
మహేష్ (ఫైల్)
అనంతపురం టౌన్: ఓ ఉపాధ్యాయుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని ద్వారకానగర్‌కు చెందిన మహేష్ (42) మొదటిరోడ్డులోని పొట్టిశ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం గార్లదిన్నెకు వెళ్లి.. అక్కడ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య సుప్రియ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహేష్ 2000 – డీఎస్సీలో మాథ్స్ సబ్జెక్ట్‌లో జిల్లా టాపర్‌గా నిలిచి రాజేంద్ర నగరపాలక సంస్థ పాఠశాలలో గణితం ఉపాధ్యాయునిగా చేరారు. పదేళ్ల క్రితం అక్కడి నుంచి బదిలీపై పొట్టిశ్రీరాములు ఉన్నత పాఠశాలకు వచ్చారు. కొద్ది రోజులుగా తోటి ఉపాధ్యాయులతో సైతం కలవకుండా ఒంటరిగా తనలో తానే మదనపడుతుండేవాడు. అలాంటి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటం తోటి ఉపాధ్యాయులను కలచివేసింది.