
నరసింహమూర్తి (ఫైల్)
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నరసింహమూర్తి (51) గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఈయన జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పనిచేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసుబృందం దాడులు నిర్వహించింది. పేకాటరాయుళ్లను పట్టుకునేందుకు పరుగెత్తే సమయంలో నరసింహమూర్తి గుండెపోటుకు గురయ్యాడు. కళ్యాణదుర్గంలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం సవేరా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు అక్కడ ఆయన ప్రాణాలు వదిలారు. కానిస్టేబుల్ నరసింహమూర్తి మృతి చెందడంతో తోటి సిబ్బంది దిగ్బ్రాంతికి లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment