరిబిదనూరులోని పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి 2.45 గంటలకు కుమార్తె చనిపోయిందని సమాచారం అందడంతో కుమార్ హుటాహుటిన శిరివరం చేరుకున్నాడు. పాఠశాల నుంచి ఆలస్యంగా వస్తోందని మందలించినందుకు మనస్తాపం చెంది సంపులో పడి ఆత్మహత్య చేసుకుందని తల్లి చెబుతోంది. కుమార్తె మృతిపై అనుమానం ఉండటంతో భార్య రాధ, బంధువులు లలిత, వెంకటేష్, క్రిష్టప్పలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేశారు. -
పెళ్లైన నెలకే భర్త అదృశ్యం
అనంతపురం, పుట్టపర్తి అర్బన్: పెళ్లైన నెల రోజులకే భర్త అదృశ్యమయ్యాడు. తన భర్త ఆంజనేయులు ఆచూకీ తెలపాలని వెంకటగారిపల్లికి చెందిన గంగమ్మ బుధవారం పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధనుంజయ పేర్కొన్నారు. నవంబర్ రెండో తేదీన ఓడీసీ మండలం సున్నంపల్లి పంచాయతీ పెద్దగుట్లపల్లికి చెందిన గంగులప్ప వెంకటలక్ష్మమ్మ కుమారుడు ఆంజనేయులుతో గంగమ్మకు వివాహమైంది. నూతన దంపతులు గంగమ్మ చెల్లెలు రమణమ్మ గ్రామమైన గోరంట్ల మండలం బుగ్గపల్లికి నవంబర్ 22న వెళ్లారు. పది రోజులు అక్కడే సంతోషంగా గడిపారు. డిసెంబర్ మూడో తేదీ సాయంత్రం ఐదు గంటలకు బుగ్గపల్లి నుంచి వెళ్లిన ఆంజనేయులు తిరిగి రాలేదు. మొబైల్ ఫోన్ కూడా పని చేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. బంధువుల ఇళ్లు, స్నేహితుల ఇళ్లు పలు గ్రామాల్లో వెదికినా ఎక్కడా జాడ కనిపించలేదు. తన భర్త ఆచూకీ తెలపాలని గంగమ్మ పోలీసులను కోరారు. ఆచూకీ తెలిసిన వారు 95352 38979, 83099 75202 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
నకిలీ ప్లాటినం గుండ్ల విక్రయ ముఠా అరెస్ట్
అనంతపురం , హిందూపురం అర్బన్: ప్లాటినం గుండ్లని సీసం గుండ్లను విక్రయించాలని చూసిన ఏడుగురు సభ్యుల ముఠాను హిందూపురం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ చిన్నగోవిందు ఆదివారం మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన ముఠాలో అనంతపురానికి చెందిన పార్వతమ్మ, సేవామందిర్ నాగభూషణరెడ్డి, హిందూపురం ఆర్టీసీ కాలనీ ఆర్.కె.శ్రీనివాసులు, కర్ణాటక రాష్ట్రం తుమకూరు డి.హెచ్.నాగరాజు, బెంగళూరుకు చెందిన శ్రీనివాసులు, గురుమూర్తి, పావగడ ప్రకాష్ ఉన్నారు. వీరు తమవద్ద ఉన్న ప్లాటినం గుండ్లు రూ.కోట్లు విలువ చేస్తాయని, మీకు కావాలంటే రూ.15లక్షలకు ఇస్తామని రామగిరికి చెందిన వీరేంద్రతో బేరం కుదుర్చుకుని, కొంత అడ్వాన్స్ తీసుకున్నారు. శనివారం రాత్రి గుడ్డం ఆలయం సమీపంలో పాట్లినం గుండ్లు ఇవ్వడానికి ముఠా సభ్యులందరూ చేరుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్ఐ మక్బుల్‌బాషా సిబ్బందితో దాడిచేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి ప్లాటినం గుండ్లుగా చెబుతున్న 1.7 కిలోల సీసం గుండ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు ప్లాటినం పేరు చెప్పి భారీగా డబ్బు దండుకోవాలని చూసినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు. -
చిన్నారి కిడ్నాప్ యత్నం విఫలం
అనంతపురం, పామిడి : చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళ పోలీసులకు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన వివరాలను పామిడి సీఐ కె.శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన హనుమక్క ఓ రెండేళ్ల చిన్నారిని అపహరించింది. మంగళవారం రాత్రి పామిడిలోని 44వ నంబర్ జాతీయరహదారిపై హనుమాన్ లింకురోడ్డు సర్కిల్ వద్ద తనిఖీలు చేస్తున్న సీఐ.. చిన్నారితో అనుమానాస్పదంగా కనిపించిన హనుమక్కను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాను డోన్ మండలం ధర్మవరంలో దిగాల్సిందని, పొరపాటున అనంతపురం వైపు వచ్చానని, తిరిగి డోన్‌కు బయలుదేరుతున్నానని తెలిపింది. పాప ఎవరని అడిగితే బిత్తరపోయింది. పాప తల్లిదండ్రులు పండ్ల వ్యాపారులని, వారు తనకు బాగా తెలుసని, వారే తనకు పాపను అప్పగించారని, అయితే వారి పేరు, ఊరు తెలియదని పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె పాపను కిడ్నాప్ చేసేందుకు యత్నించిందని స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. -
ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం
అనంతపురం, ఆత్మకూరు: ఆస్తి కోసం కన్నతండ్రిపైనే హత్యాయత్నం చేసిన కుమారులు, కూతురి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమ పేరిట ఆస్తి రాసివ్వాలని కుర్లపల్లికి చెందిన నారాయణస్వామిని కుమారులు జోగి రాజు, జోగి బాలచంద్ర, కుమార్తె మేనక శనివారం అడిగారు. ఆస్తి పంచడానికి నిరాకరించిన నారాయణస్వామికి కళ్లల్లోకి కారం కొట్టి, గొడ్డలిని తిప్పేసి తలపై కొట్టి హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామి స్థానికుల సహాయంతో అదే రోజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి అనంతపురంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీరికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం, తాడిమర్రి: పెద్దకోట్ల లో ఓ మహిళ విష ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తలారి మండల శంకర్‌కు యల్లనూరుకు చెందిన పద్మావతి(28)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారులు కృష్ణఅవినాష్, అభినయ్ ఉన్నారు. శంకర్ గ్రామం సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో చేపల వేటతో జీవనం సాగించేవాడు. పద్మావతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈక్రమంలో నొప్పితాళలేక గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావకం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లిదండ్రుల ఆంజనేయులు, లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
పెద్దవడుగూరు: వీరేపల్లి సమీపాన మంగళవారం ఉదయం ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతదేహం తగులబడి పోతుండటాన్ని అటుగా వచ్చిన గ్రామస్తులు గమనించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి దావానలంలా వ్యాపించింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచారం అందుకున్న పామిడి సీఐ శ్రీనివాసులు, పెద్దవడుగూరు ఎస్ఐ రమేష్‌రెడ్డిలు చేరుకుని సంఘటన జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దగ్గరే గులాబీ రంగులో ఉన్న ఒక దుప్పటి పడి ఉండటాన్ని పరిశీలించారు. ఎక్కడో యువకుడి చేతులు వెనుకకు కట్టేసి చంపి.. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పెట్రోలు పోసి నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల పేరుతో మోసం
అనంతపురం, తాడిపత్రి అర్బన్: పలువురి నుంచి చిట్టీలు కట్టించుకున్న సొమ్ముతో నిర్వాహకుడు ఉడాయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటిలోని సామాన్లను తీసుకెళ్లేందుకు వచ్చిన నిర్వాహకుడి భార్యను బాధితులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. బాధితులు తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన రాజగోపాల్‌రెడ్డి దాదాపు పద్దెనిమిదేళ్ల నుంచి లగాన్ వ్యాపారం చేస్తున్నాడు. చిరువ్యాపారులు, ఆటో, కారు డ్రైవర్ల వద్ద చిట్టీల పేరుతో దాదాపు రూ.2 కోట్ల వరకు సేకరించాడ. చిట్టీల కంతులు పూర్తయిన వారికి డబ్బు ఇవ్వకుండా తిప్పుకున్నాడు. నాలుగు నెలల కిందట కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. బాధితులు వాకబు చేయగా నెలన్నర కిందట తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి తాడిపత్రికి తీసుకొచ్చారు. ఒకరోజంతా బంధించి తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రాజగోపాల్‌రెడ్డి వారి కళ్లుగప్పి ఎలాగోలా తప్పించుకుని పారిపోయాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తాడిపత్రిలో ఉన్న తన ఇంటికి రాజగోపాల్ భార్య శ్రీదేవి వచ్చి సామాన్లు తరలిస్తున్న విషయం తెలుసుకున్న బాధితులు అక్కడకు చేరుకుని ఆమెను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. బాధితులు ఫిర్యాదు ఇస్తే తాము విచారణ చేపడతామని సీఐ నారాయణరెడ్డి బాధితులకు సూచించారు. శ్రీదేవిని కూడా ఇల్లు విడిచి వెళ్ళవద్దని, భర్త వస్తే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు. ఆదివారం కూడా బాధితులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే చిట్టీల నిర్వాహకుడిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు. -
తల్లిపై నిందలకు మనస్తాపం.. కుటుంబం ఆత్మహత్య
అనంతపురం, బత్తలపల్లి : ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కుమారుడి బలవన్మరణంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు కూతురుతో కలిసి పురుగుమందు తాగి అర్ధంతరంగా తనువుచాలించాలనుకున్నారు. వీరిలో తండ్రీ కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బత్తలపల్లి మండలం జలాలపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, శిరీష దంపతులు. వీరికి కుమారుడు ఉమేష్‌చంద్ర (11), కూతురు కీర్తన ఉన్నారు. శ్రీనివాసులు వెలుగులో పని చేస్తూ శిక్షణ ఇచ్చేందు కోసం ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తుంటాడు. శిరీష ఆశా వర్కర్. కుమారుడు బత్తలపల్లిలోని ప్రయివేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కుమార్తె కీర్తన తనకల్లు రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. తల్లిపై నిందలకు మనస్తాపం.. ఆశావర్కర్ విధుల్లో భాగంగా శిరీష ఇంటింటికీ తిరుగుతుండటం వల్ల స్థానికులు మాట్లాడే మాటలకు కుమారుడు ఉమేష్‌చంద్ర మనస్తాపం చెందాడు. సోమవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉమేష్‌చంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న శ్రీనివాసులు వెంటనే మధ్యప్రదేశ్ నుంచి స్వగ్రామానికి చేరుకుని కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేశాడు. కుమారుడి లేని జీవితం వద్దని.. గురువారం రాత్రి ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో శ్రీనివాసులు, శిరీష దంపతులతో పాటు కుమార్తె కీర్తన పురుగుమందు తాగారు. అంతకు ముందే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని శ్రీనివాసులు వెలుగు కార్యాలయం అధికారికి వాట్సప్ ద్వారా మెసేజ్ పంపాడు. వెంటనే ఆయన బత్తలపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఎస్ఐ గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ముగ్గురినీ ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శిరీషను అనంతపురం ఆస్పత్రికి పంపారు. శ్రీనివాసులు, కీర్తనల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ లేఖ ఏమైంది..? ఆత్మహత్యాయత్నానికి కారుకైలన వారి పేర్లను సూచిస్తూ శ్రీనివాసులు లేఖ రాసినట్లు బంధువులు తెలిపారు. అయితే ఆ లేఖ ఎవరి వద్ద ఉందనేది తెలియడం లేదు. పోలీసులు కూడా ఇంతవరకూ ఆ లేఖను స్వాధీనం చేసుకోలేదు. ఆ లేఖ దొరికితే ఎవరెవరి పేర్లు ఉన్నాయి.. ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనేది తెలిసే అవకాశం ఉంది. -
పిల్లలను బావిలోకి తోసి.. వివాహిత ఆత్మహత్య
అనంతపురం, గుడిబండ: హిరేతుర్పి సమీపంలో ఓ మహిళ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలను సమీపంలోని బావిలోకి తోసినట్లు అనుమానం రావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ శరత్చంద్ర వివరాల మేరకు..కర్ణాటక రాష్ట్రం కోట గ్రామానికి చెందిన లక్ష్మీ(26)కి పదేళ్ల క్రితం అదే రాష్ట్రం మధుగిరి తాలూకా శిడదరగల్లు గ్రామానికి చెందిన యశ్వంత్‌తో వివాహం జరిగింది. వీరికి వంశీ, చందు అనే ఇద్దరు కుమారులున్నారు. రెండు రోజుల కిందట లక్ష్మీ పుట్టింటికి వెళతానని భర్తతో చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గురువారం ఉదయం పొలం పనుల నిమిత్తం వెళ్లిన రైతులకు చెట్టుకు వేలాడుతున్న మహిళ మృతదేహం కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిరేతుర్పిలో పూజారి పని చేసున్న అనిల్‌కుమార్ మృతదేహాన్ని తన సోదరి లక్ష్మీదిగా గుర్తించారు. ఘటన స్థలానికి సమీపంలో ఉన్న బావి గట్టున చిన్నారుల చెప్పులు ఉండడంతో వారిని ఆమె బావిలోకి తోసేసినట్లు అనుమానించి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపేశారు. సీఐ దేవేంద్రకుమార్ సంఘట నాస్థలాన్ని పరిశీలించారు. -
మూగబోయిన తిమ్మాపురం
తిమ్మాపురం గొంతు మూగబోయింది. మిద్దె పైకప్పు కూలి భార్యా పిల్లలు మృతి చెందడం, యజమాని తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలవడం అందరినీ కలచివేస్తోంది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితం ఇలా అర్ధంతరంగా ముగియడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అనంతపురం, కంబదూరు: కంబదూరు మండలం తిమ్మాపురానికి చెందిన వడ్డే సుబ్బరాయుడు, తిమ్మక్క (30) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు రవి (11) ఆరో తరగతి, కుమార్తె మహాలక్ష్మి (8) నాలుగో తరగతి చదువుతున్నారు. దంపతులు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకునేవారు. అలా సాఫీగా సాగిపోతున్న సమయంలో మూడు నెలల కిందట ఇంట్లోకి కాకి దూరింది. ఇంటికి అరిష్టం జరిగిందని, ఇక్కడే ఉంటూ తమకూ ఏదో ఒకటి జరుగుతుందనే మూఢనమ్మకంతో సుబ్బరాయుడు