లైబ్రరీ ఫోటోలు పోస్ట్‌ చేస్తే పెళ్లి ప్రపోజల్స్‌! | Man Shared Photos Of His Library Cum Home On Twitter | Sakshi
Sakshi News home page

ట్విటర్‌ వేదికగా పుస్తక ప్రియుడికి సలాం

Published Sun, Aug 9 2020 4:43 PM | Last Updated on Sun, Aug 9 2020 6:52 PM

Man Shared Photos Of His Library Cum Home On Twitter - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్‌ యుగంలోనూ పుస్తక పఠనానికి ప్రాధాన్యత తగ్గలేదు. ట్విటర్‌లో తన లైబ్రరీ ఫోటోలను పోస్ట్‌ చేసిన షౌమిక్‌ అనే యూజర్‌కు పెళ్లి ప్రపోజల్స్‌ వెల్లువెత్తాయి. ‘నేనేంటో తెలియని వారి కోసం...నేను లైబ్రరీలో నివసిస్తున్నా’ అంటూ తన లైబ్రరీ ఫోటోలను పోస్ట్‌ చేసిన షౌమిక్‌కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ ఫోటోల్లో ఒక చోట స్టడీ కమ్‌ వర్క్‌ డెస్క్‌ ఉండగా, మరో మూల కుర్చీ కనిపించాయి. వేలాది బుక్స్‌ మధ్య డెస్క్‌, కుర్చీ ఉన్న ఫోటోలు అమితంగా ఆకట్టుకున్నాయి. చదవండి : ఒక్కో బుక్‌... ఒక్కో కిక్‌

ఈ ట్వీట్‌ను షౌమిక్‌ పోస్ట్‌ చేయగానే పుస్తక ప్రియులు అతను విస్తారంగా చేపట్టిన పుస్తక సేకరణ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌కు 8000కు పైగా లైక్స్‌ దక్కగా పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. కొందరు నెటిజన్లు అతడి పుస్తక అభిరుచిని అభినందించగా, మరికొందరు అతడి రూమ్మేట్‌గా ఉంటామన్నారు. అంతేకాదు..షౌమిక్‌ పుస్తక కలెక్షన్‌కు మెచ్చి పలువురి నుంచి ఆయనకు పెళ్లి ప్రతిపాదనలూ అందాయి. ఇక తన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన రావడంతో ఉద్వేగానికి గురైన షౌమిక్‌ ఇవి తాను సేకరించిన మొత్తం బుక్స్‌లో 75 శాతమని, తన వద్ద 8000కు పైగా బుక్స్‌ ఉన్నాయని మరో ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement