ఆసియాన్ వేదికపై మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో ప్రధాని మోదీ
జకార్తా: 10 దేశాలతో కూడిన ఆసియాన్ కూటమి, భారత్ మధ్య మరింత సహకారానికి 12 సూత్రాల ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ తెరమీదకు తెచ్చారు. కనెక్టివిటీ మొదలు వర్తకం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ దాకా పలు అంశాల్లో పరస్పర సహకారం పెంపునకు ఎంతగానో అవకాశాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. కరోనా అనంతరం మరింత క్రమశిక్షణతో కూడిన ప్రపంచం కోసం పాటుపడదామని పిలుపునిచ్చారు.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో గురువారం ఆసియాన్ –భారత్ వార్షిక శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఆగ్నేయాసియా, పశి్చమాసియా, యూరప్‌లతో భారత్‌ను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్ తదితరాలను ప్రస్తావించారు. శాంతి, ప్రగతి, పరస్పర వృద్ధే లక్ష్యంగా ఆసియాన్ –భారత్ భాగస్వామ్య కార్యాచరణను పటిష్టంగా ప్రణాళిక అమలు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.
సముద్ర వర్తకంలో పరస్పర సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని పేర్కొన్నాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిరంతర కనెక్టివిటీ, బ్లూ ఎకానమీ, ఆహార భద్రత మొదలుకుని అంతరిక్షం దాకా అన్ని రంగాల్లోనూ భారత కృషికి, ప్రయత్నాలకు ఆసియాన్ పూర్తి మద్దతుంటుందని ప్రకటన పేర్కొంది.
అలాగే పరస్పర వర్తకం, పెట్టుబడుల ద్వారా ఆహార భద్రత, పౌష్టికాహారం తదితర రంగాల్లో సహకారాన్ని మరింతగా పటిష్టపరచుకోవాలని మరో సంయుక్త ప్రకటనలో నిర్ణయించాయి. ఉగ్రవాదం, దానికి నిధులు తదితరాల మీద ఉమ్మడి పోరు జరపాలని నిర్ణయించారు. మరింత స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ దిశగా ప్రగతి సాధనలో కలిసి రావాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. సదస్సుకు సహాధ్యక్ష హోదాలో ఆయన మాట్లాడారు. ‘21వ శతాబ్దం ఆసియాకు సొంతం. ఇది మన శతాబ్దం’’ అని పేర్కొన్నారు.
ఆ ప్రతిపాదనల్లో కొన్ని...
► కనెక్టివిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, వర్తకం, ఆహార భద్రత నుంచి బ్లూ ఎకానమీ దాకా వంటి పలు రంగాల్లో మరింత సహకారం
► ఉగ్రవాదం, దాని ఆర్థిక మూలాల మీద ఉమ్మడి పోరు
► దక్షిణాది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను అంతర్జాతీయ వేదికల మీద లేవనెత్తడం
► ఆసియాన్–భారత్ డిజిటల్ ఫ్యూచర్ నిధి
► ఆసియాన్, ఈస్ట్ ఏషియా ఆర్థిక, పరిశోధన సంస్థ ( ఉఖఐఅ) పునరుద్ధరణ, దానికి మరింత మద్దతు
► భారత్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌లో భాగం కావాలంటూ ఆహా్వనం
► విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన యత్నాల్లో భాగస్వామ్యం
► జన్ ఔషధీ కేంద్రాల ద్వారా పేదలకు అందుబాటు ధరల్లో మందులు అందించడంలో భారత అనుభవాన్ని అందిపుచ్చుకోవడం
► ఆసియాన్–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలును నిరీ్ణత కాలావధిలో సమీక్షించుకోవడం 30 ఏళ్ల బంధం
► వ్యూహాత్మక భాగస్వామ్య కూటమి ఏర్పాటు దిశగా ఆసియాన్– భారత్ చర్చలు 1992 నుంచే మొదలయ్యాయి.
► 1995 కల్లా పూర్తిస్థాయి రూపు సంతరించుకున్నాయి.
► 2002 నాటికి శిఖరాగ్ర సదస్సు స్థాయి భాగస్వామ్యంగా రూపుదాల్చాయి.
► ఆసియాన్ సభ్య దేశాలతో కొన్నేళ్లుగా భారత సంబంధాలు ఊపు మీదున్నాయి. రక్షణ, భద్రత, పెట్టుబడులు, వర్తకం తదితర రంగాల్లో సహకారం పెరుగుతూ వస్తోంది.
ఆ పది దేశాలు...
► ఆసియాన్ కూటమి పది దేశాల సమాహారం. అంతర్జాతీయంగా శక్తిమంతమైన కూటముల్లో ఇదొకటి. దాని సభ్య దేశాలు...
► ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా.
► ఆసియాన్ కూటమిలో చర్చా భాగస్వాములుగా భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆ్రస్టేలియా వంటి దేశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment