నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్)పై టోల్ మోత మోగనుంది. వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుములను భారీ గా పెంచేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కసరత్తు చేస్తోంది. టోల్ చార్జీలు సుమారు 30 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఆర్‌ఆర్ నిర్వహణ వ్యయం అధికమవ్వడం.. ఆదాయం తక్కువగా వస్తుండడంతో చార్జీల పెంపు అంశం తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత టోల్ చార్జీలను రెండు మూడు రోజుల్లో హెచ్‌ఎండీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిం చనున్నట్లు తెలిసింది. దీనిపై ఆమోద ముద్ర పడితే నూతన చార్జీలు అమల్లోకి వస్తారుు.
Published Sat, Oct 22 2016 6:56 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
Advertisement