
సాక్షి, పెద్దపప్పూరు(అనంతపురం): లిఫ్ట్ అడిగిన మహిళను బైక్‌పై ఎక్కించుకున్న వ్యక్తి ఆమెను గమ్యస్థానం చేర్చకుండా మరోచోటుకు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. తబ్జుల గ్రామానికి చెందిన ఓ మహిళ కృష్ణాష్టమి సందర్భంగా శింగనగుట్టపల్లిలో ఆలయానికి వెళ్లింది. దర్శన అనంతరం ఇంటికి తిరిగి వస్తోంది. తమ గ్రామానికే చెందిన చాకలి శ్రీరంగ బైక్‌పై వస్తుండటంతో ఆమె లిఫ్ట్ అడిగింది.
సరేనని బైక్‌లో ఎక్కించుకున్న శ్రీరంగ.. గ్రామ సమీపంలో ఆపాలని ఆమె కోరినా ఆపకుండా మరోచోటుకు తీసుకెళ్లి ఆపాడు. ఒక్కసారిగా ఆమెపై లైంగికదాడికి యత్నించబోయాడు. ఆమె అతడి నుంచి తప్పించుకుని పరుగుపరుగున ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు, బంధువులకు విషయం చెప్పింది. శనివారం పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెళ్తున్న ఆమెను శ్రీరంగ బెదిరించాడు. తనకూ పోలీసులు తెలుసని, ఫిర్యాదు చేయకుండా వెనక్కు వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో ఆమె వెనక్కు వెళ్లిపోయింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి ఎస్‌ఐ మహమ్మద్ గౌస్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీరంగపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment