
అంబాజీపేట: ఆటోలు నడుపుకుంటూ జీవిస్తున్న తమకు టీడీపీ నాయకులు ఏ విధమైన రుణాలు రానీయకుండా చేస్తున్నారని జననేత వద్ద శనివారం శ్రీ సాయిరామ్ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆయనకు ఈమేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్నామని టీడీపీ నాయకులు కక్ష కట్టి ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారని వాపోయారు. టీడీపీ నాయకుల నుంచి సమస్య వస్తే మీరే ఆదుకోవాలని కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆటో కార్మికుల చొక్కాను జననేత ధరించడంతో వారందరూ సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment