
పద్మావతి (ఫైల్)
అనంతపురం, తాడిమర్రి: పెద్దకోట్ల లో ఓ మహిళ విష ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తలారి మండల శంకర్‌కు యల్లనూరుకు చెందిన పద్మావతి(28)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారులు కృష్ణఅవినాష్, అభినయ్ ఉన్నారు. శంకర్ గ్రామం సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో చేపల వేటతో జీవనం సాగించేవాడు. పద్మావతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈక్రమంలో నొప్పితాళలేక గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావకం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లిదండ్రుల ఆంజనేయులు, లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment