న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్‌ను అరికట్టడానికి.. కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం గ్రేడ్స్ వారీ అధిక టారిఫ్‌ను ప్రవేశపెట్టాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా పరిశ్రమను కోరింది. రోజుకు 50కి పైగా కాల్స్, లేదా 50 ఎస్‌ఎంఎస్‌లు పంపిన టెలికం సబ్‌స్క్రైబర్లను ఇబ్బందికర కాలర్లుగా పరిశీలించాలని టెలికం కంపెనీలకు సూచించింది.
దేశంలో 110 కోట్ల మందికిపైగా టెలికం సబ్‌స్క్రైబర్‌లు ఉండగా వీరిలో 0.03 శాతం మంది రోజుకు ఒక సిమ్ నుంచి 51 నుంచి 100 ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారని ట్రాయ్ పేర్కొంది. అలాగే 0.12% మంది ఒక సిమ్ నుంచి రోజుకు 51 నుండి 100 వాయిస్ కాల్స్ చేస్తున్నారని ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్‌లో వివరించింది.
‘టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018’ నిబంధనల పరిధిలో నమోదైన ఒక సంస్థ కాకుండా ఇతర వ్యక్తులకు ఒక సిమ్‌కు రోజుకు ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఎస్‌ఎంఎస్, వాయిస్ కాల్స్ కోసం గ్రేడ్స్ వారీ టారిఫ్ ఉండాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment