తొర్రూరు రెవెన్యూ డివిజన్‌కు ప్రతిపాదనలు
హన్మకొండ అర్బన్ : కొత్తగా ఏర్పడే మహబూబాబాద్ జిల్లాలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రతిపాదిత తొర్రూరు డివిజన్లో నెల్లికుదురు, కురవి, తొర్రూరు, నర్సిహులపేట మండలాలు కలపాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ డివిజన్ పరిధిలోని ఈ మండలాలకు డివిజన్‌కేంద్రం దూరంగా ఉందని, తొర్రూరు డివిజన్ ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు.
కలెక్టర్‌కు జేఏసీ నాయకుల వినతి
హన్మకొండ అర్బన్, తొర్రూరు : తొర్రూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ నాయకులైన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీ ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కరుణను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వారితో నాయకులు పాల్గొన్నారు.