కుటుంబం సొంతింటిని వదిలి గ్రామంలోని పాత మిద్దెలో అద్దెకు వెళ్లారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ పాత మిద్దెలో నిద్రిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో మిద్దె దూలం విరిగా పడటంతో తిమ్మక్కతో పాటు కుమారుడు రవి, కుమార్తె మహాలక్ష్మి దుర్మరణం చెందారు. సుబ్బరాయుడు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. రెండు రోజుల్లో సొంతింటికి రంగు వేయించి వెళ్లాలనుకున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరిగింది. బుధవారం ఉదయం కళ్యాణదుర్గం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. విషాదఛాయలు మిద్దె కూలి ఒకే ఇంటిలో ముగ్గురు మృతి చెందడంలో తిమ్మాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండడంతో బంధువులు, గ్రామస్తులందరూ ‘అయ్యోపాపం.. అప్పుడే నూరేళ్లు నిండాయా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇల్లు మారకుండా ఉండి ఉంటే ప్రాణాలైనా దక్కేవని, మూఢనమ్మకాలు పట్టించుకోకుండా ఇల్లు శుభ్రం చేసుకుని ఉండి ఉంటే బాగుండేదని చర్చించుకున్నారు. ఎమ్మెల్యేపై స్థానికుల ఆగ్రహం మిద్దె కూలి ముగ్గురు మృతి చెందితే ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి చూసేందుకు కూడా రాకపోతే ఎలా అంటూ స్థానికులు ఆగ్రహించారు. తహసీల్దార్ మసూద్‌వలి ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకోవడంపై కూడా స్థానికులు మండిపడ్డారు. మూఢ నమ్మకాలతోనే ఇల్లు మార్చాడు కాకి దూరిన ఇంటిలో ఉండటం మంచిది కాదనే మూఢనమ్మకాలతోనే సుబ్బరాయుడు కుటుంబం సొంత ఇంటిని వదలి ఆద్దె ఇంటిలోకి కాపురాన్ని మార్చాడు. గతంలో కూడా గ్రామంలో కొంత మంది ఇళ్లలోకి కాకులు ప్రవేశించాయని, మూడు నెలల పాటు వేరే ఇళ్లలోకి కాపురాలు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటివి పూర్వం నుంచి కొనసాగుతున్నాయి.–హరినాథ్, మాజీ సర్పంచ్ ఉద్విఘ్న క్షణాలు మిద్దె పైకప్పు కూలిన సమయంలో తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకున్న సుబ్బరాయుడును అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం కాస్త స్పృహలోకి వచ్చాక రాత్రి జరిగిన ప్రమాదం గుర్తొచ్చింది. భార్యా పిల్లలు ఏమయ్యారో తెలుసుకోవాలనుకున్నాడు. తన వద్ద ఉన్న బంధువులను ఆతృతగా అడిగాడు. వారు బాగున్నారని.. నీవు టెన్షన్ పడవద్దని ధైర్యం చెప్పారు. అయినప్పటికీ అతని ధ్యాస కుటుంబ సభ్యులపైనే ఉంది. వారిని చూస్తే కానీ నమ్మే పరిస్థితి లేకపోవడంతో బంధువులపై ఒత్తిడి తెచ్చాడు. అయితే వారు అతడి ఆరోగ్యం దృష్ట్యా అసలు విషయం చెప్పలేదు. ప్రమాదంలో మృతి చెందిన భార్యా, కుమారుడు, కుమార్తెల అంత్యక్రియలకు సాయంత్రం స్వగ్రామంలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సుబ్బరాయుడును ఆస్పత్రి నుంచి వాహనంలో తిమ్మాపురం తీసుకొచ్చారు. అప్పటికే జనం అంతా గుమికూడి ఉండటంతో ఏదో జరిగిందని భావించాడు. ఇక చివరికి భార్యా,పిల్లలు చనిపోయిన విషయాన్ని తెలిపారు. అంతే ఒక్కసారిగా సుబ్బరాయుడు భావోద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా రోదిస్తుండటంతో కడసారి చూపు చూపించిన అనంతరం అతడిని తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
మూడేళ్లకే నూరేళ్లు!
నిండు నూరేళ్ల ఆయుష్షు.. మూడేళ్లకే ముగిసింది!చిన్న కుటుంబం..చింతల్లేని దాంపత్యం..రెక్కల కష్టమే వారి జీవనం ఒక్కగానొక్క మూడేళ్ల ముద్దుల ‘తేజం’ఆ ఇంట అడుగులో అడుగేస్తూ.. బుడిబుడి నడకలేస్తూ..పడుతూ లేస్తూ...కళ్లముందు తిరుగుతుంటే..తప్పటడుగులు పడతాయేమోనని తల్లిదండ్రుల తాపత్రయంవడివడిగా తనయుడిని అనుసరిస్తూ ఊతమయ్యేవారు!‘అమ్మ’ చేతి వేలు పట్టుకొని..అడుగులో అడుగేస్తుంటే.. మా ముద్దుల చిన్ని కృష్ణయ్య అంటూ మురిసిపోయారు!ఎప్పటిలాగే తీపి బిళ్లలేమో అనుకొని నోట్లో విషపుగుళికలు వేసుకున్నాడు.. అంతే...కొద్దిసేపటికి కళ్లు తేలేశాడు దీపావళి పండుగ నాడు కొడుకుచేయి పట్టుకొనికాకర పువ్వులు వెలుగులు నిండాల్సిన ఆ ఇంట..చీకట్లు కమ్ముకుని..కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.. అనంతపురం , ఉరవకొండ/ బొమ్మనహాల్ : పిప్పర్మింట్ బిల్ల అనుకుని టిమెట్ గుళికలను మింగిన చిన్నారి కొద్దిసేపటికే ప్రాణం కోల్పోయాడు. దీపావళి పండుగ వేళ ఆ ఇంట విషాదం నెలకొంది. బొమ్మనహాళ్ మండలం తారకాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తారకాపురం గ్రామానికి చెందిన చిరంజీవి, గీత దంపతులకు తేజ(3) ఒక్కగానొక్క కుమారుడు. చిరంజీవి దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. మంగళవారం ఎప్పటిలాగే ఇంట్లో తమ కుమారుడిని అవ్వ వద్ద పెట్టి పనులకు పోయారు. ఇంట్లో ఆడుకుంటున్న తేజ చేతికందే ఎత్తులో ఉంచిన టిమెట్ (విషపు) గుళికలు ఉండటం గమనించాడు. తాను రోజూ తినే పిప్పరమెంట్ అనుకుని చేతికి తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. కొద్ది సేపటికే అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్న తేజను కొద్దిసేపటి తర్వాత అమ్మమ్మ గుర్తించి కేకలు పెట్టింది. ఇరుగుపొరుగు వారు వచ్చి వెంటనే తేజను ఉరవకొండ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో తారకాపురం శోకసంద్రంలో మునిగిపోయింది. -
రాయదుర్గంలో ఈవ్‌టీజింగ్
అనంతపురం, రాయదుర్గంటౌన్ : రాయదుర్గంలో ఈవ్‌టీజింగ్ అధికమవుతోంది. వారం వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా సోమ వారం పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల గుమ్మఘట్ట మండలం వీరాపురం గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన విద్యార్థిని ఉదయం పాఠశాలకు వస్తున్న సమయంలో ఆ యువకుడు వెంటపడి వేధించసాగాడు. పాఠశాల సమీపంలో రద్దీ ప్రాంతంలోనే కోపంతో విద్యార్థిని చెంపపై కొట్టాడు. దీంతో విద్యార్థిని భయాందోళనకు గురై పాఠశాలకు పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గత నెల రోజుల నుంచి తనను వేధిస్తున్నట్లు విద్యార్థిని ఉపాధ్యాయులతో పేర్కొనట్లు సమాచారం. ఈ ఘటనతో పాఠశాల, కళాశాల విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలావుండగా ఇలాంటి ఘటనే వారంరోజుల క్రితం ఇదే పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న మరో అమ్మాయిని ప్రేమించకపోతే చేయి చేసుకుంటానని ఓ యువకుడు వేధించినట్లు ఆలస్యంగా తెలిసింది. రద్దీ ప్రాంతమైన జెడ్పీ బాలికోన్నత పాఠశాలలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తరచూ ఈవ్‌టీజింగ్ సమస్య ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం ఇటీవల మహిళా రక్షణ టీమ్‌లు ఏర్పాటు చేశాం. ఈ టీములు గ్రామాలు కూడా తిరుగుతుండడంతో వల్ల పట్టణంలో కాస్త పర్యవేక్షణ తగ్గింది. ఉన్నతాధికారులతో చర్చించి మహిళా రక్షణ టీమ్‌ను పట్టణంలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటాం. కళాశాల, పాఠశాల రాకపోకల వేళల్లో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ కూడా ఉంచి ఈవ్‌టీజింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం పాఠశాల వద్ద జరిగిన ఘటనపై యువకుడి బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాం. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తాం. – నాగేంద్రప్రసాద్, ఎస్ఐ