![New Couple Died In Bus Accident - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/23/bus-accident.jpg.webp?itok=BLkZCnmt)
సుధాకర్, అనసూయ (ఫైల్)
అనంతపురం, దొడ్డబళ్లాపురం: జీవితాంతం సుఖదుఃఖాల్లో తోడునీడగా కలిసుంటామని బాసలు చేసిన నవ దంపతులు మరణంలోనూ ఒక్కటిగానే ఉన్నారు. ఓ బైక్‌ను గార్మెంట్స్ ఫ్యాక్టరీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో కొత్త జంట మరణించిన సంఘటన సోమవారం రాత్రి దొడ్డబళ్లాపురం గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులను ఆనంతపురం జిల్లా రొద్దం సమీపంలోని పీ కొత్తపల్లికి చెందిన ఉప్పర సుధాకర్ (26), ఆయన భార్య ఉప్పర అనసూయ(20)గా పోలీసులు గుర్తించారు.
వీరు దొడ్డ–గౌరిబిదనూరు మార్గంలోని గుండంగెరె క్రాస్ వద్ద బైక్‌పై వస్తుండగా గార్మెంట్స్ బస్సు ఎదురుగా ఢీకొంది. ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాగా, వీరికి ఇటీవలే పెళ్లయింది. దొడ్డ తాలూకాలోని కమలూరు వద్ద ఉన్న కోళ్లఫారంలో పనిచేసేవారని సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment