
18 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)కు సంబంధించిన 18 ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. క్యాడిలా హెల్త్‌కేర్, టాటా గ్లోబల్ బేవరేజెస్‌లకు సంబంధించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు కూడా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. మొత్తం 41 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను పరిశీలించిన పిమ్మట ఈ 18 ప్రతిపాదనలకు ఎఫ్‌ఐపీబీ ఓకే చేసిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. 10 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసిందన్నారు. ఎఫ్‌ఐపీబీకి అధ్యక్షుడిగా ఆర్థిక కార్యదర్శి రాజీవ్ మహర్షి వ్యవహరిస్తున్నారు.