
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కణేకల్లు(అనంతపురం) : ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వివాహితపై టీడీపీ నాయకుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో భయపడి పారిపోయాడు. ఈ ఘటన కణేకల్లు మండలం మాల్యంలో బుధవారం జరిగింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్యంలో ఓ వివాహిత తన భర్తతో కలిసి పుట్టింట్లో నివాసముంటోంది. తల్లి మూడు రోజుల క్రితం బళ్లారిలోని బంధువుల ఇంటికెళ్లింది. భర్త బుధవారం ఉదయం తన పనికోసం బయటికెళ్లాడు.
వివాహిత మాత్రమే ఒంటరిగా ఉంది. సరిగ్గా ఉదయం 9.30 గంటల సమయంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనుచరుడు, టీడీపీ నాయకుడు శరబన్నగౌడ్ ఆ ఇంట్లోకి దూరాడు. ‘ఏమ్మా.. కొత్త ఇల్లు బాగానే కట్టావ్.. ప్రారంభానికి కూడా పిలవలేదే!’ అంటూ మాట కలిపాడు. వయస్సులో పెద్దాయన కావడంతో ఆమె మర్యాదగా మాట్లాడింది. సరే ఇల్లైనా చూడనివ్వు అంటూ ఇంకాస్త లోనికి వచ్చాడు. అమ్మ ఎక్కడ..? కన్పించడం లేదే అని ప్రశ్నించడంతో ‘అమ్మ ఊరికెళ్లిందని’ ఆమె సమాధానం చెప్పింది.
నీ ఫోన్ నంబర్ ఇస్తే అప్పుడప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పడంతో తన వద్ద ఎలాంటి ఫోనూ లేదని తెలిపి గదిలోకి వెళ్లబోయింది. ఇంతలో ఒక్కసారిగా శరబన్నగౌడ్ వివాహితపై లైంగికదాడికి ప్రయత్నించాడు. తనను వదిలేయాలని ప్రాధేయపడని వినకపోవడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment