
చిన్నారితో పట్టుబడ్డ మహిళ
అనంతపురం, పామిడి : చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళ పోలీసులకు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన వివరాలను పామిడి సీఐ కె.శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన హనుమక్క ఓ రెండేళ్ల చిన్నారిని అపహరించింది. మంగళవారం రాత్రి పామిడిలోని 44వ నంబర్ జాతీయరహదారిపై హనుమాన్ లింకురోడ్డు సర్కిల్ వద్ద తనిఖీలు చేస్తున్న సీఐ.. చిన్నారితో అనుమానాస్పదంగా కనిపించిన హనుమక్కను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాను డోన్ మండలం ధర్మవరంలో దిగాల్సిందని, పొరపాటున అనంతపురం వైపు వచ్చానని, తిరిగి డోన్‌కు బయలుదేరుతున్నానని తెలిపింది. పాప ఎవరని అడిగితే బిత్తరపోయింది. పాప తల్లిదండ్రులు పండ్ల వ్యాపారులని, వారు తనకు బాగా తెలుసని, వారే తనకు పాపను అప్పగించారని, అయితే వారి పేరు, ఊరు తెలియదని పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె పాపను కిడ్నాప్ చేసేందుకు యత్నించిందని స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment