విశాఖ, తిరుపతి, విజయవాడల్లో ఏర్పాటుకు యత్నం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మూడు కేన్సర్ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయాక హైదరాబాద్‌లో ఉన్న ఏకైక ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి తెలంగాణకు వెళ్లిపోయింది.
దీని స్థానంలో రూ.150 కోట్లతో విజయవాడలో (రీజనల్ కేన్సర్ సెంటర్) ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. విశాఖ, తిరుపతిల్లో ఏర్పాటు చేసే ఆస్పత్రులకు ఒక్కోస్పత్రికి రూ.40 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటికి కేంద్ర నిధుల కోసం కూడా లేఖ రాసినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు సాక్షికి తెలిపారు.
మూడు కేన్సర్ ఆస్పత్రులకు ప్రతిపాదన
Published Sun, Nov 9 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement
Advertisement