
బాధితుడు నారాయణస్వామి
అనంతపురం, ఆత్మకూరు: ఆస్తి కోసం కన్నతండ్రిపైనే హత్యాయత్నం చేసిన కుమారులు, కూతురి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమ పేరిట ఆస్తి రాసివ్వాలని కుర్లపల్లికి చెందిన నారాయణస్వామిని కుమారులు జోగి రాజు, జోగి బాలచంద్ర, కుమార్తె మేనక శనివారం అడిగారు. ఆస్తి పంచడానికి నిరాకరించిన నారాయణస్వామికి కళ్లల్లోకి కారం కొట్టి, గొడ్డలిని తిప్పేసి తలపై కొట్టి హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామి స్థానికుల సహాయంతో అదే రోజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి అనంతపురంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీరికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment