
గాయపడిన బాలిక
సెల్‌ఫోన్ చార్జింగ్ విషయంలో తమ్ముడితో గొడవ
అనంతపురం , బుక్కరాయసముద్రం : తమ్మున్ని గాయపరిచినందుకు తల్లిదండ్రులు తననెక్కడ కొడతారోనన్న భయంతో అక్క ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. పొడరాళ్ల గ్రామంలో బాబాఫకృద్దీన్, సాయినాల దంపతులకు కుమార్తె చాంద్‌బీ (17), కుమారుడు మౌలాలి ఉన్నారు. శుక్రవారం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో అక్కా తమ్ముడు మాత్రమే ఉన్నారు. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టే విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశంలో కత్తెరతో కొట్టడంతో తమ్ముడికి గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వస్తే తనను కొడతరాని భయపడ్డ అక్క చాంద్‌బీ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి బాలికను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శరీరం 60 శాతం మేర కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.