
మృతి చెందిన మహేంద్ర
ఆంజనేయులు, కొల్లమ్మ దంపతులకు మహేంద్ర ఒక్కగానొక్క సంతానం. ఎంతో గారాబంగా చూసుకుంటూ అనంతపురంలో డిగ్రీ చదివిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఇక మేము ఎవరి కోసం బతకాలి దేవుడా.. ఎంత పని చేశావయ్యా అంటూ రోదించింది.
అనంతపురం , ఆత్మకూరు: ఆత్మకూరు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. ఆత్మకూరుకు చెందిన మహేంద్ర (18), రాజేష్ అనే యువకులు పంపనూరు సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో తిరుగుపయనమయ్యారు. మరికొన్ని నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవాల్సి ఉంది. ఎదురుగా పాల వ్యాను, ఎద్దుల బండి రావడంతో వాటిని ఎక్కడ ఢీకొంటామోనని ద్విచక్రవాహనాన్ని పక్కకు తిప్పడంతో అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులనూ 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేంద్ర మృతి చెందాడు. మరో యువకుడు రాజేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్‌ఐ సాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment