తొర్రూరు రెవెన్యూ డివిజన్‌కు ప్రతిపాదనలు | Torruru Revenue Division of proposals | Sakshi
Sakshi News home page

తొర్రూరు రెవెన్యూ డివిజన్‌కు ప్రతిపాదనలు

Published Fri, Sep 9 2016 12:40 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

తొర్రూరు రెవెన్యూ డివిజన్‌కు ప్రతిపాదనలు - Sakshi

తొర్రూరు రెవెన్యూ డివిజన్‌కు ప్రతిపాదనలు

హన్మకొండ అర్బన్‌ : కొత్తగా ఏర్పడే మహబూబాబాద్‌ జిల్లాలో మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రతిపాదిత తొర్రూరు డివిజన్‌లో నెల్లికుదురు, కురవి, తొర్రూరు, నర్సిహులపేట మండలాలు కలపాలని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ఈ మండలాలకు డివిజన్‌కేంద్రం దూరంగా ఉందని, తొర్రూరు డివిజన్‌ ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు.
 
కలెక్టర్‌కు జేఏసీ నాయకుల వినతి
హన్మకొండ అర్బన్, తొర్రూరు : తొర్రూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ నాయకులైన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీ ఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్‌ కరుణను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వారితో నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement