ఔటర్‌పై టోల్ మోత! | The proposals have been prepared for outer road toll tax increase | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై టోల్ మోత!

Published Sat, Oct 22 2016 2:28 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

ఔటర్‌పై టోల్ మోత!

ఔటర్‌పై టోల్ మోత!

► 30 నుంచి 40 శాతం పెరగనున్న చార్జీలు
► పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసిన హెచ్‌ఎండీఏ
► నిర్వహణ భారం పెరగడం.. ఆదాయం తగ్గడమే కారణం
► ఇతర హైవేలపై అధ్యయనం తర్వాత పెంపునకు నిర్ణయం
► ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. త్వరలో అమల్లోకి కొత్త చార్జీలు

 
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్)పై టోల్ మోత మోగనుంది. వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుములను భారీ గా పెంచేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కసరత్తు చేస్తోంది. టోల్ చార్జీలు సుమారు 30 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఆర్‌ఆర్ నిర్వహణ వ్యయం అధికమవ్వడం.. ఆదాయం తక్కువగా వస్తుండడంతో చార్జీల పెంపు అంశం తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత టోల్ చార్జీలను రెండు మూడు రోజుల్లో హెచ్‌ఎండీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిం చనున్నట్లు తెలిసింది. దీనిపై ఆమోద ముద్ర పడితే నూతన చార్జీలు అమల్లోకి వస్తారుు.
 
టోల్ చార్జీలు ఇలా..
నగరంపై వాహన భారం తగ్గించడంతోపాటు ప్రయాణికులను సులభంగా గమ్యానికి చేర్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ చుట్టూ 2008లో 158 కిలోమీటర్ల మేర ఓఆర్‌ఆర్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఎనిమిది వరుసలతో 2008లో ప్రారంభమైన ఈ నిర్మాణం.. తుదిదశకు చేరుకుంది. 156.90 కి.మీ. ఓఆర్‌ఆర్ పనులు ముగియడంతో ఆ దారిలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారుు. నిత్యం 65 వేలకుపైగా వాహనాలు తిరుగుతుండగా.. టోల్ చార్జీల రూపంలో హెచ్‌ఎండీఏకు ఏడాదికి సుమారు రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అరుుతే టోల్ ద్వారా వస్తున్న ఈ మొత్తం కంటే ఓఆర్‌ఆర్ నిర్వహణ ఖర్చు అధికంగా ఉండడంతో హెచ్‌ఎండీఏపై భారం పడుతోంది. దీని నుంచి గట్టెక్కేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఔటర్‌పై ప్రతి కిలోమీటర్‌కు కారు, జీపు, వ్యాన్‌లకు రూ.1.05, మినీ బస్సులకు రూ.1.69, బస్సు, రెండు యాక్సెల్ ట్రక్‌కు రూ.3.53, మూడు యాక్సెల్ ట్రక్కులకు రూ.3.85, 4 నుంచి 7 యాక్కెల్ ట్రక్కులకు రూ.5.54, 7కు పైగా యాక్సెల్ కలిగిన వాహనాలకు రూ.6.74 టోల్ చార్జీ వసూలు చేస్తున్నారు.

హైవేలపై పోలిస్తే చాలా తక్కువ..
జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ చార్జీలతో పోల్చుకుంటే.. ఓఆర్‌ఆర్ టోల్ చార్జీలు చాలా తక్కువగా ఉన్నారుు. ఇటీవల హెచ్‌ఎండీఏ అధికారులు పలు నేషనల్ హైవేల్లో చేసిన అధ్యయనంలో ఇది తేలింది. అంతేగాక ఆ రహదారులతో పోల్చుకుంటే.. ఓఆర్‌ఆర్ నిర్వహణ వ్యయం అధికంగా ఉంది. పైగా జాతీయ రహదారులు ఆరు లేన్లకు మించకపోగా.. ఓఆర్‌ఆర్ ఎనిమిది లేన్లతో కూడుకున్నది. దీంతోపాటు ఔటర్ చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ మేరకు నిధులను ఖర్చు చేయాల్సి వస్తోంది. రూ.6,696 కోట్ల వ్యయంతో ఓఆర్‌ఆర్ ప్రాజెక్టును చేపట్టారు.

ఇందులో జైకా నుంచి రూ.3,558 కోట్లను హెచ్‌ఎండీఏ రుణంగా తీసుకుంది. దీనిని క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంది. జాతీయ రహదారులకు ఇటువంటి ఇబ్బంది లేదు. ఉన్న రోడ్లనే వెడల్పు చేస్తూ వచ్చారు. తద్వారా కొంత మేరకు నిర్మాణ ఖర్చు తగ్గినట్లే. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఔటర్ నిర్వహణ సంక్లిష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. టోల్ చార్జీలు పెంచే అంశంలో ఇదే విషయాన్ని ప్రభుత్వానికి వివరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలోనే చార్జీల పెంపు ప్రతిపాదనను అధికారులు తీసుకెళ్లగా.. సర్కారు వివరణ అడిగింది. ఈ క్రమంలో పైఅంశాలనే ప్రభుత్వానికి వివరించే అవకాశాలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement