
నుజ్జునుజ్జయిన ద్విచక్రవాహనం
అనంతపురం సెంట్రల్ : నగరంలోని జాతీయ రహదారిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కృష్ణమూర్తి(20) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. జాతీయ రహదారిలో రుద్రంపేట, కళ్యాణదుర్గం రోడ్డు మధ్యలో ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రుద్రంపేటలో నివాసముంటున్న ఆంజనేయులు కుమారుడు కృష్ణమూర్తి మృతిచెందగా అతని స్నేహితుడు మహేష్, ఖాసీలకు తీవ్రగాయాలయ్యాయి. బొలోరో వాహనంను ఓవర్‌టెక్ చేస్తూ వచ్చిన ఖాసీ అనే వ్యక్తి కృష్ణమూర్తి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. రెండు బైకులు వేగంగా ఢీ కొనడంతో ఎగిరిపడ్డాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సవేరా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment