యువత చెంతకే ఉద్యోగాలు.. | Hyderabad Police New Scheme Fo Job Connect For Youth | Sakshi
Sakshi News home page

యువత చెంతకే ఉద్యోగాలు..

Published Fri, Aug 23 2019 9:20 AM | Last Updated on Sat, Aug 31 2019 12:16 PM

Hyderabad Police New Scheme Fo Job Connect For Youth - Sakshi

కంటోన్మెంట్‌: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు, యువతతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు విభాగం తీసుకుంటున్న చర్యల్లో ‘జాబ్‌ కనెక్ట్‌’ ఒకటి. ప్రైవేట్‌ రంగంలోని వివిధ కంపెనీల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం నార్త్‌జోన్‌ పోలీసులు మెగా జాబ్‌ కనెక్ట్‌ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. ప్యాట్నీ సెంటర్‌లోని స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కార్ఖానా ఇన్‌స్పెక్టర్, జాబ్‌ మేళా ఇన్‌చార్జ్‌ వరవస్తు మధుకర్‌స్వామి గురువారం తెలిపారు. నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తర మండల డీసీపీ కల్మేశ్వర్‌ సింగెన్వార్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో ప్రవేశం, రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ తదితరాలన్నీ పూర్తిగా ఉచితం. టెన్త్‌ ఫెయిల్‌ అయిన వారి నుంచి ఐటీ ఉత్తీర్ణులైన వారి వరకు çప్రతి ఒక్కరికీ అనువైన ఉద్యోగాలు  ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. సెక్యూరిటీ గార్డు మొదలు ఐటీ ప్రొఫెషనల్‌ వరకు అన్ని రకాలైన ఉద్యోగాలకు ఇక్కడ నుంచి అవకాశం కల్పిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు స్వయంగా వచ్చి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎంపిక చేసుకున్న వారికి అక్కడికక్కడే జాయినింగ్‌ ఆర్డర్స్‌ అందజేస్తారు. వీరు ఆయా సంస్థల్లో కనిష్టంగా రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఆసక్తి కలవారు తమ బయోడేటాతో పాటు విద్యార్హత పత్రాల జిరాక్స్‌ ప్రతులు, ఫొటోలతో హాజరుకావాలని మధుకర్‌స్వామి తెలిపారు.  

ప్రముఖ కంపెనీలు సైతం...
యువతకు ఉపాధి కల్పించే దిశగా నగర పోలీసులు తీసుకుంటున్న చర్యలకు పలు ప్రతిష్టాత్మక కంపెనీలు, సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ఈ జాబ్‌మేళాలో గూగుల్, అమెజాన్, నాగార్జున కన్‌స్టక్ష్రన్స్, కిమ్స్‌ ఆసుపత్రి, వింపటా ల్యాబ్స్, అపోలో ఫార్మసీ, ఫిప్‌కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హైకేర్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నవతా ట్రాన్స్‌పోర్ట్, పేరం గ్రూప్‌ఆఫ్‌ కంపెనీస్, ప్రీమియర్‌ హెల్త్‌ గ్రూప్, రిలయన్స్‌ డిజిటల్, బిగ్‌బజార్, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్, శుభగృహæప్రాజెక్ట్, స్పెన్సర్స్, ఫార్చున్‌ మోటర్స్‌ సహా 75 సంస్థలు పాల్గొని యువతకు అవకాశాలు కల్పించనున్నాయి.  జాబ్‌మేళా ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సహాయ సహకారాల కోసం కార్ఖానా పోలీస్‌ సిబ్బంది ఫీబా (79011 21317), ప్రీతిలను (79011 21300) సంప్రదించాలి.  

 సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఒక్కరి ప్రయాణం ఒక అడుగుతోనే మొదలవుతుంది. అలాగే ఈ జాబ్‌ మేళాను నిరుద్యోగ యువత  సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే జాబ్‌ మేళా కోసం దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈసారి 8500 మందికి ఉపాధి చూపాలని లక్ష్యంగా నిర్ణయించాం. –మధుకర్‌ స్వామి, కార్ఖానా ఇన్‌స్పెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement