
హత్యకు గురైన గీత (ఇన్‌సెట్) ఆత్మహత్యాయత్నం చేసిన కుమార్
అనంతపురం, కృష్ణరాజపురం : అనుమానంతో భార్యను హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం కోణనకుంటె పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన కుమార్ స్థానికంగా అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ భార్య గీతాతో కలసి అక్కడే నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా భార్య గీత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న కుమార్ ఇదే విషయమై తరచూ గీతతో గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలో మంగళవారం కూడా ఇరువురి మధ్య ఇదే విషయమై గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన కుమార్ కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలానికి చేరుకున్న కోణనకుంటె పోలీసులు కుమార్‌ను విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.