సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్.. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుంది’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయేలా కేటీఆర్‌ను టార్గెట్ చేశామన్న రేవంత్.. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా హరీష్‌ను వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు.
మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు
‘మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు’ అంటూ కేటీఆర్ బావమరిది రాజు పాకాల విందుపై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదు.. రాజ్ పాకాల ఏం చేయక పోతే ఎందుకు పారిపోయారు?. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారు?దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయి’’ అంటూ రేవంత్ ప్రశ్నలు గుప్పించారు.
మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదు..
మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదని.. ఎవరు అడ్డుకున్న మూసి పునరుజ్జీవం చేసి తీరుతామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మొదటి ఫేస్ 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తాం. గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతాం. నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తాం. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తాం.’’ అని రేవంత్ తెలిపారు.
ఇదీ చదవండి: సమస్యలు కొని తెచ్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి!
‘‘బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతాం. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగాము.15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తాం. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెఫ్ట్‌తో అభివృద్ధి చేస్తాం. మూసి వెంటా అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment