
చిత్తూరు : జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ఓమ్ని వ్యాన్ ఢీకొని ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకొని బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా మృతి చెందిన వారిలో రాజమ్మ(80), అన్నపూర్ణ(60), జ్యోతి(14) ఉన్నారు. మృతి చెందినవారిని కర్ణాటకలోని నంగిరి మండలం తొండపల్లి వాసులుగా గుర్తించారు.


Comments
Please login to add a commentAdd a comment