
మృతురాలు లీలావతి
అనంతపురం సెంట్రల్: అనంతపురం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. విద్యారణ్యనగర్‌లో నివాసముం టున్న నాగరాజు సత్యసాయి వాటర్ వర్క్‌విభాగంలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య లీలావతి (32) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌రూంలో చీరతో ఉరివేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడింద ని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. లీలావతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.