
స్వీట్ బాక్స్, హనుమాన్ చాలీసా యంత్రాలను చూపుతున్న బాధితుడు
అనంతపురం, సోమందేపల్లి: అతి తక్కువ ధరకే ఫోన్ పంపుతామని చెప్పి స్వీట్‌బాక్స్, హనుమాన్ చాలీసా యంత్రాన్ని పంపి అమాయకుడికి టోకరా వేసిన ఉదంతం వెలుగు చూసింది. సోమందేపల్లి మండల కేంద్రంలోని గీతానగర్‌కు చెందిన నరేష్ చేనేత కార్మికుడు. ఇతడికి ఎస్‌ఎస్ స్కై కంపెనీ తరఫున 96066 71368 నంబరు నుంచి ఫోన్ వచ్చింది. స్యామ్‌సంగ్ జే2 ఫోన్ రూ.1600కే ఆఫర్‌లో ఇస్తున్నామని చెప్పడంతో నరేష్ ఆర్డర్ చేశాడు. సోమవారం పోస్టుమ్యాన్ పార్సిల్ తీసుకురాగా పై మొత్తం చెల్లించి తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి పార్సిల్‌ను తెరవగా అందులో ఫోన్‌కు బదులు స్వీట్ బాక్స్, హనుమాన్ చాలీసా యంత్రం ఉంది. తనను కంపెనీ వారు మోసం చేశారని బాధితుడు లబోదిబోమన్నాడు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధితుడు చెబుతున్నాడు.