pedda pappur
-
తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్ అడిగితే..
సాక్షి, పెద్దపప్పూరు(అనంతపురం): లిఫ్ట్ అడిగిన మహిళను బైక్‌పై ఎక్కించుకున్న వ్యక్తి ఆమెను గమ్యస్థానం చేర్చకుండా మరోచోటుకు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. తబ్జుల గ్రామానికి చెందిన ఓ మహిళ కృష్ణాష్టమి సందర్భంగా శింగనగుట్టపల్లిలో ఆలయానికి వెళ్లింది. దర్శన అనంతరం ఇంటికి తిరిగి వస్తోంది. తమ గ్రామానికే చెందిన చాకలి శ్రీరంగ బైక్‌పై వస్తుండటంతో ఆమె లిఫ్ట్ అడిగింది. సరేనని బైక్‌లో ఎక్కించుకున్న శ్రీరంగ.. గ్రామ సమీపంలో ఆపాలని ఆమె కోరినా ఆపకుండా మరోచోటుకు తీసుకెళ్లి ఆపాడు. ఒక్కసారిగా ఆమెపై లైంగికదాడికి యత్నించబోయాడు. ఆమె అతడి నుంచి తప్పించుకుని పరుగుపరుగున ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు, బంధువులకు విషయం చెప్పింది. శనివారం పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెళ్తున్న ఆమెను శ్రీరంగ బెదిరించాడు. తనకూ పోలీసులు తెలుసని, ఫిర్యాదు చేయకుండా వెనక్కు వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో ఆమె వెనక్కు వెళ్లిపోయింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి ఎస్ఐ మహమ్మద్ గౌస్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీరంగపై ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
అశ్వత్థంలో పోటెత్తిన భక్తులు
మాఘ మాసం మూడు ఆదివారాన్ని పురస్కరించుకుని పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థ క్షేత్రం భక్తులతో పోటెత్తింది. దాదాపు లక్షకు పైగా భక్తులు తరలిరావడంతో క్షేత్రం కిటకిటలాడింది. శనివారం రాత్రి నుంచే జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తుల రాక మొదలైంది. ఎడ్లబండిపై వచ్చిన గ్రామీణ ప్రజలు పెన్నానదిలో విడిది చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకే భక్తులు స్నానమాచరించి అశ్వత్థనారాయణస్వామి, భీమలింగేశ్వరస్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. మొక్కుబడి ఉన్న భక్తులు తలనీలాలు సమర్పించారు. పాలుపోంగలి చేసి స్వామివార్లకు నైవేద్యం సమర్పించారు. తిరునాలలో తినుబండరాలు, ఆటవస్తువులు, గాజుల దుకాణాలు వెలిశాయి. ఈ సందర్భంగా చెక్కభజన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. భఎలాంటి ఆవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాడిపత్రి డీఎస్సీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు సురేంద్రనాథ్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, ఎస్ఐలు శ్రీహర్ష, నారాయణరెడ్డి, ప్రదీప్ పర్యవేక్షించారు. వాసవీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. - తాడిపత్రి రూరల్ -
ఘనంగా అశ్వర్థం తిరునాళ్లు
పెద్దపప్పూరు (తాడిపత్రి రూరల్) : జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అశ్వర్థం తిరునాళ్లు రెండో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అశ్వర్థ నారాయణస్వామి, చక్రభీమలింగేశ్వరస్వామివార్లను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తుల రద్దీ తగ్గలేదు.