
మాట్లాడుతున్న విజయ్‌కుమార్
త్రిపురారం : టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతుందని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అయితగాని విజయ్‌కుమార్ విమర్శించారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యం లో చేపట్టిన చెగువేరా మోటార్ సైకిల్ యాత్ర శుక్రవారం హలియాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను విస్మరించిందన్నారు. ఈ బైక్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో పర్యటించి నిరుద్యోగుల సమస్యలపై సర్వే చేయనున్నట్టు చెప్పారు.
కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అవుతా సైదయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారపు నరేష్, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు పున్నా రాధకృష్ణ, బాబు, అజయ్ కుమార్, రాంబాబు, రాజు, వెంకట్, శ్రీను తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment