
సాక్షి, సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నగర పోలీసు విభాగం నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలుస్తోంది. వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వీరికి దగ్గర చేయడానికి జాబ్ కనెక్ట్ పేరుతో కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని డిజైన్ చేసిన నగర పోలీసులు కాలనీలు, బస్తీలకు వెళ్లి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నారు. తొలిసారిగా పోలీసు పిల్లల కోసం బుధవారం జాబ్ కనెక్ట్ నిర్వహించారు. పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ మేళాలో మూడు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చాయి. మరోపక్క సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ ప్రాంగణంలో సిబ్బంది కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన క్యాంటీన్‌ను పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు సీపీ టి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment