బాలిక అనుమానాస్పద మృతి | Girl Suspicious death in Anantapur | Sakshi
Sakshi News home page

బాలిక అనుమానాస్పద మృతి

Published Thu, Dec 13 2018 11:35 AM | Last Updated on Thu, Dec 13 2018 11:35 AM

Girl Suspicious death in Anantapur - Sakshi

మృతురాలి బంధువులను విచారిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌లో) మోనిష (ఫైల్‌)

అనంతపురం, లేపాక్షి: శిరివరం గ్రామానికి చెందిన మోనిష (16) బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక తండ్రి కుమార్‌ తెలిపిన మేరకు... కర్ణాటకలోని హోసూరు ప్రాంతం జూజూవాడకు చెందిన కుమార్‌కు లేపాక్షి మండలం శిరివరం గ్రామానికి చెందిన రాధతో వివాహమైంది. 2003లో భర్తతో గొడవపడి రాధ తన పుట్టినిల్లు అయిన శిరివరం గ్రామానికి వచ్చేసింది. కుమార్తె మోనిష తండ్రి వద్ద ఉంటూ అత్తిబేలే వద్దవున్న శ్రీవెంకటేశ్వర స్కూలులో చదువుతోంది. 2017 జూన్‌లో పాఠశాలకు వెళ్లిన మోనిష కనిపించకుండా పోయింది. తండ్రి హోసూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అమ్మాయి శిరివరంలోని తన తల్లి వద్ద ఉంటోందని పోలీసుల విచారణలో తేలింది.

దీంతో కుమార్‌ లేపాక్షి పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ చేసి.. కుమార్తెను తల్లి వద్దే వదిలి వెళ్లిపోయాడు. ప్రస్తుతం మోనిష గౌరిబిదనూరులోని పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి 2.45 గంటలకు కుమార్తె చనిపోయిందని సమాచారం అందడంతో కుమార్‌ హుటాహుటిన శిరివరం చేరుకున్నాడు. పాఠశాల నుంచి ఆలస్యంగా వస్తోందని మందలించినందుకు మనస్తాపం చెంది సంపులో పడి ఆత్మహత్య చేసుకుందని తల్లి చెబుతోంది. కుమార్తె మృతిపై అనుమానం ఉండటంతో భార్య రాధ, బంధువులు లలిత, వెంకటేష్, క్రిష్టప్పలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఎస్‌ఐ ఆంజనేయులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement