![Votes Dissappeared In Koderu Constituency - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2018/12/8/ko.jpg.webp?itok=e-9vP6sh)
కోడేరు: ఓటుహక్కు వినియోగించుకునేందుకు నిల్చున్న ఓటర్లు
సాక్షి, కోడేరు: మండలంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. మండలంలో మొత్తం 30,743 ఓటర్లకు గాను దాదాపు వెయ్యికి పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే అధికారులు స్పందించి నూతన ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోడేరులో 300, రాజాపూర్‌లో 225, ఎత్తంలో 330, సింగాయిపల్లిలో 105, రాజాçపూర్‌లో 225, మరికొన్ని గ్రామాల్లో ఓట్లు గల్లంతు కావడంతో తహసీల్దార్, సిబ్బందిపై మండిపడ్డారు. తాము ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ పోచయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment