
కాలిన మృతదేహాన్ని పరిశీస్తున్న పోలీసులు
పెద్దవడుగూరు: వీరేపల్లి సమీపాన మంగళవారం ఉదయం ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతదేహం తగులబడి పోతుండటాన్ని అటుగా వచ్చిన గ్రామస్తులు గమనించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి దావానలంలా వ్యాపించింది.
గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచారం అందుకున్న పామిడి సీఐ శ్రీనివాసులు, పెద్దవడుగూరు ఎస్‌ఐ రమేష్‌రెడ్డిలు చేరుకుని సంఘటన జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దగ్గరే గులాబీ రంగులో ఉన్న ఒక దుప్పటి పడి ఉండటాన్ని పరిశీలించారు. ఎక్కడో యువకుడి చేతులు వెనుకకు కట్టేసి చంపి.. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పెట్రోలు పోసి నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment