ఏడు ఎఫ్డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.100 కోట్ల విలువైన ఏడు ఎఫ్డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. నాలుగింటిని తిరస్కరించింది. కాగా వచ్చిన ప్రతిపాదనల సంఖ్య 19గా ఉంది. కేంద్రం ఆమోదం తెలిపిన వాటిల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వంటి ప్రతిపాదనలు ప్రధానమైనవి. కే వలం ఈ రెండు ఎఫ్‌డీఐ ప్రతిపాదనల విలువ రూ.90 కోట్లుగా ఉంది. ఇక ఆమోదం పొందిన మిగతా వాటిల్లో బీజేఎం గ్రూప్ ఇండియా, క్రెస్ట్ ప్రెమిడియా సొల్యూషన్స్, ఫ్యాన్స్ ఆసియా, ఫ్లాగ్ టెలికం సింగపూర్, బర్రాకుడా కమౌఫ్లగె వంటివి ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.