ఏపీ తుది ఓటర్ల సంఖ్య 3,93,45,717 | Final number of the state voters is 39345717 | Sakshi
Sakshi News home page

ఏపీ తుది ఓటర్ల సంఖ్య 3,93,45,717

Published Tue, Mar 26 2019 5:50 AM | Last Updated on Tue, Mar 26 2019 9:31 AM

Final number of the state voters is 39345717 - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తుది ఓటర్ల సంఖ్య 3,93,45,717 అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్‌ 11న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల జాబితాను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఈ నెల 11న ఓటర్ల జాబితా ప్రకటించామని, ఆ తర్వాత ఇప్పటి వరకు  కొత్తగా 24,12,626 మంది ఓటర్లు చేరారని, అదే సమయంలో 1,41,823 ఓటర్లను తొలగించినట్లు ఆయన ప్రకటించారు.

తుది జాబితా అనంతరం పురుషుల కన్నా మహిళా ఓటర్లు  4,17,082 మంది అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లు 1,94,62,339 మంది కాగా మహిళా ఓటర్లు 1,98,79,421 ఉన్నారు. ట్రాంజెండర్స్‌ 3,957 మంది ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement