
న్యూఢిల్లీ: పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఎలక్ట్రానిక్ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ వచ్చే ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా పలు కళాశాలల ప్రాంగణాల్లో డేటా ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 100 పైచిలుకు యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది.
’ఉన్నతి’ ప్రోగ్రాంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్ తెలిపారు. ఈ ల్యాబ్స్ ఏర్పాటుకయ్యే వ్యయాలను ఆయా విద్యా సంస్థలు భరించనుండగా, సాంకేతిక.. నాలెడ్జ్ భాగస్వామిగా ఇంటెల్ తోడ్పాటు అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉన్నతి ప్రోగ్రాం కింద జట్టు కట్టే విద్యా సంస్థలు తమ బడ్జెట్, సాంకేతిక, మౌలిక సదుపాయాల అవసరాలకు అనుగుణంగా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి ల్యాబ్‌లో ఇంటెల్ సూచించే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కోర్స్ కంటెంట్ మొదలైనవి ఉంటాయి. విద్యార్థులకు కో–బ్రాండెడ్ సరి్టఫికెట్లు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment