Friendly police
-
ఇలాంటి పోలీస్ ఒక్కడున్నా చాలు! సొంత డబ్బులతో..
సాక్షి,పార్వతీపురంటౌన్(శ్రీకాకుళం): ఆయన ఓ హెడ్ కానిస్టేబుల్. ఏ స్టేషన్లో పనిచేసినా ఆయనకో ప్రత్యేక గుర్తింపు. జీతం డబ్బులతో పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం చేస్తారు. స్టేషన్‌కు వచ్చే పేద ఫిర్యాదుదారులకు కడుపునిండా భోజనం పెట్టి మానవత్వాన్ని చాటుకుంటారు. సమస్యను ఫిర్యాదు రూపంలో నమోదు చేస్తారు. పేదవృద్ధులకు అండగా నిలుస్తున్నారు. సేవలతో అందరికీ సుపరిచితుడై, సేవక భటుడిగా పేరు పొందారు. ఆయనే.. పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొమిరి కృష్ణమూర్తి. ఆయన దాతృత్వాన్ని ఓ సారి పరికిస్తే... కృష్ణమూర్తిది వీరఘట్టం మండలం కొట్టుగుమడ గ్రామం. ఉపాధ్యాయుడిగా స్థిరపడాలన్నది ఆయన కోరిక. పోలీస్ ఎంట్రన్స్ పరీక్షలో ప్రతిభ కనబరచడంతో 1993వ సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పేద వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులకు తన వంతుగా ఆర్థికసాయం చేస్తున్నారు. ఆయన పేరుకే పోలీస్.. కానీ మృధుస్వభావి, మానవతావాది. సమస్యలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారిని ఆప్యాయంగా పలకరిస్తారు. ఆపై వారి సమస్యలను సానుకూలంగా తెలుసుకొని రైటర్‌గా తనపనిని పూర్తిచేస్తారు. సమయానికి అనుగుణంగా వారికి భోజనం పెడతారు. తన సేవలను గుర్తించిన అప్పటి ఎస్పీ పాలరాజు ఆయనను వృద్ధమిత్ర, కోఆర్డినేటర్‌గా నియమించారు. మేము నాయీ బ్రాహ్మణులం. మా తండ్రి వ్యవసాయంతో పాటు కులవృత్తిచేసేవారు. ఆ రోజుల్లో వచ్చిన నెలసరి ఆదాయంలో ఇంటి అవసరాలకు పోను మిగిలిన మొత్తాన్ని పేదలకు దానంచేసేవారు. కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తనకు తోచిన సహాయాన్ని చేసేవారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నెలజీతంలో కొంతమొత్తాన్ని పేదలకు వెచ్చిస్తున్నాను. అబ్దుల్ కలాం రచించిన పుస్తకాలను, ఆయన జీవిత చరిత్రను చదివాను. ఆయనే నాకు స్ఫూర్తి. ఉద్యోగవిరమణ పొందిన తరువాత వచ్చిన మొత్తంతో పేద పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల నిర్మిస్తాను. పేదలకు సహాయం చేయడంలో ఉన్న సంతృప్తిని లెక్కించలేను. – కృష్ణమూర్తి, హెడ్‌కానిస్టేబుల్, పార్వతీపురం టౌన్ స్టేషన్ మానవసేవే మాధవ సేవగా... ఆయన తన నెలవారీ జీతంలో సుమారు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు సేవలకు వెచ్చిస్తున్నారు. పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, నిఘంటువులు, దేశ నేతల జీవితగాథల పుస్తకాలు, పెన్నులు కొనుగోలు చేసి అందజేస్తున్నారు. పేద వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతినెలా నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు సమకూర్చుతున్నారు. కొంత ఆర్థిక సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఆయన సేవా నిరతిపై అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వృద్ధమిత్ర కో ఆర్డినేటర్‌గా అందిస్తున్న సేవలను ఆర్యవైశ్య ధర్మశాలలో పార్వతీపురం గత ఆర్డీఓ సుదర్శన్ దొర, సీఐ సంజీవరావు, వయో వృద్ధుల సంక్షేమ ప్రతినిధి జె.సీతారాములు ఘనంగా సత్కరించారు. 2010 నుంచి 2021వరకు ఏటా ఆయనను పలువురు పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సత్కరించాయి. -
యువత చెంతకే ఉద్యోగాలు..
కంటోన్మెంట్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు, యువతతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు విభాగం తీసుకుంటున్న చర్యల్లో ‘జాబ్ కనెక్ట్’ ఒకటి. ప్రైవేట్ రంగంలోని వివిధ కంపెనీల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం నార్త్‌జోన్ పోలీసులు మెగా జాబ్ కనెక్ట్ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. ప్యాట్నీ సెంటర్లోని స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కార్ఖానా ఇన్స్పెక్టర్, జాబ్ మేళా ఇన్చార్జ్ వరవస్తు మధుకర్‌స్వామి గురువారం తెలిపారు. నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తర మండల డీసీపీ కల్మేశ్వర్ సింగెన్వార్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ప్రవేశం, రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ తదితరాలన్నీ పూర్తిగా ఉచితం. టెన్త్ ఫెయిల్ అయిన వారి నుంచి ఐటీ ఉత్తీర్ణులైన వారి వరకు çప్రతి ఒక్కరికీ అనువైన ఉద్యోగాలు ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. సెక్యూరిటీ గార్డు మొదలు ఐటీ ప్రొఫెషనల్ వరకు అన్ని రకాలైన ఉద్యోగాలకు ఇక్కడ నుంచి అవకాశం కల్పిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు స్వయంగా వచ్చి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎంపిక చేసుకున్న వారికి అక్కడికక్కడే జాయినింగ్ ఆర్డర్స్ అందజేస్తారు. వీరు ఆయా సంస్థల్లో కనిష్టంగా రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఆసక్తి కలవారు తమ బయోడేటాతో పాటు విద్యార్హత పత్రాల జిరాక్స్ ప్రతులు, ఫొటోలతో హాజరుకావాలని మధుకర్‌స్వామి తెలిపారు. ప్రముఖ కంపెనీలు సైతం... యువతకు ఉపాధి కల్పించే దిశగా నగర పోలీసులు తీసుకుంటున్న చర్యలకు పలు ప్రతిష్టాత్మక కంపెనీలు, సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ఈ జాబ్‌మేళాలో గూగుల్, అమెజాన్, నాగార్జున కన్‌స్టక్ష్రన్స్, కిమ్స్ ఆసుపత్రి, వింపటా ల్యాబ్స్, అపోలో ఫార్మసీ, ఫిప్కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హైకేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, నవతా ట్రాన్స్పోర్ట్, పేరం గ్రూప్ఆఫ్ కంపెనీస్, ప్రీమియర్ హెల్త్ గ్రూప్, రిలయన్స్ డిజిటల్, బిగ్‌బజార్, శ్రీరామ్ లైఫ్ ఇన్సురెన్స్, శుభగృహæప్రాజెక్ట్, స్పెన్సర్స్, ఫార్చున్ మోటర్స్ సహా 75 సంస్థలు పాల్గొని యువతకు అవకాశాలు కల్పించనున్నాయి. జాబ్‌మేళా ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సహాయ సహకారాల కోసం కార్ఖానా పోలీస్ సిబ్బంది ఫీబా (79011 21317), ప్రీతిలను (79011 21300) సంప్రదించాలి. సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరి ప్రయాణం ఒక అడుగుతోనే మొదలవుతుంది. అలాగే ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే జాబ్ మేళా కోసం దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసారి 8500 మందికి ఉపాధి చూపాలని లక్ష్యంగా నిర్ణయించాం. –మధుకర్ స్వామి, కార్ఖానా ఇన్స్పెక్టర్ -
పోలీసు పిల్లలకూ ‘జాబ్ కనెక్ట్’
సాక్షి, సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నగర పోలీసు విభాగం నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలుస్తోంది. వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వీరికి దగ్గర చేయడానికి జాబ్ కనెక్ట్ పేరుతో కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని డిజైన్ చేసిన నగర పోలీసులు కాలనీలు, బస్తీలకు వెళ్లి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నారు. తొలిసారిగా పోలీసు పిల్లల కోసం బుధవారం జాబ్ కనెక్ట్ నిర్వహించారు. పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ మేళాలో మూడు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చాయి. మరోపక్క సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ ప్రాంగణంలో సిబ్బంది కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన క్యాంటీన్‌ను పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు సీపీ టి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సాహస పోలీసు
జమ్మికుంట రూరల్: ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ప్రజలతో మమేకమై శాంతి భద్రతలను సంరక్షించడమే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వెనుకాడబోమని కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి నిరూపించారు. తాడు సాయంతో చేదబావిలోకి దిగి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాపాడారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంటి సమీపంలో ఉన్న చేదబావిలో మట్టి పూడిక తీత పనులకు మంగళవారం అదే గ్రామానికి చెందిన ఒల్లాల మల్లయ్య, మారపల్లి రవీందర్ వెళ్లారు. బావిలోకి దిగి కాసేపు పనులు చేసిన అనంతరం ఇద్దరు వ్యక్తుల నుంచి ఎలాంటి చడీచప్పుడు రాలేదు. దీంతో అక్కడే ఉన్న గ్రామస్తులు వెంటనే పోలీసులు, 108కు సమాచారం అందించారు. స్పందించిన జమ్మికుంట టౌన్ సీఐ సృజన్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు. చేదబావిలో ఉన్న మల్లయ్య, రవీందర్‌లకు ఊపిరాడకపోవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 108 వెంట ఉన్న ఆక్సిజన్‌ను పైపు ద్వారా బావిలోకి పంపించారు. ఈ సమయంలో చేదబావిలోకి దిగడానికి గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. అగ్నిమాపక సిబ్బంది తీసుకొచ్చిన నిచ్చెన సహాయంతో సీఐ సృజన్‌రెడ్డి చేదబావిలోకి దిగి, అందులో ఉన్న ఇద్దరి నడుముకు తాడు కట్టి గ్రామస్తుల సహకారంతో పైకి తీశారు. వెంటనే మల్లయ్య, రవీందర్‌లకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో నుంచి బయట పడ్డారు. ఈ క్రమంలో సీఐకి స్వల్ప గాయాలు కావడంతో 108 సిబ్బంది చికిత్స చేశారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా ఇద్దరి ప్రాణాలను కాపాడిన సీఐ సృజన్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
వైరల్ వీడియో : ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో!
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్‌ను కొందరు తమ ఇష్టానికి వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. సాధారణ ప్రజలకు కాకుండా బడా వ్యాపారవేత్తలకు, కాంట్రాక్టర్లకు, రాజకీయ వేత్తలకు మాత్రమే ఫ్రెండ్లీ పోలిసింగ్ పని చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటనే దీనికి నిదర్శనం. ఓ కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకులను పోలీస్ స్టేషన్లోనే దర్జాగా నిర్వహించారు. కరీంనగర్ లోని మానకొండూరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి పుట్టినరోజు ఇటీవల జరిగింది. దీంతో సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆయన పుట్టినరోజు వేడుకలను స్టేషన్ లోనే ఏర్పాటుచేశారు. కేక్ తెచ్చి కోసి ఆయనకు తినిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కొత్త ఏడాదిలో కొంగొత్త పోలీసింగ్
సాక్షి, సిటీబ్యూరో: ఈ కొత్త ఏడాదిలో సరికొత్త పోలీసింగ్‌ను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఇందులో సబ్–ఇన్స్పెక్టర్ల (ఎస్సై) పాత్ర అత్యంత కీలకమన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నగర పోలీసు ప్రాధాన్యాలను సిబ్బందికి తెలియజెప్పేందుకు కొత్వాల్ ‘సిటీ పోలీసు రోడ్ మ్యాప్ ఫర్ 2019’ పేరుతో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరాయ భవన్లో ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి సిటీ పోలీసు విభాగానికి చెందిన ఎస్సై ఆ పైస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇందులో కొత్వాల్ జోన్ల వారిగా సమీక్ష చేసి ఈ ఏడాదికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘కొత్తగా అమలులోకి తీసుకురానున్న చర్యలు ప్రజలతో మమేకమయ్యేలా, మరింత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేలా ఉంటాయి. ఇందులో ఎస్సై స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకం. అనునిత్యం ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండేది వీరే. ఈ ఏడాది ప్రజల అవసరాన్ని బట్టి పోలీసుల చర్యలు ఉంటాయి. ప్రతి జోన్‌కు వేర్వేరుగా ప్రాధాన్యాలు నిర్ధారిస్తున్నాం. నగర పోలీసు రానున్న రోజుల్లో మరింత యూజర్, సిటిజన్, కమ్యూనిటీ ఫ్రెండ్లీ కావాలన్నదే మా లక్ష్యం. సిటీ పోలీసు విభాగాన్ని ప్రొఫెషనల్‌గా దేశంలో నం.1గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పోలీసు విభాగం ఆలోచనలు ప్రతి ఒక్క అధికారికీ చేరాలనే ఉద్దేశంతోనే ఈ ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించాం. తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య మండలాలకు చెందిన ఎస్సై నుంచి పై స్థాయి అధికారులు ఇందులో పాల్గొన్నారు. జోన్ల వారీగా బలాలు, బలహీనతలను గుర్తించి కూలంకషంగా చర్చిస్తున్నాం. 2019కి సంబంధించి ప్రాధాన్యాలు, బలహీనతలను బలాలుగా మార్చుకునే మార్గాలపై చర్చించాం. ఈ నేపథ్యంలో సిటీ పోలీసు విజన్. స్ట్రాటజీ నిర్ధారిస్తున్నాం. సిటీలోని ప్రతి ఠాణాకు, జోన్‌కు కొన్ని ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. ఒక్కో జోన్‌కు ఒక్కో రకమైన అవసరాలు, ప్రాధాన్యాలు కనిపిస్తాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రాధాన్యాలను నిర్ధారిస్తున్నాం. ఈ ఏడాదిలో ఎస్సైలను ఉత్తమ నాయకుడిగా తీర్చిదిద్దడానికి కీలక ప్రాధాన్యం ఇస్తున్నాం. సిటీ పోలీసు వింగ్‌లో 550 మంది డైరెక్ట్ రిక్రూట్ సబ్–ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరంతా పోలీసు విభాగానికి బలం. ఈ అధికారులకు అన్ని కోణాల్లోనూ సమగ్ర తర్ఫీదు ఇస్తాం. నెల రోజుల వ్యవధిలో మొదటి విడత శిక్షణ పూర్తి చేస్తాం. 2018లో నగరంలో స్నాచింగ్స్ 30 శాతం తగ్గాయి. వీటిని మరింత తగ్గించేందుకు కృషి చేస్తాం. బయటి గ్యాంగ్‌లు నగరంలో అడుగుపెట్టకుండా నిరోధించేందుకు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అధికారులతో టచ్‌లో ఉంటున్నాం. సాధ్యమైనంత వరకు ఏ గ్యాంగ్‌ను నగరంలోని రానీయం. జరిగిన ప్రతి కేసునూ వారం లోనే కొలిక్కి తీసుకువస్తాం. సైబర్ నేరాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రతి మెట్రో నగరంలోనూ జరుగుతున్నాయి.. పెరుగుతున్నాయి. టెక్నాలజీ వినియోగం పెరగడమే అందుకు కారణం. సిటీ పోలీసు తరఫున ఎస్సై ఆపై స్థాయి వారికి రానున్న మూడు నెలల్లో వర్క్ షాపులు నిర్వహించి ఈ కేసుల దర్యాప్తులోనూ శిక్షణ ఇస్తాం. సీసీఎస్ ఆధీనంలో అత్యాధునిక సైబర్ ల్యాబ్ ఉంది. దీనిని ఇంకా ఆధునీకరించడంతో పాటు అందులోని సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి ధీటుగా మారుస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారు ఎవరైనా చర్యలు తప్పవు. నగరంలో ప్రతి ఒక్కరి భద్రత సిటీ పోలీసుల బాధ్యత. ఆస్పత్రులతో పాటు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరుగుతోందని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేతప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అరెస్టులు తప్పవు’ అని సీపీ పేర్కొన్నారు. -
పోలీసుల కాఠిన్యం
నెల్లూరు(వీఆర్సీసెంటర్) : ఫ్రెండ్లీ పోలీస్‌లుగా ప్రజలతో వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు తెలియజేస్తున్నా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని రాపూరు ప్రాంతానికి చెందిన, రాపూరు నరసింహరావు, లక్ష్మమ్మ వృద్ధ దంపతులు. లక్ష్మమ్మ కొన్ని సంవత్సరాలనుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. వారానికి రెండు రోజులు మంగళ, శుక్ర వారాల్లో నెల్లూరు చింతారెడ్డిపాళెంలోని నారాయణ ఆస్పత్రిలో క్రమం తప్పకుండా డయాలసిస్ చేసుకోవాల్సి ఉంది. ప్రతి వారం రెండు రోజులు నెల్లూరుకు వచ్చి చికిత్స చేయించుకుని వెళ్తుండేవారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా రాపూరులోని వారి బంధువులకు చెందిన కారులో, నారాయణ ఆస్పత్రికి వచ్చి డయాలసిస్ చేసుకుని తిరిగి రాత్రి రాపూరుకు వెళుతుండేవాడు. నగరంలోని ఆనం వెంకటరెడ్డి విగ్రహం వద్దకు చేరుకోగా, ప్రమాదవశాత్తు, ముందు వెళ్తున్న ఓ స్కూటరిస్టును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే స్కూటర్లో ప్రయాణిస్తున్న పోలీసుశాఖకు చెందిన దంపతులు కింద పడ్డారు. దీంతో ఆగ్రహించిన ఆ పోలీసు డ్రైవర్‌ను బలవంతంగా కారులోంచి బయటకు లాగాడు. కారులో ప్రయాణిస్తున్న లక్ష్మమ్మ, నరసింహరావు కుమారుడు శ్రీనివాసులు ఎంతో బతిమిలాడారు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని, డ్రైవర్‌ను తీసుకుపోతే, తన తల్లి పరిస్థితి విషమిస్తుందని వేడుకున్నారు, సదరు ఆ పోలీసు పట్టించుకోకుండా, కారు డ్రైవరు ఎస్కె.సలామ్‌ను సీసీఎస్‌కు తీసుకెళ్లాడు. గంట సేపు కారులోనే అనారోగ్యంతో ఉన్నా లక్ష్మమ్మను చూసి స్థానికుల మనస్సు కలచివేసింది. గంట తరువాత పోలీసులు డ్రైవర్‌ను విడిచి పెట్టారు. అయితే ఫ్లెండ్లీ పోలీసు అంటే ఇలాగు ఉంటారా అని స్థానికులు చర్చించుకున్నారు. -
పోలీసులు ఉన్నా.. హత్యను ఆపలేకపోయారు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అత్తాపూర్‌లో బుధవారం పట్టపగలు జరిగిన రమేష్ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులే కాదు.. సామాన్యులనూ ఉలిక్కిపడేలా చేసింది. రమేష్‌ను ఇద్దరు వ్యక్తులు వెంటాడి మరీ నరుకుతుంటే పోలీసులు సమీపంలో ఉండి కూడా స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏ కష్టమొచ్చినా, ముప్పు ఎదురైనా ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే. అలాంటి ఖాకీలే చేష్టలుడిగి చూస్తుంటే తమకు ఇక రక్షణ ఎక్కడన్నది ఇప్పుడు ప్రతి వ్యక్తి మదినీ తొలుస్తున్న ప్రశ్న. ‘ఆధునికత’ అంటూ దూసుకుపోతున్న పోలీసింగ్‌లో ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీస్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చినా ఉపయోగమేంటి? అత్తాపూర్‌లో జరిగిన ఉదంతాన్నే తీసుకుంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు నడిరోడ్డుపై ఛేజింగ్ జరిగింది. ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు వెంటాడుతూ చంపడానికి ప్రయత్నించారు. ‘డయల్–100’కు ఫోన్ చేసినా.. ఐదు నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉది.. అయితే అలా వచ్చిన పోలీసుల స్పందన ఏంటన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. రమేష్‌ను హత్య చేస్తున్న సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసు వాహనంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందులోంచి దిగిన ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ప్లాస్టిక్ లాఠీలతో హతుడు, హంతకుల సమీపం నుంచి తిరిగారే తప్ప అడ్డుకోవడానిగాని, హంతకులను బంధించడాని గాని ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఫోన్ వచ్చాక ఎంత తక్కువ సమయంలో స్పందించినా ఉపయోగమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయుధం ఉంటే తప్పేంటి? రమేష్ హత్య ఉదంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్, క్రైమ్ కానిస్టేబుళ్లు సరిగ్గా స్పందించక పోవడానికి ప్రధాన కారణం వారు నిరాయుధులై ఉండడం. ఆయుధం అవసరం లేని ట్రాఫిక్ పోలీసులు.. అవసరమైన క్రైమ్ పోలీసులు సైతం ‘ఒట్టి చేతుల తో’ ఉండాల్సి వచ్చింది. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాలు అమల్లోకి వచ్చాక ఆయుధాలు అటకెక్కాయి. ఒకప్పుడు ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు రివాల్వర్స్ లేదా పిస్టల్స్, ఆ కింద స్థాయి సిబ్బంది వద్ద 303 లేదా ఎస్ఎల్ఆర్లు ఉండేవి. ఆయుధం పోలీసులకు యూనిఫాంలో భాగమే కాదు.. శరీరంలో భాగం లాంటిదని వారికి శిక్షణ నుంచే చెబుతుంటారు. అలాంటిది ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఈ ఆయుధాలను పక్కన పెట్టేశారు. చంపైనా ప్రాణాలు కాపాడుకునే అవకాశం.. సమాజంలో ప్రతి వ్యక్తికీ ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉంటుంది. దాడి చేస్తూ ప్రాణహాని తలపెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చంపైనా తనను తాను కాపాడుకునే అవకాశాన్ని చట్టం సామాన్య ప్రజలకే కల్పించింది. పోలీసులకు కూడా కళ్ల ముందు దారుణం జరుగుతుంటే దుండగులను కాల్చడమో, గాల్లోకి కాల్పులు జరిపి నిలువరించి పట్టుకోవడమో చేసే అధికారం ఉంటుంది. అత్తాపూర్ ఉదంతంలో ఆ కానిస్టేబుళ్ల వద్ద తుపాకీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితా? ‘సాఫ్ట్ టార్గెట్’గా పేరున్న హైదరాబాద్ అనునిత్యం ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉంటుంది. స్థానిక ఉగ్రవాదుల నుంచి జాతీయ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థల వరకు అదను చూసి గురిపెడుతుంటాయి. నిత్యం కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి రాజధాని నగరంలో నిరాయుధులతో పోలీసింగ్ సురక్షితం కాదని పోలీస్ శాఖకు చెందిన నిపుణులు చెబుతున్నారు. బృందాలుగా రంగంలోకి దిగడం, బాంబు పేలుళ్ల వంటివి కాకుండా తుపాకులతో జనసమర్థ ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. సామాన్యులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఉదంతమే పోలీసులకు ఎదురైతే పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలు తెచ్చుకోవడమో, ‘ఇంటర్సెప్షన్’ వాహనాన్ని పిలవడమో చేయాలి. (ఈ వాహనాల్లోనే ఆయుధాలతో పోలీసులు ఉంటారు. ఇలాంటివి 17 వెహికల్స్ సిటీలో మాత్రమే ఉన్నాయి) ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. బ్యాంకుల వద్ద కాపలా కాసే సెక్యూరిటీ గార్డుల వద్దే తుపాకీ ఉండగా పోలీసుల వద్ద ఉండకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూడు కమిషనరేట్లలో పరిస్థితి ఇదీ.. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో కలిపి 140 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని మినహాయించినా మిగిలిన వాటిలో ప్రతి ఠాణాకు కనిష్టంగా ఒకటి, గరిష్టంగా 3 చొప్పున పెట్రోలింగ్ కోసం ఇన్నోవా వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనంలో డ్రైవర్ సహా నలుగురు నుంచి ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరికి హెడ్–కానిస్టేబుల్ లేదా ఏఎస్సై నేతృత్వం వహిస్తారు. ఆ వాహనంలో ప్రాథమిక చికిత్స చేసే కిట్లు, రెయిన్కోట్లు, కోన్స్లతో పాటు ప్లాస్టిక్ లాఠీలే ఉంటున్నాయి. అతి తక్కువ వాహనాల్లో మాత్రమే ‘స్టోన్ గార్డ్’ (రాళ్లు తగలకుండా ధరించే కోట్లు) వంటివి ఉంటున్నాయి. ప్రతి ఠాణాకు 2 నుంచి 4 వరకు పెట్రోలింగ్ బైక్‌లు (బ్లూకోల్ట్స్) ఉన్నాయి. దీనిపై ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున తమ పరిధుల్లో గస్తీ నిర్వహిస్తుంటారు. వీరి వద్ద వాకీటాకీ, ట్యాబ్, సెల్‌ఫోన్ మినహా కనీసం లాఠీ కూడా ఉండదు. అవసరమైనప్పుడే లాఠీలు పట్టుకెళతారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డివిజన్‌కు ఒకటి చొప్పున మొత్తం 17 ‘ఇంటర్సెప్టార్’ వాహనాలు ఉన్నాయి. ఒక్కో డివిజన్లో 3 నుంచి 5 ఠాణాలు ఉండగా.. ఈ వాహనాల్లోని సిబ్బంది వద్ద మాత్రమే తుపాకులు ఉంటున్నాయి. అదుపు తప్పిన సందర్భాల్లేవ్.. చేతిలో తుపాకీ ఉన్నంత మాత్రాన ఫ్రెండ్లీ పోలీసింగ్ అటకెక్కుతుందని భావించడం సమంజసం కాదన్నది నిపుణుల మాట. నాలుగేళ్ల కిందటి వరకు అన్ని స్థాయిల అధికారుల వద్దా ఆయుధాలు ఉండేవి. దోపిడీ, బందిపోటు ముఠాల కదలికల నేపథ్యంలో ఉమ్మడి సైబరాబాద్‌లో కానిస్టేబుళ్లు ఎస్ఎల్ఆర్లతో పెట్రోలింగ్ చేసేవారు. ఇప్పటి వరకు పోలీసులు అదుపు తప్పిన, విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన సందర్భాలు లేనేలేవు. గడిచిన 15 ఏళ్లలో చూసినా మక్కా మసీదులో పేలుడు జరిగిన 2007 మే 18న మాత్రమే పోలీసు తూటా పేలింది. అది కూడా అల్లరిమూకలు పెట్రోల్ బంక్‌కు నిప్పు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికే కాల్పులు జరిపారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఎలాంటి కాల్పులు జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల వెంట తుపాకులు ఉంటే తప్పేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణ
కొత్తగూడెం అర్బన్ : ఫ్రెండీ పోలీసింగ్‌తో నేరాలను సులభంగా నియంత్రించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక ఓఎస్డీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లాలోని అధికారులు, సిబ్బంది, ఐటీ సెల్, డీసీఆర్బీ సిబ్బందితో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని, వారి మనసులను చూరగొనేలా సేవలందించాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులకు అక్కడి సమస్యలను తెలిపిన వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా నేరాలను సులభంగా నియంత్రించవచ్చన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయడంలో కోర్టు అధికారులతో సమన్వయం పాటించాలని, కేసుల పురోగతిని ఎప్పటికప్పడు తెలుసుకోవాలని చెప్పారు. గుట్కా, మట్కా, పేకాట, గ్యాంబ్లింగ్ స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేయాలన్నారు. సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను ఇంకా పటిష్టం చేసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. లైసెన్స్‌లేకుండా, మద్యం తాగి వాహనాలు నడిపే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చిన్న పిల్లలపై, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు దిగేవారిపై చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నేర నియంత్రణకు సాంకేతికపరమైన అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి సమాచారాన్ని వాటిలో నిక్షిప్తం చేసేలా అధికారులు, సిబ్బంది అంతా నైపుణ్యం సాధించాలన్నారు. అసాంఘిక శక్తులపై ఎప్పటికప్పడు సమాచారం సేకరించి ముందుగానే వాటిని అదుపు చేసేందుకు కృషి చేయాలన్నారు. తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై సస్పెక్ట్ షీట్స్, రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు. ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఆర్ డీఎస్పీ కుమారస్వామి, కొత్తగూడెం డీఎస్పీ ఎస్ఎం.అలీ, పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు, మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా, ఎస్పీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, నాగరాజు, ఐటీ సెల్, డీసీఆర్బీ సీఐ రమాకాంత్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, సీఐలు రవీందర్, షుకూర్, సిహెచ్.శ్రీనివాస్, టి.గోపి, కుమారస్వామి, కొండ్రు శ్రీను, సత్యనారాయణరెడ్డి, అల్లం నరేందర్, వెంకటేశ్వర్లు, అశోక్, దోమల రమేష్, అబ్బయ్య, ఆర్ఐలు కృష్ణ, సోములు, కామరాజు, ప్రసాద్, దామోదర్, స్టేషన్ రైటర్లు, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు చేరువ కావాలి
ఎచ్చెర్ల క్యాంపస్ : ప్రజలకు పోలీసుల సేవలు చేరువ కావాలని, ప్రజలతో స్నేహ పూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయంలో సోమవారం ఏఆర్ పోలీసుల వార్షిక మొబలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. విధి నిర్వహణలో పోలీసులు ఓర్పుగా, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే జిల్లా ప్రగతి సాధ్యమని చెప్పారు. ప్రస్తుతం మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని చెప్పారు. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి మట్లాడుతూ.. మొబలైజేషన్ కార్యక్రమం పునశ్చరణ తరగతులుగా పోలీసులకు ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ భార్గవరావునాయుడు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు అధికారులు పాల్గొ న్నారు. -
అసలు పనిపై నిర్లక్ష్యం
అంతా ప్రత్యేక పనుల్లోనే నిమగ్నం నేరాల నియంత్రణపై అశ్రద్ధ ఇంకా దొరకని గొలుసు దొంగలు ఖాళీగానే క్రైం ఏసీపీ పోస్టు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఫ్రెండ్లీ పోలీసు నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలనేది లక్ష్యం. కొందరు అధికారులు మాత్రం నేరాల నియంత్రణలోనూ దీన్నే అనుసరిస్తున్నారు. ఫలితంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు ఆగడం లేదు. అనుభవజ్ఞులైన అధికారులు ఎక్కువ మంది ఉన్నా కొన్ని కేసులను ఛేదించడం లేదు. వరంగల్ నగరంలో ఒకే రోజు రెండు చోట్ల చైన్ స్నాచింగ్(గొలుసు దొంగతనాలు) జరిగి రెండు వారాలు గడుస్తున్నా దొంగలను ఇప్పటికీ పట్టుకోలేదు. నగర ప్రజలను ఎక్కువగా ఆందోళనకు గురిచేసే చైన్ స్నాచింగ్‌ల నియంత్రణ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పోలీసుల విధుల్లో కీలకమైన నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పర్యవేక్షణ తగ్గడం వల్లే ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీస్ కమిషనరేట్‌లోని అధికారులు, సిబ్బంది అంతా ఇప్పుడు ప్రత్యేకమైన పనుల్లో నిమగ్నమయ్యారని ఆ శాఖలోనే చర్చించుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ పోలీస్ సెకండ్ గేమ్స్, స్పోర్ట్స్ –2017 కార్యక్రమం మార్చి 3 నుంచి 7 వరకు వరంగల్‌లో జరగనుంది. ఏసీసీ స్థాయి నుంచి ఎస్సైల వరకు అందరు ఈ స్పోర్ట్స్ నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నగరంలోని వ్యాపారవేత్తలను, ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నారని పోలీసు శాఖలోనే చర్చ జరుగుతోంది. పోలీసు శాఖ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ ఏర్పాట్లకు పోలీసులు తమను సంప్రదిస్తుండడం ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కలిగిస్తోంది. స్పోర్ట్స్ కార్యక్రమానికి సహకరించాలని పోలీసులు పదేపదే తమను అడుగుతుండడంతో ప్రజాప్రతినిధులకు ఎటూ పాలుపోవడంలేదు. దొంగలు దొరకలేదు... ప్రజలు సురక్షితంగా జీవనం సాగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అర్బన్ పోలీస్ జిల్లాను కమిషనేట్గా మార్చింది. పోలీసు విధులలో నేరాల నియంత్రణ కీలకమైనది. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో మాత్రం విభిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరి 23న నగరంలో రెండో చోట్ల చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళ మెడలోని 4 తులాల బంగారాన్ని, సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మరో మహిళ మెడలోని 3 తులాల బంగారాన్ని దొంగలు కొన్ని గంటల వ్యవధిలోనే ఎత్తుకెళ్లారు. చాలా రోజుల తర్వాత నగరంలో చైన్ స్నాచింగ్ జరగడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆందోళనకు గురయ్యారు. వరంగల్ మహానగరంలో దొంగతనాలు తగ్గాయని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ... వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు. నగరంలో ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. దొంగతనాల నియంత్రణ కోసం పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా వాహనాలు సమకూర్చింది. పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు ఈ విధులను పక్కనబెడుతున్నారు. వాహనాలను ఏదో ఒక చోట నిలిపి కాలక్షేపం చేస్తున్నారు. చైన్ స్నాచింగ్ దొంగలను గుర్తించినట్లు పోలీసులు అంటున్నప్పటికీ వారు ఇంకా దొరకలేదు. ఈ సంఘటన కమిషనరేట్ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారుతోంది. నేరాల నియంత్రణలో కీలకమైన సెంట్రల్ క్రైం స్టేషన్ విభాగానికే అధికారిలేని పరిస్థితి ఉంది. సీసీఎస్ ఏసీపీగా వచ్చిన అధికారిణి మూడు రోజులకే దీర్ఘకాలపు సెలవుపై వెళ్లడంతో పోస్టు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. దీంతో నేరాలు, దొంగతనాల నియంత్రణపై ప్రభావం పడుతోంది. -
మహానుభావుల వినోదం
సాయికృష్ణ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘ఎందరో మహానుభావులు’. పల్లాడ శ్రీనివాస్, శ్రీలక్ష్మి నిర్మాతలు. సిద్ధార్థ్ స్వరపరిచిన పాటల సీడీలను సంగీత దర్శకుడు రఘు కుంచె విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘చిత్ర పరిశ్రమతో మాకు పరిచయం లేదు. కానీ, సినిమాలంటే మా అబ్బాయికి పిచ్చి. తన ఆశ నెరవేర్చడం కోసం ఈ సినిమా నిర్మించాం. తను తీసిన ‘ఫ్రెండ్లీ పోలీస్’ షార్ట్ ఫిల్మ్ చూసి సీయం కేసీఆర్ అభినందించారు’’ అన్నారు. ‘‘టైటిల్‌కు భిన్నంగా ఉండే పూర్తి వినోదాత్మక చిత్రమిది’’ అన్నారు సాయికృష్ణ. హీరోయిన్ అనీషా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత సాయికుమార్ పాల్గొన్నారు. -
ఫ్రెండ్లీ పోలీస్
-
ఇదేనా.. ‘ఫ్రెండ్లీ పోలీసు’
ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పోలీసులను చూసి భయపడకుండా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా వెళ్లే స్నేహపూరిత వాతావరణం కల్పిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటిస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం పోలీసుల తీరు అందుకు విరుద్ధంగా ఉంది. దీనికి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు రూపాయలు తక్కువ చేయలేదంటూ వ్యాపారితో శనివారం ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరే నిదర్శనం. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య స్థానిక బస్టాండ్ సమీపంలోని ఒక దుకాణంలో రూ. 15 విలువైన విజిల్ కొనుగోలు చేశాడు. హెడ్ కానిస్టేబుల్ ఐదు రూపాయలు తక్కువ చేయమని అడగగా, తమకు వచ్చిన ధరకే ఇచ్చాం సార్ అంటూ దుకాణం యజమాని రూ. 15 తీసుకున్నాడు. ఇదే రోజు సాయంత్రం బస్టాండ్ సమీపంలో సదరు దుకాణం ఎదురుగానే ఆర్మూర్ ఎస్సై బోసు కిరణ్ ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాల తనిఖీ నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ విజిల్ కొనుగోలు చేసిన దుకాణానికి చెందిన కార్మికుడు మోటార్ బైక్‌పై వెళ్లడాన్ని గమనించి పట్టుకున్నాడు. మోటార్ సైకిల్లో భద్రంగా ఉంచిన రిజిస్ట్రేషన్ కార్డు, ఇన్సూరెన్స్ పేపర్లను చూపించి, ఎదురుగానే దుకాణంలో ఉన్న డ్రైవింగ్ లెసైన్సును తీసుకువచ్చి హెడ్ కానిస్టేబుల్‌కు చూపించాడు. మీ దుకాణానికి పోలీసులు వస్తే డబ్బులు తక్కువగా తీసుకుంటలేరు ఇప్పుడు ఫైన్ కట్టాల్సిందేనంటూ హెడ్ కానిస్టేబుల్ నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ కార్మికుడు తమ యజమానిని తీసుకొని పోలీసుల వద్దకు వచ్చాడు. మోటార్ సైకిల్‌కు అవసరం ఉన్న పేపర్లు అన్ని ఉన్నాయంటూ చూపించే ప్రయత్నం చేసినా మోటార్ సైకిల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.ఈ విషయం అక్కడే ఉన్న సీఐ, ఎస్సైలకు దృష్టికి తీసుకువెళ్లినా, వారి స్టేషన్‌కు వెళ్లి తెచ్చుకోవాలని సెలవిచ్చారు. దీంతో చేసేది లేక బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్‌హెచ్‌వో రవి కుమార్‌కు మోటార్ సైకిల్ పేపర్లు చూపించి హెడ్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరును తెలిపారు. దీంతో ఆయన స్పందించి దుకాణం యజమానికి మోటార్ సైకిల్ ఇప్పించి హెడ్ కానిస్టేబుల్‌ను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. జరిగిన సంఘటన చిన్నదే అయినా ఐదు రూ. తక్కువ చేయలేదన్న కారణంగా హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు పోలీసులపై మరింత చెడు అభిప్రాయాన్ని కలిగించేదిగా ఉందని సంఘటన స్థలంలో ఉన్న వారు అభిప్రాయపడ్డారు. -
ఫ్రెండ్లీ పోలీస్ : ధర్నాకి వచ్చిన వారికిలా..!